ఎబోలాకు భయపడొద్దు: ఒబామా
వాషింగ్టన్: అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రమాదకరమైన ఎబోలా వైరస్ మొదటి కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలు భయపడవద్దని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. ఈ వైరస్‌ను తరిమికొట్టేందుకు దేశం సన్నద్ధంగా ఉందని, దీనిపై గ్లోబల్ పోరుకు అమెరికా సారథ్యం వహిస్తుందని ఒబామా శనివారమిక్కడ రేడియో, వెబ్ సందేశమిచ్చారు. లైబీరియాలో ఎబోలా రోగులకు వైద్య సాయం చేసే క్రమంలో ఈ వ్యాధి బారినపడి సంపూర్ణంగా కోలుకున్న నర్సు నీనా ఫామ్‌ను ఒబామా అభినందిం చారు. ఒబామా ఆమెకు అభినందనలు చెప్పి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
ఎబోలాకు 2.30 కోట్ల ఏళ్లు!
న్యూయార్క్: ఆఫ్రికా దేశాల్లో విజృంభించి, అమెరికాతో సహా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ 2.30 కోట్ల ఏళ్ల పురాతనమైనదట! ఫిలోవైరస్ కుటుంబానికి చెందిన ఎబోలాతో పాటు మార్‌బర్గ్ అనే ప్రాణాంతక వైరస్‌లు 16-23 మిలియన్ సంవత్సరాల మధ్యకాలం నుంచే ఉనికిలో ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది