
నైరోబి: సాధారణంగా వేసవి కాలంలో కొన్ని ఇళ్లలోని బోర్లు, బావులు ఇంకిపోవడం మనకు తెలిసిందే. దీని కోసం ఆయా ప్రాంతాల్లోని మున్సిపల్ అధికారులు నీటి ట్యాంకర్ల ద్వారా నీటి కోరత ఉన్న కాలనీల్లోకి నీటిని సరఫరా చేస్తుంటాయి. అయితే, ఇంటి ముందు నీళ్ల ట్రాక్టర్ రాగానే.. మహిళలు బిందేలతో నీటిని పట్టుకొవడానికి పొటీపడుతుంటారు. నాకంటే.. నాకు.. అని వాదులాడుకుంటుంటారు. ఈ క్రమంలో వారి మధ్య నీటి కోసం.. చిన్నపాటి ‘పానిపట్టు’ యుద్ధమే జరుగుతుంది. అయితే, ఇక్కడ వీడియోలో ఏనుగులు.. నీరు తాగటం కోసం ఏ మాత్రం.. పోటి పడకుండా.. తమ వంతు వచ్చే వరకు క్రమశిక్షణగా, వేచి చూస్తున్న వీడియో నెటిజన్లను ఏంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
వివరాలు.. ఈ సంఘటన కెన్యాలోని అడవిలో జరిగింది. ఇక్కడ రెండు ఏనుగులకు దాహం వేసినట్టుంది. నీటి కోసం వేతికాయి. కాసేపటికి, అడవికి దగ్గరలోని ఒక పార్క్‌లో నీటిని చిమ్ముతున్న స్ప్రింక్లర్‌ను చూశాయి. అవి రెండూ కూడా నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాయి. అయితే, మొదటి ఏనుగు ఆ స్ప్రింక్లర్ వద్ద నిలబడి తన తొండంతో నీళ్లను తాగి దాహన్ని తీర్చుకుంది. రెండొ ఏనుగు.. ఏమాత్రం తొందర పడకుండా.. తన వంతు కోసం ఓపిగ్గా ఎదురుచూస్తోంది.
మొదటి ఏనుగు వెళ్లి పోయాక మెల్లగా.. స్ప్రింక్లర్ వద్ద వెళ్లి అది కూడా కడుపు నిండా నీటిని తాగింది. కాగా, నీటి కోసం ఆరెండు ఏనుగులు ఏమాత్రం పోటీపడలేదు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మనుషుల కంటె గజరాజులే నయం’, ‘వావ్.. ఏనుగు ఎంత ఓపిగ్గా వేచి చూస్తోంది..’, ‘వాటి క్రమశిక్షణకు హ్యట్సాఫ్..’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ అనే సంస్థ కెన్యాలోని వన్య ప్రాణుల రక్షణ, ఏనుగుల పునారవాస కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏనుగుల శరీర ఉష్ణోగ్రత చాలాఎక్కువ. అందుకే, అవి నీటిలో ఏక్కువగా గడపటానికి ఇష్టపడతాయి. అదే విధంగా, ఒక ఏనుగు రోజుకు 50 గ్యాలన్ల వరకు నీటిని తాగుతుంది.
Nothing beats…a fresh and cooling drink from the tap (or sprinkler) pic.twitter.com/TBnorTJN8n
— Sheldrick Wildlife (@SheldrickTrust) June 27, 2021