ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఆర్చరీ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ నట్టి శివ కుమార్ (50) శుక్రవారం ఆకస్మికంగా కన్నుమూశారు. షాపింగ్‌మాల్‌కు వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆర్చరీ సంఘానికి సేవలందించిన ఆయన మృతి పట్ల తెలంగాణ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి ఈగ సంజీవ రెడ్డి సంతాపం ప్రకటించారు.
ఆయనతో పాటు హైదరాబాద్ ఆర్చరీ సంఘం కార్యదర్శి పి.అరవింద్ కుమార్ టోలిచౌకి సాలార్‌జంగ్ కాలనీలోని శివకుమార్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. శివకుమార్ అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.