టొరంటో: పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్‌కు విరుగుడుగా శాస్త్రవేత్తలు తయారు చేసిన ప్రయోగాత్మక ఔషధం కోతుల్లో సత్ఫలితాలనిచ్చింది. ఎబోలా సోకిన 18 కోతులకు జీమ్యాప్ అనే మందును ఇవ్వగా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా అవన్నీ కోలుకున్నట్లు అధ్యయనంలో తేలింది. ఎబోలాపై పోరాటంలో ఇదో కీలక ముందడుగని కెనడా శాస్త్రవేత్త, ఈ అధ్యయనం సహసమన్వయకర్త గ్యారీ కోబింగర్ తెలిపారు.
ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వైరస్ సోకిన కోతులకు ప్రతి మూడు రోజులకోసారి మందును అందించారు. కొన్ని కోతులకు వైరస్ సోకిన మూడు లేదా నాలుగో రోజు నుంచి చికిత్స ప్రారంభిస్తే మరికొన్ని కోతులకు ఐదో రోజున (అంటే మరణం అంచుకు చేరుకున్న సమయంలో) చికిత్స మొదలుపెట్టారు. ఈ మందులో బయటి ప్రొటీన్‌తో బంధం ఏర్పరచుకోగల 3 అణువుల యాంటీబాడీలు ఉన్నాయి. ఈ చికిత్స ద్వారా వైరస్ లక్షణాలైన దద్దుర్లు, రక్తస్రావాన్ని పూర్తిగా తగ్గించగలిగారు.
ఎబోలాపై ప్రయోగాత్మక ఔషధం విజయవంతం
Published Sun, Aug 31 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM
Advertisement