
బమాకో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మాలిలోని మోప్తీ ప్రాంతంలో తాజాగా ఈ ఘోరం చోటుచేసుకుంది. బందీయాగార పట్టణం సమీపంలోని యారౌ అనే ఓ గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారని, జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ కాల్పుల్లో 21 మంది ప్రజలు చనిపోయారని, మరో 30 మందికిపైగా గాయపడ్డారని తెలియజేసింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. మాలిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఐసిస్ చురుగ్గా పనిచేస్తున్నాయి. ఉగ్రముఠాల అండతో తిరుగుబాటుదారులు కొన్ని భూభాగాలను ఆక్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment