జెనీవా: పశ్చిమ ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ మరింతగా విస్తరించకుండా మూడు నెలల్లోగా నియంత్రించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం తెలిపింది. 6 నుంచి 9 నెలల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టాలని అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈలోగా ప్రస్తుతం నమోదైన 3,062 కేసుల సంఖ్య 20 వేలకుపైగా దాటొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఎబోలా వ్యాక్సిన్ పరీక్షలను వేగవంతం చేస్తున్నామని. ఫార్మా దిగ్గజం గ్లాక్సోస్మిత్‌లైన్ లండన్‌లో ప్రకటించింది.
మీరేం చేస్తున్నారు
మరోవైపు మన దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటో సెప్టెంబర్ 2లోగా వివరించాలని బాంబే హైకోర్టు గురువారం పిల్ విచారణ సందర్భంగా కేంద్రం, మహారాష్ట్ర సర్కారును కోరింది.
3 నెలల్లో ఎబోలా వ్యాప్తి నియంత్రణ
Published Fri, Aug 29 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement