ట్రంప్ వద్దు.. ఒబామానే కావాలి..!
పబ్లిక్ పాలసీ సర్వేలో వెల్లడి
వాషింగ్టన్ : మళ్లీ బరాక్ ఒబామానే అమెరికా అధ్యక్షునిగా కావాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారట. అమెరికాలో పబ్లిక్ పాలసీ పోలింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయమిది. ఒబామా అధ్యక్షునిగా ఉన్న నాటి రోజులే బాగున్నాయని 52 శాతం మంది అభిప్రాయపడగా.. ట్రంప్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఓటర్ల సంఖ్య 43 శాతమే కావడం విశేషం.
40 శాతం మంది ఓటర్లు ట్రంప్‌ను అభిశంసించాలని డిమాండ్ చేస్తున్నారు. వారం క్రితం వీరి సంఖ్య 35 శాతమే ఉండగా.. ఇప్పుడు అది 5 శాతం పెరగడం విశేషం. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ అభిశంసనను వ్యతిరేకిస్తున్నట్టు సర్వే వెల్లడించింది.