
ఫైనల్లో నిహారిక
సాక్షి, హైదరాబాద్: నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ బాక్సర్ గోనెళ్ల నిహారిక ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెర్బియాలోని రుమా పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో నిహారిక 80 కేజీల విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో నిహారిక 3-0తో గాబ్రియెలి దికొనెతై (లిథువేనియా)పై విజయం సాధించింది. 48 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ గూడూరు రమ్య కూడా ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీస్‌లో రమ్య 3-0తో ప్లియా క్రైసులా (గ్రీస్)ను ఓడించింది.