బ్రజ్జావిల్, కాంగో : అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కాంగోలో ఎబోలాతో 17 మంది మరణించారు. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోమారు ఎబోలా మహమ్మారి వ్యాపించిందని ప్రకటించింది. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.
బికోరో పట్టణం సమీపంలోని ఓ కుగ్రామంలో 21 మంది కొద్దిరోజుల క్రితం ఎబోలా వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వారికి ఎబోలా వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి బారిన పడిన వారిలో 17 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కాంగో దేశంపై ఎబోలా వైరస్ దాడి చేయడం ఇది తొమ్మిదోసారి.
1970లో మొదటిసారి దీన్ని గుర్తించారు. ఎబోలా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. రెండేళ్ల క్రితం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగించింది. దాదాపు 28,600మందికి ఈ వైరస్ సోకింది. 11,300 మంది మరణించారు. ఎబోలా వైరస్ గబ్బిలం లాలాజలం ద్వారా మనుషులకు వ్యాపించింది.
Comments
Please login to add a commentAdd a comment