ఎబోలాతో తెలుగు వ్యక్తి మృతి? | chittoor man dies in kenya, suspected infected ebola virus | Sakshi
Sakshi News home page

ఎబోలాతో తెలుగు వ్యక్తి మృతి?

Published Thu, Aug 21 2014 3:31 PM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

ఎబోలాతో తెలుగు వ్యక్తి మృతి?

ఎబోలాతో తెలుగు వ్యక్తి మృతి?

నైరోబి: కెన్యాలో గజేంద్రరెడ్డి అనే తెలుగు వ్యక్తి మృతి చెందారు. నైరోబీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్లు మండలం చిటిపిరాళ్ల ప్రాంతానికి చెందిన వాడని గుర్తించారు. గజేంద్రరెడ్డి ఎబోలా వ్యాధితో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

ఈ నెల 4న గజేంద్రరెడ్డి జ్వరంతో ఆగాఖాన్‌ ఆస్పత్రిలో చేరాడు. 14వ తేదీ నుంచి కోమాలోకి వెళ్లిపోయిన అతడు 18న మృతి చెందాడు. ఈ ఉదయం 10 గంటలకు గజేంద్రరెడ్డి భార్య, కుమార్తె బెంగళూరుకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

భయానకమైన ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియార్రా లియోన్, నైజీరియా దేశాల్లో ప్రబలిన భయానకమైన ఎబోలా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 1,229కి చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement