సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి అంతర్ పాఠశాలల నెట్‌బాల్ టోర్నమెంట్‌లో (బాలికల విభాగం) విజయనగర్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సత్తా చాటింది. అండర్-17, అండర్-14 రెండు విభాగాల్లోనూ ఈ పాఠశాల విజేతగా నిలిచింది. మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన అండర్-17 ఫైనల్లో విజయనగర్ కాలనీ 7-5 స్కోరుతో కేర్ మోడల్ హైస్కూల్‌పై విజయం సాధించింది.
ఆర్యకహరి హైస్కూల్‌పై 7-5తో నెగ్గిన హోలీ ఫ్యామిలీ హైస్కూల్ మూడో స్థానంలో నిలిచింది. అండర్-14 (బాలికలు) విభాగంలో కూడా విజయనగర్ కాలనీ హైస్కూల్‌కే టైటిల్ దక్కడం విశేషం. ఫైనల్లో ఆ జట్టు 10-5 తేడాతో కాచిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఓడించింది. ఈ విభాగంలో మూడో స్థానంలో హోలీ ఫ్యామిలీ హైస్కూల్ నిలిచింది. ప్లేఆఫ్ మ్యాచ్‌లో హోలీ ఫ్యామిలీ 3-1తో కేర్ మోడల్ హైస్కూల్‌పై గెలుపొందింది.
విజయనగర్ కాలనీ స్కూల్‌కు రెండు టైటిళ్లు
Published Wed, Sep 4 2013 12:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement