Ebola
-
ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ!
న్యూయార్క్: కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎబోలా వైరస్ కాంగోలోని గోమాకు విస్తరించిందంటూ కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించడంతో డబ్ల్యూహెచ్ఒ ఈ ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎమర్జెన్సీ కమిటీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఈ వైరస్ మూడు సార్లు వ్యాప్తి చెందడంతో అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 ఆగస్టులో ఈ వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకూ 1,600 మంది మృత్యువాత పడ్డారు. మొదటిసారి 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ను గుర్తించినప్పుడు అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. -
ఎబోలా రాకాసి విరుచుకుపడింది..
బ్రజ్జావిల్, కాంగో : అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కాంగోలో ఎబోలాతో 17 మంది మరణించారు. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోమారు ఎబోలా మహమ్మారి వ్యాపించిందని ప్రకటించింది. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. బికోరో పట్టణం సమీపంలోని ఓ కుగ్రామంలో 21 మంది కొద్దిరోజుల క్రితం ఎబోలా వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వారికి ఎబోలా వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి బారిన పడిన వారిలో 17 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కాంగో దేశంపై ఎబోలా వైరస్ దాడి చేయడం ఇది తొమ్మిదోసారి. 1970లో మొదటిసారి దీన్ని గుర్తించారు. ఎబోలా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. రెండేళ్ల క్రితం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగించింది. దాదాపు 28,600మందికి ఈ వైరస్ సోకింది. 11,300 మంది మరణించారు. ఎబోలా వైరస్ గబ్బిలం లాలాజలం ద్వారా మనుషులకు వ్యాపించింది. -
ఆర్ఎన్ఏ వ్యాక్సీన్‌తో ఏ వ్యాధికైనా చెక్ చెప్పొచ్చు...
మొన్నటికి మొన్న చికెన్ గున్యా.. నిన్న హెచ్1ఎన్1.. నేడు ఎబోలా, జికా వైరస్ ఇలా కొత్తకొత్త వ్యాధులు ముంచుకొస్తున్న తరుణంలో మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ చల్లటి వార్త మోసుకొచ్చారు. అన్ని రకాల సంక్రమిత వ్యాధులకు విరుగుడుగా పనిచేసే వ్యాక్సీన్లను అభివృద్ధి చేసేందుకు వీరు ఓ వినూత్నమైన పద ్ధతిని ఆవిష్కరించారు. జీవ కణాల్లోని ఆర్ఎన్ఏతో కేవలం వారం రోజుల్లో ఎలాంటి వ్యాధికైనా వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేయవచ్చునని వీరు నిరూపించారు. ఆర్ఎన్ఏ పోగును వైరస్, బ్యాక్టీరియాలతోపాటు ఎలాంటి పరాన్న భుక్కు ప్రొటీన్గానైనా మార్చేయవచ్చునని తెలిపారు. ఇవి కణాల్లోకి ప్రవేశించినప్పుడు ఉత్పత్తి అయ్యే ప్రొటీన్లు శరీర రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేసి నిర్ధిష్ట వ్యాధికారక వైరస్, బ్యాక్టీరియాలను అడ్డుకుంటుందని ఎంఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డేనియల్ ఆండర్సన్ తెలిపారు. ఎలుకల ద్వారా ఎబోలా, ఇన్ఫ్లుయెంజాలతో పాటు మలేరియా కారక బ్యాక్టీరియాపై ప్రయోగాలు జరిపి పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించామని ఆయన వివరించారు. సాధారణ వ్యాక్సీన్ల తయారీకి ఎంతో సమయం పడుతుంది. కొన్ని వ్యాధులకు సంబంధించినంత వరకు వ్యాక్సీన్లు ప్రమాదరకంగానూ మారవచ్చు. అంతేకాదు సాధారణ వ్యాక్సీన్లు ఆశించిన స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఆర్ఎన్ఏ వ్యాక్సీన్లతో ఈ చిక్కులు ఉండవు. జీవకణాలు స్వయంగా వ్యాధిని ఎదుర్కొనే ప్రొటీన్లను ఉత్పత్తి చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా స్పంది స్తుంది. ఆర్ఎన్ఏలతో వ్యాక్సీన్లు అభివృద్ధి చేయవచ్చునన్న ఆలోచన శాస్త్రవేత్తల్లో 30 ఏళ్లుగా ఉన్నా వాటిని జీవకణాల్లోకి చేర్చడం ఎలా అన్న అంశంపై స్పష్టత లేకపోయింది. నానోస్థాయి కణాలతో ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని అధిగమించారు. -
డోన్ట్‌వర్రీ... బీ రెడీ జికా
రేండేళ్ల క్రితం వరకూ ఎబోలా! అంతకుముందు చికెన్‌గున్యా, బర్డ్‌ఫ్లూ, డెంగ్యూ!! ఇప్పుడు జికా వైరస్!!! క్యూ కట్టినట్టుగా ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఎందరినో చుట్టుముడుతున్నాయి. ఎంతో మంది ఉసురు తీసుకుంటున్నాయి.అయితే ఊరట కలిగించే అంశం ఏమిటంటే... ఇప్పటికింకా భారత్‌లో జికా వైరస్‌కు సంబంధించి ఒక్క కేసూ నమోదు కాలేదు. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది కాబట్టి మనమూ అప్రమత్తం కావాలి. అవగాహన కలిగి ఉండాలి. జికావైరస్పై అవగాహన కోసం ఈ కథనం. జికా వైరస్‌కు సంబంధించిన మొదటి కేసు గత మేలో బ్రెజిల్లో నమోదయ్యింది. అప్పట్నుంచీ అది దక్షిణ, మధ్య అమెరికా ప్రాంతాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది. ఒక ఉపద్రవంలా విస్తరించింది. ఆ ప్రదేశాల్లో అది మహమ్మారిలా మారడంతో ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. జికా తెచ్చే ముప్పు ఇది జికా వైరస్... దోమల ద్వారా వ్యాపిస్తుంది. గర్భిణులకు ఈ వైరస్ సోకితే, అది వారి గర్భంలోని పిండం మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని భావిస్తున్నారు. దాంతో కుంచించుకుపోయిన మెదడుతో పసిపాపలు పుడతారని అనుకుంటున్నారు. ఇక మరికొన్ని సందర్భాల్లో అది కాలక్రమంలో అవయవాలన్నింటిపైనా మెదడు అదుపు తప్పిపోయే గులియన్ బ్యారీ సిండ్రోమ్ వంటి ఆటోఇమ్యూన్ జబ్బులకు దారి తీసి, నవజాత శిశువులకు ప్రాణాంతకమూ కావచ్చని అంచనా. ఇలా మన సొంత రోగ నిరోధక వ్యవస్థే మనపై దెబ్బతీసేలా చేస్తుందది. ఇదీ విస్తృతి... దాదాపు 15 లక్షల మంది బ్రెజిలియన్లకు జికా వైరస్ సోకింది. అందులో మెదడు కుంచించుకుపోయిన కేసులు 3,700. ఇలా మెదడు కుంచించుకుపోవడాన్ని వైద్య పరిభాషలో ‘మైక్రోసెఫాలీ’ అంటారు. తల్లికి వ్యాధి సోకితే పుట్టే పిల్లల తల చాలా చిన్నదిగా ఉంటుంది. మెదడు అభివృద్ధి, వికాసం... ఈ రెండు అంశాలూ చాలా తక్కువ. ఇది జికా వైరస్ కలగజేసే దుష్ర్పభావమని వైద్య, పరిశోధన వర్గాల అంచనా. ఈ లక్షణాలను చూశాక... దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాల్లోని అనేక భాగాల్లో మెడికల్ అత్యవసర స్థితిని ప్రకటించారు. దోమలను అదుపు చేయడానికి జరుగుతున్న యుద్ధంలో సాక్షాత్తూ సైనిక బలగాలు పాలుపంచుకుంటున్నాయి. కనిపించని ఉపద్రవం... ఈ ఫిబ్రవరిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదటి కేసు నమోదయ్యింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి యూఎస్‌కూ, యూఎస్ నుంచి ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ ప్రయాణాలు నిత్యం ముమ్మరంగా జరుగుతుంటాయి. దాంతో కొద్ది వ్యవధిలోనే ఇతర ప్రాంతాలకూ వ్యాపించవచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇక మరో భయం ఏమిటంటే... ఈ వైరస్ సోకినప్పుడు తొలి దశల్లో ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించవు. దాంతో అంతర్గతంగా జరుగుతున్న నష్టం గురించి అంచనా ఉండదు. ఫలితంగా నష్టనివారణ చర్యలు చేపడదామన్నా అవకాశమే ఉండదు. అప్పట్లో పరిమిత ప్రాంతాల్లోనే... మొదట్లో జికా వైరస్ ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకూ, కొన్ని పసిఫిక్ సముద్ర భూభాగాలకు మాత్రమే పరిమితిమైంది. ఈ వైరస్ కలిగించే ఉత్పాతాలనూ, స్వరూప స్వభావాలనూ అధ్యయనం చేసి, దానికి కారణమైన ‘జికా’ అనే ఈ వైరస్‌ను 1947లో తొలిసారి కనుగొన్నారు. ‘ఈడిస్ ఈజిప్టై’ అనే దోమ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇదే దోమ డెంగ్యూ వ్యాధినీ, చికన్గున్యానూ వ్యాప్తి చేస్తుంది. ఇది పగటివేళల్లో కుట్టే దోమ. ఎక్కువ ఎత్తులో ఎగరలేదు. సాధారణంగా ఇళ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మంచి నీళ్లలో గుడ్లు పెట్టి, అక్కడ అభివృద్ధి చెందుతుంటుంది. దోమ కుట్టాక వైరస్ చేరితే... ఈ దోమకాటు వల్ల ఒంట్లోకి వైరస్ చేరితే... కొద్దిగా జ్వరం, ఒంటి మీద దద్దుర్లు (ర్యాష్), కళ్లు కొద్దిగా ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తొలి 14 రోజులు (రెండు వారాల పాటు) ఉంటాయి. ఇప్పటికైతే మన దేశంలో లేదు... మన భారత భూభాగంపై ఇప్పటివరకూ జికా వైరస్ సోకిన ఏ కేసూ నమోదు కాలేదు. అయితే మన దేశంలోని చాలా ప్రదేశాల్లో నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలుంటాయి. అలాంటి చోట్ల నీళ్లు నిల్వ పెట్టుకోడానికి అవకాశాలు ఎక్కువ. దాంతో ఈ వైరస్‌ను వ్యాప్తి చేసే ఈడిస్ ఈజిప్టై రకం దోమలు అక్కడ పెరిగేందుకు అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉంటాయి. అందుకే నీటి ఎద్దడి వల్ల నీళ్లను నిల్వ చేసుకునే భారతీయ ప్రాంతాల్లో ఉండే గర్భిణులను అక్కడి స్థానిక ఆరోగ్య సంస్థలు అప్రమత్తం చేస్తున్నాయి. పొరుగుదేశాలలో ఉన్న పరిస్థితులను వివరించి, సమస్యపై అవగాహన కలిగిస్తున్నాయి. ఇలా నివారణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నివారణ కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలను రూపొందించి వారికి వివరిస్తున్నాయి. కొన్ని చోట్ల వ్యాధి నిర్ధారణకు అవసరమైన ‘కిట్లు’ అందుబాటులో ఉంచుతున్నాయి. ఒకసారి వ్యాధి సోకితే మాత్రం దాన్ని తగ్గించడానికి చికిత్స లేదు. కానీ నివారణ టీకాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ ఆగష్టు నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఈ టీకాను అందుబాటులోకి తేవాలని సంకల్పించినట్లు పూణేలోని కొలంబియా ఆసియా హాస్పిటల్‌కు చెందిన నిపుణుడు మహేశ్ లాఖే తెలిపారు. అయితే ఈలోపు ప్రజలందరూ తామే అప్రమత్తం అయి నివారణ చర్యలు తీసుకోవడం ప్రధానమని మరో నిపుణులు ఓమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఆయన తన ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ప్రజలకు జికావైరస్ పట్ల ఉన్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. అపోహలను దూరం చేస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ‘ప్రజల్లో ఈ వైరస్ పట్ల ఆందోళన ఉండటం చాలా సహేతుకమైనదే. ఎందుకంటే డెంగ్యూను వ్యాప్తి చేసే దోమే, దీన్ని వ్యాప్తి చేస్తుంది కాబట్టి వాళ్ల భయాలు అర్థవంతమైనవే’ అంటారాయన. అదృష్టవశాత్తూ మన దేశంలో జికా వైరస్ లేకపోయినా... ముందుజాగ్రత్త కోసం అవగాహన కలిగి ఉండటం చాలా మంచిది. లక్షణాలు చాలా మందిలో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించవచ్చు. కాకపోతే కొద్దిపాటి జ్వరం, ఒంటిపై దద్దుర్లు, కీళ్లనొప్పులు, కళ్లకలక (కళ్లు ఎర్రబారడం) వంటివి కనిపిస్తాయి.కొంతమందికి కండరాల నొప్పులూ కనిపించవచ్చు. మరికొందరిలో తలనొప్పి ఉంటుంది. ఒకసారి వైరస్ సోకాక, లక్షణాలు కనిపించడానికి కొద్ది రోజులు మొదలుకొని, వారం, రెండు వారాల వరకూ వ్యవధి పట్టవచ్చు.వైరస్ సోకితే, అది వ్యాధికి గురైన వారి రక్తంలో కొన్ని రోజులు మొదలుకొని, కొన్నాళ్ల వరకూ ఉండవచ్చు. అంటే లక్షణాలు బయటకు కనిపించకపోయినా, వ్యాధి వ్యాప్తి చేసే పరిస్థితిలో వారు ఉంటారు. చికిత్స వ్యాధి సోకిన తర్వాత నిర్దిష్ట చికిత్స ప్రక్రియ లేదు. ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికీ ఇస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ దీనికి టీకా (వ్యాక్సిన్)ను రూపొందించినట్లు పేర్కొంది. అయితే అది ఇంకా ప్రీ-క్లినికల్ ప్రయోగదశల్లో ఉందనీ, చాలా త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పింది. ఇది ప్రాణాంతకమా? వ్యాధి సోకినప్పుడు కనిపించే లక్షణాలు ప్రాణాంతకం కాదు. అవి సాధారణ ఒళ్లునొప్పులూ, తలనొప్పులే. కానీ వ్యాధి సోకిన తర్వాత కలిగే దశలు చాలా ప్రమాదం. అవి మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ వ్యాధులను కలగజేయవచ్చు. ఆ తర్వాత రోగికి గులియన్ బ్యారీ సిండ్రోమ్, మెదడు కుంచించుకుపోయే మైక్రోసెఫాలీ వంటి ప్రమాదకరమైన కండిషన్స్ రావచ్చు. డెంగ్యూ, చికన్గున్యాలతో పోల్చినప్పుడు తేడా... సాధారణంగా డెంగ్యూ, చికన్‌గున్యా, జికా... ఈ మూడు వైరల్ వ్యాధుల లక్షణాల్లోని చాలా అంశాలు ఒకదానితో మరొకటి పోలి ఉంటాయి. ఉదాహరణకు దద్దుర్లు, కళ్లు ఎర్రబారడం, కంటి ఇన్ఫెక్షన్లు, కండరాల నొప్పులు అన్ని వ్యాధుల్లోనూ కనిపిస్తాయి. వ్యాధి కనిపిస్తున్న దేశాలు దక్షిణ అమెరికా ఖండానికి చెందిన చాలా దేశాలు. {బెజిల్లో దీని దుష్ర్పభావం చాలా ఎక్కువ. పోర్టారికో, కొలంబియా, బార్బడోస్, బొలీవియా, అమెరికన్ సమోవా లాంటి చోట్ల కూడా జికా వైరస్ విస్తృతంగానే ఉంది. ఇప్పుడిప్పుడే మెక్సికో, యూఎస్ఏలోనూ కేసులు కనిపిస్తున్నాయి.ఇది ఈడిస్ ఈజిప్టై అనే దోమతో వ్యాప్తి చెందుతుంది. ఇవే దోమలు డెంగ్యూ, చికన్గున్యాలనూ వ్యాప్తి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23 దేశాలలో జికా వైరస్ ఉత్పాతాన్ని సృష్టిస్తోంది. గర్భవతులు పాటించాల్సిన నివారణ చర్యలివి... గర్భవతుల రక్తంలోకి ఈ వైరస్ చేరితే అది కడుపులోని శిశువుకూ సోకి ప్రమాదం కలిగించవచ్చు. అందుకే గర్భిణులు దోమలు కుట్టకుండా ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి.ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు, పొడవు చేతుల కుర్తాలు ధరించాలి.దోమలను పారదోలే ‘మస్కిటో రెపెల్లెంట్స్’ ఉపయోగించాలి. ఈ దోమలు పగలూ కుడతాయి... కాబట్టి పగటి వేళ కూడా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ జికా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన భారత్! దేశీయంగా టీకా రూపకల్పన మన దేశ వ్యాక్సిన్ రూపకర్తలలో ఒకటైన భారత్ బయోటిక్ సంస్థ జికా వైరస్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ రెండు ‘వ్యాక్సిన్ క్యాండిడేట్స్’ను రూపొందించి, ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపింది. ఇందులో ఒకటి వైరస్‌ను నిర్వీర్యం చేసి రూపొందించే ‘ఇనాక్టివేటెడ్ క్యాండిడేట్’ కాగా, మరొకటి కొన్నింటి సమ్మేళనం అయిన ‘రీకాంబినెంట్’. ఇక ఇవి చికిత్సకు మందులా ఇచ్చే ముందర నిర్వహించే ‘ప్రీ-క్లినికల్’ దశలో ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. రాబోయే ఐదు నెలల్లో ఈ ప్రీ-క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తామని రూపకర్తలు వివరించారు. ఆ తర్వాత నియంత్రణ అధికారుల నుంచి తగిన అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము రూపొందించిన వ్యాక్సిన్స్ వివరాలన్నీ భారతీయ ఔషధాలు, ఇతర చికిత్స ప్రక్రియలను నియంత్రించే అత్యున్నత సంస్థ అయిన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ సంస్థకు కొద్ది రోజుల క్రితమే నివేదించినట్లు భారత్ బయోటెక్ సంస్థకు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. త్వరలోనే తాము ప్రధాని నరేంద్రమోడీకి సైతం విషయాలను విడమరచి చెప్పి, తమ టీకాకు తగిన అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు వివరించారు. ‘‘ఎబోలా వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో తాము రెండో దశ ప్రయోగాలను అధిగమించి, మూడో దశకు నేరుగా వెళ్లామనీ, ఇప్పుడు కొద్ది మందిలో (శాంపుల్) నమూనా ప్రయోగాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు. తమ ప్రయోగాల ద్వారా రూపొందిన వ్యాక్సిన్ పూర్తి స్థాయి అనుమతులు లభించడానికి దాదాపు 6-8 నెలల సమయం పట్టవచ్చని డాక్టర్ ఎల్లా అంచనా. ఎలా రూపొందిస్తారీ వ్యాక్సిన్లు... ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్‌లో కొన్ని రసాయనాలు, ఉష్ణోగ్రత, రేడియేషన్ వంటి అంశాలతో వ్యాధిని కలిగించే వైరస్ మైక్రోబ్ను మృతిచెందేలా చేస్తారు. ఇక రీకాంబినెంట్ వైరస్‌లో మన పరిజ్ఞానం సహాయంతో కొన్ని డీఎన్ఏలను సమ్మిళితం చేస్తారు. ‘జికా’ విశేషాలు ఉగాండాలో దోమల బెడద ఎక్కువగా ఉండే ‘జికా అరణ్యం’ పేరిట జికా వైరస్‌కు ఆ పేరు పెట్టారు. ఊళ్లలో తిరిగే కోతులకు జికా వైరస్ సోకినట్లుగా తొలినాళ్లలో గుర్తించారు. అప్పట్లో ఈ వైరస్ మనుషులపై పెద్దగా ప్రభావం చూపిన దాఖలాల్లేవు. 1950లలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే కొద్ది ప్రాంతాల్లో మాత్రమే మనుషుల్లో జికా వైరస్ జాడ కనిపించేది.ఇటీవలి కాలంలో జికా వైరస్ భూమధ్యరేఖకు దూరంగా ఉండే ఆయన ప్రాంతాలైన లాటిన్ అమెరికన్ దేశాలు, అమెరికా, యూరోప్‌లోని కొద్ది ప్రాంతాల్లో మనుషులకు సోకినట్లు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దాదాపు ఏడు దశాబ్దాల కిందట గుర్తించిన ఈ వ్యాధి ఇటీవలే ఎందుకు ఎక్కువగా వ్యాపిస్తోందనే దానికి కచ్చితమైన కారణాలేవీ బయటపడలేదు. అయితే, వాతావరణ మార్పుల వల్ల... ముఖ్యంగా భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్) వల్ల ఈ వ్యాధి ఆయన ప్రాంత దేశాల్లోనూ విస్తరిస్తోందని భావిస్తున్నారు. -
మహమ్మారిని తరిమేసి చిందేశారు
సియెర్రా లియోన్: ఎబోలా వైరస్ గుర్తుండే ఉందిగా.. ఆ పేరు వింటేనే ప్రాణాలు హరీ అనేంత పరిస్థితి. ఆ వైరస్ ఎప్పుడో ఉన్నా సరిగ్గా ఏడాదిన్నర కిందట పశ్చిమాఫ్రికాలోని సియెర్రా దేశంలో అడుగుపెట్టింది. అలా అడుగుపెట్టిందో లేదో వెంటనే వరుస మరణాలు. మొత్తం ఆ దేశాన్ని గజగజలాడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడి పరిస్థితులపట్ల ఎంతో ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి మహ్మమ్మారిపై అక్కడి వైద్యులు, ఇతర సిబ్బందితోపాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా దానికి తోడై సరిగ్గా ఏడాదిన్నర తర్వాత ఆ దేశం ఊపిరిపీల్చుకుంది. ఎబోలాపై సమరశంఖం పూరించి చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సియెర్రా దేశం శబాష్ అనిపించుకుంది. గత 42 రోజులుగా ఒక్క ఎబోలా కేసు కూడా నమోదుకాకపోవడంతో ఎబోలా రహిత తొలి దేశంగా సియెర్రా లియోన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మే 2014 నుంచి మొత్తం 8,704 ఎబోలా కేసులు నమోదుకాగా 3,589మంది ప్రాణాలుకోల్పోయారు. చివరికి గత 42 రోజులుగా ఒక్క మరణం చోటుచేసుకోకపోవడంతోపాటు ఒక్క ఎబోలా కేసుకూడా నమోదుకాలేదు. ఎబోలా రహిత దేశంగా తమను ప్రకటించడంతో అక్కడి డాక్టర్లు, ఇంజినీర్లు, వైద్య సిబ్బంది, ల్యాబ్ అసిస్టెంట్లు, ఇతర సామాన్య జనం 'బైబై ఎబోలా' అంటూ ఓ మ్యూజిక్ తో వీడియోను సరదాగా పోస్ట్ చేశారు. తాము ఎబోలాపై విజయం సాధించామని ఆనందంతో ఆ వీడియోలో చిందులు వేస్తూ కనిపించారు. -
ఇక నిమిషాల్లో ఎబోలా నిర్థారణ..
న్యూయార్క్: ప్రాణాంతక వ్యాధి ఎబోలా మహమ్మారిపై శాస్త్రవేత్తలు ఓ ముందడుగు వేశారు. ఎబోలా వ్యాధి సోకిందా లేదా అనే విషయం ఇక నిమిషాల్లో తేలనుంది. ఇందుకోసం వారు చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. సాధారణంగా ఎబోలా వైరస్ డిసీజ్(ఈవీడీ) సోకిన వ్యక్తులకు అంతకుముందు దానిని నిర్థారించేందుకు ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్(ఆర్డీటీ) చేసేశారు. ఇది ఎంతో ప్రయాసతో కూడుకున్న పనే కాక.. గంటల తరబడి సమయం వృధా అయ్యేది. కానీ అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్ కు చెందిన నిరా పొల్లాక్ మాత్రం తాము చేసిన సర్వేలు, పరీక్షల్లో ఎబోలా వైరస్‌ను నిమిషాల్లో గుర్తించే వీలుకలిగిందని చెప్ఆరు. ఇందుకోసం ఆర్ఈఈబీఓవీ యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట, కార్జెనిక్స్ అనే పరీక్ష నిర్వహించామని, దీనిద్వారా గతంలో కన్నా వేగంగా ఎబోలాను గుర్తించడం జరిగిందని తెలిపారు. -
'మా దేశంలో ఎబోలా విస్తరించలేదు'
మోగాదిషూ: తమ దేశంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ పై విస్తరించిందన్న వార్తలను సోమాలియా కొట్టిపారేసింది. తమ దేశంలో ఎబోలా వైరస్ విస్తరించలేదని తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు సోమాలియా ఆరోగ్య శాఖ మంత్రి అలీ మహ్మద్ మోహ్మద్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ దేశానికి చెందిన అబ్దుల్ ఖాదిర్ ఎబోలా లక్షణాలు కల్గి ఉండటంతో అతన్ని ఆరోగ్య శాఖ డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి అన్ని అత్యంత ఖరీదైన పరీక్షలు నిర్వహించమన్నారు. అయితే అతనికి ఎబోలా వైరస్ మాత్రం సోకలేదని అలీ తెలిపారు.ప్రస్తుతం తమ దేశంలో ఎబోలాపై వస్తున్న కథనాలు మాత్రం వాస్తవం కాదన్నారు. -
అది ఎబోలా కాదు.. మరేదో వైరస్!
