France team
-
సెమీఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్.. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ ఓటమి
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తమ జోరును కొనసాగిస్తుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీఫైనల్లో ఫ్రాన్స్ అడుగు పెట్టింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించిన యూరప్ జట్టు తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇంగ్లీష్ జట్టు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ.. ఓటమి నుంచి మాత్రం గట్టుక్కలేకపోయింది. మ్యాచ్ తొలి ఆర్ధబాగంలో ఫ్రాన్స్ ఆటగాడు అరెలియన్ చౌమెనీ అద్భుతమైన కిక్‌తో తమ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. దీంతో ఫ్రాన్స్ 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడినప్పటికీ గోల్ మాత్రం సాధించలేకపోయాయి. ఇక సెకెండ్ హాఫ్‌లో బ్రిటన్ ఆటగాడు హారీ కేన్ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో ఇరు జట్లు 1-1 సమంగా నిలిచాయి. ఈ క్రమంలో ఇరు జట్ల శిబిరాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇటువంటి సమయంలో 78 నిమిషాల వద్ద ఫ్రాన్స్ ఆటగాడు ఒలివర్ గిరౌడ్ సంచలన గోల్‌తో తమ జట్టును 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత 84 నిమిషాల వద్ద ఇంగ్లాండ్‌కు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. అయితే తొలి పెనాల్టీని గోల్‌గా మలిచిన హారీ కేన్ రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. దీంతో 2-1 తేడాతో ఓటమిపాలైన ఇంగ్లీష్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఫ్రాన్స్ సెమీస్‌లో ఆఫ్రికా జట్టు మొరాకోతో తలపడనుంది. చదవండి: IND vs BAN: ఒక్కడి చేతిలో బంగ్లా ఓడింది.. 28 పరుగులు తక్కువ! అదే జరిగితే -
ఒలింపిక్స్ టీమ్‌పై దాడికి తీవ్రవాదుల కుట్ర
పారిస్: రియో ఒలింపిక్స్ క్రీడల్లో తమ జట్టుపై తీవ్రవాదులు దాడికి కుట్ర పన్నారని ఫ్రాన్స్ వెల్లడించింది. పథకం ప్రకారం తమ స్పోర్ట్స్ టీమ్‌పై దాడి చేయాలని తీవ్రవాదులు పన్నాగం చేస్తున్నారని ఫ్రాన్స్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్(డీఆర్ఎం) అధిపతి జనరల్ క్రిస్టోఫి గొమార్ట్ అధికారిక నివేదికలో పేర్కొన్నారు. మే నెలలో పార్లమెంటరీ కమిషన్‌కు సమర్పించిన నివేదికలో ఆయనీ విషయాన్ని పొందుపరిచారు. పారిస్‌లో గత నవంబర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై దర్యాప్తు జరుపుతుండగా ఈ కుట్ర గురించి తెలిసిందని పేర్కొన్నారు. బ్రెజిల్ పౌరుడితో దాడి చేయించాలని తీవ్రవాదులు వ్యూహం రచించారని తెలిపారు. ఎప్పుడు, ఎక్కడ దాడి చేయనున్నారనే వివరాలు వెల్లడి కాలేదు. అయితే దీనికి సంబంధించి ఫ్రాన్స్ నుంచి తమకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని బ్రెజిల్ న్యాయశాఖ మంత్రి అలెగ్జాండర్ మొరాయిస్ ఈ నెలారంభంలో అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ లో పాల్గొనే 10,500 మంది అథెట్లకు రక్షణ కల్పించేందుకు 85 వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేస్తోంది. ఇందులో 47 వేల మంది పోలీసులు కాగా, 38 వేల మంది సైనికులు. -
ఫ్రాన్స్.. ‘పాంచ్’ పటాకా
యూరో కప్‌లో ఐస్లాండ్ సంచలన ప్రదర్శన క్వార్టర్స్‌లో ముగిసింది. సూపర్స్టార్లతో నిండిన ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు తమ స్థాయికి తగ్గట్టుగానే ఆడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అయితే పసికూన ఐస్లాండ్ ఈ మ్యాచ్‌లో అసాధారణ తెగువ చూపింది. ఫ్రాన్స్ డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకుంటూ ద్వితీయార్ధంలో రెండు గోల్స్ కూడా సాధించి శభాష్ అనిపించుకోగలిగింది. ఇక సెమీస్‌లో తమ చిరకాల శత్రువు జర్మనీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఫ్రాన్స్ సిద్ధమవుతోంది. * యూరో కప్ సెమీస్‌లోకి ప్రవేశం * క్వార్టర్స్‌లో 5-2తో ఐస్లాండ్పై విజయం పారిస్: యూరో చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా నిలిచేందుకు ఫ్రాన్స్ జట్టు మరో అడుగు ముందుకేసింది. ఆదివారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్స్‌లో స్ట్రయికర్ ఒలివియర్ గిరౌడ్ రెండు గోల్స్‌తో అదరగొట్టడంతో ఆతిథ్య జట్టు 5-2 తేడాతో ఐస్లాండ్పై నెగ్గింది. దీంతో తమ చిరకాల శత్రువు జర్మనీతో అమీతుమీ తేల్చుకునేందుకు శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బరిలోకి దిగనుంది. గత ప్రపంచకప్ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ జట్టు జర్మనీ చేతిలోనే ఓడింది. ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ను కంగుతినిపించిన ఐస్లాండ్ను ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు తేలిగ్గా తీసుకోలేదు. వారి బలం, బలహీనలతలపై దృష్టి పెట్టి తగిన వ్యూహాలతో బరిలోకి దిగింది. దీనికి తోడు సొంత అభిమానుల మద్దతుతో ఆరంభం నుంచే చెలరేగిన ఫ్రాన్స్ పూర్తి స్థాయి అటాకింగ్‌తో తొలి అర్ధభాగంలోనే నాలుగు గోల్స్‌తో పైచేయి సాధించింది. ఓవరాల్‌గా ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ గిరౌడ్ (12, 59వ నిమిషాల్లో), పోగ్బా (20), పయేట్ (43), గ్రిజ్మన్ (45) గోల్స్ సాధించారు. ఐస్లాండ్కు సితోర్సన్ (56), జర్నాసన్ (84) గోల్స్ అందించారు. ఆరంభం నుంచే దూకుడు మ్యాచ్ ప్రారంభం నుంచే ఫ్రాన్స్ జట్టు ఆటగాళ్లు ఎదురుదాడికి దిగారు. దీంతో జట్టు 12వ నిమిషంలో ఖాతా తెరిచింది. మిడ్‌ఫీల్డ్ నుంచి మటౌడి ఇచ్చిన పాస్‌ను ఏరియాలో అందుకున్న గిరౌడ్ గోల్‌గా మలిచాడు. 18వ నిమిషంలో ఐస్లాండ్ ఆటగాడు బొడ్వర్సన్ హెడర్ ప్రయత్నం నేరుగా గోల్‌కీపర్ లోరిస్ చేతుల్లోకి వెళ్లింది. కానీ మరో నిమిషంలోనే రైట్ వింగ్ కార్నర్ నుంచి గ్రిజ్మన్ ఇచ్చిన పాస్‌ను పాల్ పోగ్బా హెడర్ గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. ఇదే జోరుతో ప్రథమార్ధం మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ఫ్రాన్స్ రెండు గోల్స్‌తో రెచ్చిపోయింది. 43వ నిమిషంలో గ్రిజ్మన్ ఇచ్చిన పాస్‌ను ఐస్లాండ్ ముగ్గురు డిఫెండర్లకు చిక్కకుండా బాటమ్ కార్నర్ వైపు గోల్ చేయగా 45వ నిమిషంలో బ్యాక్ నుంచి పోగ్బా ఇచ్చిన లాంగ్ పాస్‌ను అందుకున్న గ్రిజ్మన్ బంతిని కాస్త ముందుకు తీసుకెళ్లి చిప్ షాట్‌తో గోల్ కీపర్ పైనుంచి నెట్లోకి పంపి ఫస్ట్ హాఫ్‌ను 4-0తో ముగించాడు. 56వ నిమిషంలో ఐస్లాండ్ మ్యాచ్‌లో బోణీ చేసింది. రైట్ ఫ్లాంక్ నుంచి సిగర్డ్సన్ ఇచ్చిన క్రాస్‌ను పోస్టుకు అతి సమీపం నుంచి సితోర్సన్ గోల్ చేశాడు. అయితే వెంటనే కోలుకున్న ఫ్రాన్స్ 59వ నిమిషంలోనే ఐదో గోల్ చేసింది. 40 గజాల దూరం నుంచి సంధించిన పయేట్ ఫ్రీకిక్‌ను వేగంగా అందుకున్న గిరౌడ్ హెడర్‌తో గోల్ చేశాడు. పలు ప్రయత్నాల అనంతరం ఐస్లాండ్ ఫ్రాన్స్ డిఫెన్స్‌ను ఛేదించి రెండో గోల్ చేయగలిగింది. అరి స్కులసోన్ క్రాస్‌ను జర్నాసన్ గోల్ చేసి ప్రత్యర్థి ఆధిక్యాన్ని కాస్త తగ్గించగలిగినా ప్రయోజనం లేకపోయింది. సెమీస్‌లో ఎవరితో ఎవరు పోర్చుగల్ X వేల్స్ గురువారం రాత్రి 12.30 గంటల నుంచి జర్మనీ X ఫ్రాన్స్ శుక్రవారం రాత్రి 12.30 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం 1 యూరోలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క మార్పు కూడా లేకుండా బరిలోకి దిగిన జట్టుగా ఐస్లాండ్ చరిత్ర సృష్టించింది. -
భారత్ క్లీన్‌స్వీప్
వాటిగినెస్ (ఫ్రాన్స్) : యూరోప్ పర్యటనలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు ఫ్రాన్స్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలి మ్యాచ్‌లో 2-0తో నెగ్గిన సర్దార్ సింగ్ బృందం... బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 4-1తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జిందర్ (14వ, 44వ ని.లో) రెండు గోల్స్ చేయగా... మొహమ్మద్ ఆమిర్ ఖాన్ (30వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (52వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫ్రాన్స్ జట్టుకు బౌమ్‌గార్టెన్ (21వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత్ ఈనెల 10న స్పెయిన్‌తో మ్యాచ్ ఆడుతుంది. -
ఫ్రాన్స్ దూకుడు
నాలుగేళ్లలో ఎంత మార్పు.. ప్రస్తుతం ఫ్రాన్స్ జట్టు ప్రదర్శనను గమనిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆ మెగా ఈవెంట్లో ఫ్రాన్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశలోనే అవమానకర రీతిలో నిష్ర్కమించింది. ఈసారి మాత్రం తమ లోపాలను పూర్తి స్థాయిలో సరిదిద్దుకుని మంచి సమతూకంతో బరిలోకి దిగి ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి దాదాపుగా నాకౌట్ దశకు చేరుకుంది. 5-2తో స్విట్జర్లాండ్‌పై ఘనవిజయం సాల్వెడార్: చాంపియన్ తరహా ఆటతీరుతో అదరగొడుతున్న ఫ్రాన్స్ వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో తమకన్నా మెరుగైన స్విట్జర్లాండ్‌ను చిత్తుగా ఓడించి నాకౌట్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. గ్రూప్ ‘ఇ’ లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 5-2 తేడాతో ఫ్రాన్స్ గెలిచింది. 1958 ప్రపంచకప్ తర్వాత ఓ మ్యాచ్‌లో ఐదు అంతకన్నా ఎక్కువ గోల్స్ సాధించడం ఫ్రాన్స్‌కు ఇదే తొలిసారి. మరోవైపు ఈ మైదానంలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్స్ వర్షం కురవడం విశేషం. నెదర్లాండ్స్ 5-1తో స్పెయిన్‌ను, జర్మనీ 4-0తో పోర్చుగల్‌ను ఇక్కడే మట్టికరిపించాయి. ఇదే స్థాయిలో ఫ్రాన్స్ కూడా ఆద్యంతం ఆధిపత్యం చూపుతూ స్విస్‌ను తేరుకోనీయలేదు. ఫ్రాన్స్ తరఫున గిరౌడ్, మటౌడి, వాల్బుయేనా, బెంజెమా, సిసోకో గోల్స్ సాధించగా స్విస్ తరఫున జెమైలి, జాకా చెరో గోల్ చేశారు. మ్యాచ్ ప్రారంభమైంది మొదలు ఫ్రాన్స్ ఆటగాళ్లు చెలరేగారు. దీంతో 17వ నిమిషంలోనే ఖాతా తెరిచింది. వాల్బుయేనా కొట్టిన కార్నర్ కిక్‌ను స్ట్రయికర్ ఒలివియర్ గిరౌడ్ అద్భుత రీతిలో హెడర్ గోల్ సాధించి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్‌కు ఇది వందో గోల్ కావడం విశేషం. దీన్నుంచి తేరుకునేలోపే స్విస్‌కు మరో షాక్ తగిలింది. సరిగ్గా 66 సెకన్ల (18వ ని.) అనంతరం స్విస్ పేలవ డిఫెన్స్‌ను సొమ్ము చేసుకుంటూ బెంజెమా అందించిన పాస్‌ను మటౌడీ గోల్ చేసి జట్టును ఆనందంలో ముంచెత్తాడు. ఇప్పటిదాకా ఈ టోర్నీలో అత్యంత స్వల్ప విరామంలో నమోదైన గోల్ ఇదే. 32వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో స్టార్ స్ట్రయికర్ బెంజెమా విఫలమయ్యాడు. స్విస్ గోల్‌కీపర్ బెనగ్లియో కుడి వైపునకు వంగి తక్కవ ఎత్తులో వచ్చిన బంతిని సులువుగానే ఒడిసిపట్టుకున్నాడు. అయితే స్విస్‌కు ఈ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. మరో ఎనిమిది నిమిషాల్లో(40వ ని.)నే గిరౌడ్ ఇచ్చిన పాస్‌ను ఆరు గజాల దూరం నుంచి వాల్బుయేనా గోల్‌గా మలిచి జట్టుకు 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. ద్వితీయార్ధంలో స్విస్ ఆటగాళ్లు పోటీనిచ్చినప్పటికీ ఫ్రాన్స్‌ను గోల్స్ చేయకుండా ఆపలేకపోయారు. 67వ నిమిషంలో పోగ్బా ఇచ్చిన పాస్ ను బెంజెమా గోల్‌గా మలిచాడు. ఈ టోర్నీలో ఇది తనకు మూడో గోల్. 72వ నిమిషంలో బెంజెమా ఇచ్చిన పాస్‌ను సిసోకో గోల్ చేశాడు. చివర్లో ఆరు నిమిషాల వ్యవధి (81,87వ ని.)లో స్విట్జర్లాండ్‌కు రెండు గోల్స్ లభించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని కాస్త తగ్గించగలిగింది.