
వాషింగ్టన్:ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో రష్యాతో జరుగుతున్న చర్చలకు తమను ఆహ్వానించలేదని జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘జెలెన్‌స్కీ ఒక అసమర్థ నేత. అసలు రష్యా,ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి కారణమే జెలెన్‌స్కీ. యుద్ధానికి ముగింపు పలికేందుకు జెలెన్‌స్కీ రష్యాతో ఎప్పుడో డీల్ కుదుర్చుకోవాల్సింది.
సౌదీలో చర్చలకు తమను పిలవలేదని జెలెన్‌స్కీ అంటున్నాడు. మూడేళ్ల నుంచి ఆయన ఏం చేస్తున్నాడు. ఈ నెలలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడతా. యుద్ధం ఆపేందుకు పుతిన్,జెలెన్‌స్కీ ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నా’అని ట్రంప్ తెలిపారు.
కాగా, రష్యా,ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధంపై సౌదీఅరేబియాలో జరుగుతున్న చర్చలకు తమను పిలవకపోవంపై జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాము లేకుండా తమ దేశానికి సంబంధించిన చర్చలు ఎలా జరుగుతాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా మద్దతు లేకుండా తాము ఎక్కువ రోజులు మనుగడ సాధించలేమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment