Net ball tournment
-
నెట్‌బాల్ కెప్టెన్లు బాలరాజ్, శిరీష
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ సీనియర్ నెట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు బాలరాజ్ (హైదరాబాద్) సారథ్యం వహిస్తాడు. పురుషుల జట్టుకు శిరీషా రాణి (రంగారెడ్డి) కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ పోటీలు మార్చి 1 (శనివారం) నుంచి 4 వరకు పాట్నాలో జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్ల జాబితాను రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సమ్మయ్య ప్రకటించారు. రాష్ట్ర పురుషుల జట్టు: బాలరాజ్ (కెప్టెన్), అక్తర్ పాషా (హైదరాబాద్), సాయికృష్ణ, శ్రవ ణ్ కుమార్ (కృష్ణా జిల్లా), ఓంప్రకాష్ (మెదక్), విహారి, అఖిల్ (ఖమ్మం), అనిల్ (వరంగల్), సందీప్(కరీంనగర్), మహేశ్వర్ (నిజామాబాద్), సాయి కుమార్ (రంగారెడ్డి). రాష్ట్ర మహిళల జట్టు: శిరీషా రాణి(కెప్టెన్), వేదవతి (రంగారెడ్డి), వరలక్ష్మి (పశ్చిమ గోదావరి), డి.పావని (హైదరాబాద్), ఆర్తి (ప్రకాశం), శివాని, హర్షిణి, అదితి, వాణి, దేవి వర్జిత (ఖమ్మం), రేష్మ (మెదక్), సంయుక్త (కృష్ణా), కోచ్ కమ్ మేనేజర్ విఘ్నేశ్. -
బాలికల విజేత హైదరాబాద్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా అండర్-14 నెట్‌బాల్ టోర్నమెంట్లో బాలికల టీమ్ ను హైదరాబాద్ జిల్లా జట్టు కైవసం చేసుకుంది. బాలుర టీమ్‌లో హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. కరీంనగర్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌లో ఇటీవల ఈ పోటీలు జరిగాయి. బాలికల విభాగం ఫైనల్లో హైదరాబాద్ జట్టు 7-4 స్కోరుతో ఖమ్మంపై విజయం సాధించింది. సెమీఫైనల్లో హైదరాబాద్ 7-5తో కరీంనగర్‌పై, ఖమ్మం 4-3తో వరంగల్‌పై గెలిచాయి. బాలుర విభాగం ఫైనల్లో ఖమ్మం చేతిలో 11-7 స్కోరుతో హైదరాబాద్ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్లో హైదరాబాద్ 5-3తో వరంగల్‌పై నెగ్గింది. రాష్ట్ర స్కూల్ నెట్‌బాల్ జట్టులో రాధిక జాతీయ స్కూల్ అండర్-14 నెట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర జట్లలో హైదరాబాద్ జిల్లా నుంచి రాధికతో పాటు ఆరుగురికి చోటు దక్కింది. ఈ పోటీలు నవంబరు చివరి వారంలో బిలాస్పూర్లో జరుగనున్నాయి. బాలికల జట్టు: పి. రాధిక, భవాని ఠాకూర్ (గవర్నమెంట్ హైస్కూల్ విజయనగర్ కాలనీ), వినయ్శ్రీ (హోలీ ఫ్యామిలీ హైస్కూల్, తిరుమలగిరి). బాలుర జట్టు: రాహుల్(ఆర్యకన్య హైస్కూల్), సాయికిరణ్ (గవర్నమెంట్ హైస్కూల్ కాచిగూడ), సాయి ప్రణీత్ (భాష్యం మోడల్ స్కూల్ అంబర్పేట్) -
విజయనగర్ కాలనీ స్కూల్‌కు రెండు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి అంతర్ పాఠశాలల నెట్‌బాల్ టోర్నమెంట్లో (బాలికల విభాగం) విజయనగర్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సత్తా చాటింది. అండర్-17, అండర్-14 రెండు విభాగాల్లోనూ ఈ పాఠశాల విజేతగా నిలిచింది. మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన అండర్-17 ఫైనల్లో విజయనగర్ కాలనీ 7-5 స్కోరుతో కేర్ మోడల్ హైస్కూల్‌పై విజయం సాధించింది. ఆర్యకహరి హైస్కూల్‌పై 7-5తో నెగ్గిన హోలీ ఫ్యామిలీ హైస్కూల్ మూడో స్థానంలో నిలిచింది. అండర్-14 (బాలికలు) విభాగంలో కూడా విజయనగర్ కాలనీ హైస్కూల్‌కే టైటిల్ దక్కడం విశేషం. ఫైనల్లో ఆ జట్టు 10-5 తేడాతో కాచిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఓడించింది. ఈ విభాగంలో మూడో స్థానంలో హోలీ ఫ్యామిలీ హైస్కూల్ నిలిచింది. ప్లేఆఫ్ మ్యాచ్‌లో హోలీ ఫ్యామిలీ 3-1తో కేర్ మోడల్ హైస్కూల్‌పై గెలుపొందింది.