Glaxo-Smith-line
-
హార్లిక్స్ బ్రాండ్ కొనుగోలుకు ఐటీసీ ఆసక్తి
సాక్షి,ముంబై: అత్యంతవిలువైన ఎఫ్ఎంసీజీ కంపెనీగా నిలిచిన ఐటీసీ హార్లిక్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. జీఎస్కేకు చెందిన హార్లిక్స్ బ్రాండును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అమ్మకానికి సరైన ధరను నిర్ణయింస్తే హార్లిక్స్ కొనుగోలు చేస్తామని ని ఐటీసీ ఎండీ సంజయ్ పురి చెప్పారు. ఐటీసీతో పాటు నెస్లే, డాబర్, మోండలేజ్, క్రాఫ్ హీంజ్, హిందుస్తాన్ యునిలీవర్ హార్లిక్స్ను కొనేందుకు పోటీలో ఉన్నాయి. మాల్ట్ ఆధారిత డ్రింక్ గా ఉన్న హార్లిక్స్ దేశంలో మంచి ఆదరణనుపొందింది.నోవార్టిస్ ను కొనుగోలు చేసిన తరువాత గ్లాక్సో స్మిత్ క్లయిన్, హార్లిక్స్ ను విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీఎస్కే భారత అనుబంధ విభాగంలో హార్లిక్స్ కు 72.5 శాతం వాటా ఉండగా, దీన విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 3.1 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుదని అంచనా. -
3 నెలల్లో ఎబోలా వ్యాప్తి నియంత్రణ
జెనీవా: పశ్చిమ ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ మరింతగా విస్తరించకుండా మూడు నెలల్లోగా నియంత్రించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం తెలిపింది. 6 నుంచి 9 నెలల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టాలని అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈలోగా ప్రస్తుతం నమోదైన 3,062 కేసుల సంఖ్య 20 వేలకుపైగా దాటొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఎబోలా వ్యాక్సిన్ పరీక్షలను వేగవంతం చేస్తున్నామని. ఫార్మా దిగ్గజం గ్లాక్సోస్మిత్లైన్ లండన్లో ప్రకటించింది. మీరేం చేస్తున్నారు మరోవైపు మన దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటో సెప్టెంబర్ 2లోగా వివరించాలని బాంబే హైకోర్టు గురువారం పిల్ విచారణ సందర్భంగా కేంద్రం, మహారాష్ట్ర సర్కారును కోరింది.