సాక్షి,ముంబై: అత్యంతవిలువైన ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా నిలిచిన ఐటీసీ హార్లిక్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. జీఎస్‌కేకు చెందిన హార్లిక్స్ బ్రాండును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అమ్మకానికి సరైన ధరను నిర్ణయింస్తే హార్లిక్స్ కొనుగోలు చేస్తామని ని ఐటీసీ ఎండీ సంజయ్ పురి చెప్పారు. ఐటీసీతో పాటు నెస్లే, డాబర్, మోండలేజ్, క్రాఫ్ హీంజ్, హిందుస్తాన్ యునిలీవర్ హార్లిక్స్‌ను కొనేందుకు పోటీలో ఉన్నాయి.
మాల్ట్ ఆధారిత డ్రింక్ గా ఉన్న హార్లిక్స్ దేశంలో మంచి ఆదరణనుపొందింది.నోవార్టిస్ ను కొనుగోలు చేసిన తరువాత గ్లాక్సో స్మిత్ క్లయిన్, హార్లిక్స్ ను విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీఎస్కే భారత అనుబంధ విభాగంలో హార్లిక్స్ కు 72.5 శాతం వాటా ఉండగా, దీన విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 3.1 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుదని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment