హార్ట్ టచింగ్ ఎమోషనల్‌గా ‘నరుడి బ్రతుకు నటన’ | Shivakumar Ramachandravarapu And Nithin Prasanna Interesting Comments About Narudi Brathuku Natana Movie | Sakshi
Sakshi News home page

హార్ట్ టచింగ్ ఎమోషనల్‌గా ‘నరుడి బ్రతుకు నటన’

Published Thu, Oct 24 2024 12:03 PM | Last Updated on Thu, Oct 24 2024 12:52 PM

Shivakumar Ramachandravarapu, Nithin Prasanna Talk About Narudi Brathuku Natana Movie

హీరోలు శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న

 శివకుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ ప్రసన్న లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్‌ యోగి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, సుకుమార్‌ బోరెడ్డి, డా. సింధు రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా శివకుమార్‌ రామచంద్రవరపు మాట్లాడుతూ–  ‘‘ఈ సినిమాలో సంపన్న కుటుంబంలో పుట్టిన సత్య అనే పాత్ర చేశాను. ఎంతో సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్న సత్య కొన్ని పరిస్థితుల కారణంగా కేరళలోని ఓ అజ్ఞాత ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సత్యకు ఎవరు తోడుగా నిలిచారు? ఏం జరిగింది అన్నది ఈ సినిమా కథాంశం’’ అన్నారు. 

నితిన్‌ ప్రసన్న మాట్లాడుతూ– ‘‘సుహాస్‌ ‘అంజాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాలో నెగటివ్‌ రోల్‌ చేశాను. కానీ ‘నరుడి బ్రతుకు నటన’లో ఇందుకు భిన్నమైన పాత్రలో కనిపిస్తాను. మనిషి తన జీవితంలో అన్ని రకాల ఎమోషన్స్‌ను అనుభూతి చెందుతాడు. ఓ నటుడు కూడా అంతే. ఈ విషయాన్నే ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాం. భావోద్వేగపూరితమైన నటన కనబర్చడానికి స్కోప్‌ ఇచ్చిన కథ ఇది. ఇక నాకు తెలుగు, తమిళంతో పాటు మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి’’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement