పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణుకుపుట్టించిన భయంకరమైన వైరస్ ఎబోలా. దీని ధాటికి ఆప్రికా దేశాలు అట్టడుగిపోయాయి. రోజురోజుకీ వైరస్ వ్యాప్తి తీవ్రత అధికమవుతుండటంతో దీని బారిన పడి జనం పిట్టలా రాలిపోతున్నారు. ఈ వైరస్ తీవ్రతతో ప్రక్క దేశాలు సైతం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాయి. దక్షణాఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) బుధవారం వెల్లడించింది. ఎబోలా కేసుల రేటు క్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది.
అయితే అంటువ్యాధిలా ప్రబలిన ఎబోలా వైరస్ వ్యాప్తి నిజానికి తగ్గుముఖం పట్టిన ధోరణి కనిపిస్తుందని తెలిపింది. ఎబోలా ఇన్ఫెక్షన్ తీవ్రత ప్రస్తుతం తగ్గినట్టు కనిపించినా దాని తీవ్రత చాలాకాలం వరకు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. వైరస్ తీవ్రత తగ్గటం ఆశాజనకంగా ఉన్నా అది పూర్తిగా నిర్మూలన అయినట్టు భావించలేమని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రూష్ ఐల్వార్డ్ విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం జెనీవాలో ఎబోలా అదుపులో ఉన్న మళ్లీ వైరస్ విజృంభించే అవకాశం ఉందని ఐల్వార్డ్ హెచ్చరించారు.
లైబీరియాలో తగ్గుతున్న ఎబోలా కేసులు
Published Wed, Oct 29 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM
Advertisement
Advertisement