ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా అండర్-14 నెట్‌బాల్ టోర్నమెంట్‌లో బాలికల టీమ్ ను హైదరాబాద్ జిల్లా జట్టు కైవసం చేసుకుంది. బాలుర టీమ్‌లో హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. కరీంనగర్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌లో ఇటీవల ఈ పోటీలు జరిగాయి.
బాలికల విభాగం ఫైనల్లో హైదరాబాద్ జట్టు 7-4 స్కోరుతో ఖమ్మంపై విజయం సాధించింది. సెమీఫైనల్లో హైదరాబాద్ 7-5తో కరీంనగర్‌పై, ఖమ్మం 4-3తో వరంగల్‌పై గెలిచాయి. బాలుర విభాగం ఫైనల్లో ఖమ్మం చేతిలో 11-7 స్కోరుతో హైదరాబాద్ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్లో హైదరాబాద్ 5-3తో వరంగల్‌పై నెగ్గింది.
రాష్ట్ర స్కూల్ నెట్‌బాల్ జట్టులో రాధిక
జాతీయ స్కూల్ అండర్-14 నెట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లలో హైదరాబాద్ జిల్లా నుంచి రాధికతో పాటు ఆరుగురికి చోటు దక్కింది. ఈ పోటీలు నవంబరు చివరి వారంలో బిలాస్‌పూర్‌లో జరుగనున్నాయి.
బాలికల జట్టు: పి. రాధిక, భవాని ఠాకూర్ (గవర్నమెంట్ హైస్కూల్ విజయనగర్ కాలనీ), వినయ్‌శ్రీ (హోలీ ఫ్యామిలీ హైస్కూల్, తిరుమలగిరి). బాలుర జట్టు: రాహుల్(ఆర్యకన్య హైస్కూల్), సాయికిరణ్ (గవర్నమెంట్ హైస్కూల్ కాచిగూడ), సాయి ప్రణీత్ (భాష్యం మోడల్ స్కూల్ అంబర్‌పేట్)
బాలికల విజేత హైదరాబాద్
Published Sat, Oct 26 2013 12:23 AM | Last Updated on Fri, Sep 7 2018 5:34 PM
Advertisement
Advertisement