-
ఎబోలాతో చైనాకు ముప్పు!
టోక్యో: పశ్చిమాఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ తో చైనాకు ముప్పు పొంచి ఉందట. ఆఫ్రికా దేశాల నుంచి చైనా వర్కర్లు అధిక సంఖ్యలో స్వదేశానికి రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఎబోలాతో ఆ దేశం జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లండన్ లోని హైజిన్ -ట్రోపికల్ మెడిసిన్ కు డైరెక్టర్ గా ఉన్న పీటర్ పైలట్ చైనాకు భారీ ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డాడు.' ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. ప్రాంతాల మార్పుతో ఈ వ్యాధి ఎక్కువ విస్తరిస్తోంది. అసలు ప్రజల్ని ప్రయాణాలు చేయకుండా ఆపడం జరగని పని' అని పీటర్ తెలిపాడు. ఎబోలా వైరస్ మిగతా దేశాల్లో ఉన్న చైనాలో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. చైనాలో ఎబోలాను అరికట్టేందుకు తీసుకునే చర్యలు చాలా పేలవంగా ఉన్నాయని తన పర్యటనను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం చైనాలో ఎబోలా ను ఎదుర్కొవడానికి నాణ్యతతో కూడిన వైద్య సదుపాయాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పీటర్ పేర్కొన్నాడు. గతంలో సార్స్ వ్యాధితో చైనాలోనే అధికంగా ప్రాణ నష్టం వాటిల్లిందన్నాడు. 2002 లో చైనాలో సార్స్ వ్యాధి బారిన 8,000 మంది పడగా,800 మంది వరకూ ప్రాణాలు కోల్పోయరని స్పష్టం చేశాడు. -
ఎబోలా నుంచి రక్షణ ఇలా..
జాగ్రత్త ఇటీవల ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యాధి ఎబోలా. ఆఫ్రికా దేశాల్లో వ్యాప్తి చెందిన ఎబోలా వైరస్ అక్కడి నుంచి ఒక వ్యక్తి ద్వారా అమెరికా చేరింది. ఆ వ్యక్తి అమెరికాలో మరణించడంతో ఆ దేశం ఈ వ్యాధి మీద, దానిని నియంత్రించే విధానాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. మనదేశంలో విమానాశ్రయాల దగ్గర ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలను, ప్రయాణికులను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆహారం తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. ఇతరులను తాకాల్సిన పరిస్థితులను (పరిచయస్థులు ఎదురు పడినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆలింగనం చేసుకోవడం, భుజం మీద చేతులు వేయడం వంటివి) వీలయినంతగా మినహాయించాలి. బయటి ఆహారాన్ని మానేయాలి లేదా పరిశుభ్రమైన హోటళ్లు, రెస్టారెంట్లలోనే తీసుకోవాలి. ఎబోలా వైరస్ సూర్యరశ్మి, వేడి, డిటర్జెంట్, ఇతర క్లీనింగ్ ఎలిమెంట్స్ ఉన్న చోట నిలవదు. కాబట్టి ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వైరస్‌ను నియంత్రించవచ్చు. ప్రతిరోజూ గదుల్లోకి సూర్యరశ్మిని ప్రసరించనివ్వాలి. ఎబోలా వ్యాధి లక్షణాలు... జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, బలహీనత, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన కొద్ది వారాల్లోనే మరణం సంభవిస్తుంది. ఇలా వ్యాప్తి చెందుతుంది! వ్యాధిగ్రస్థుల రక్తం, చెమట, లాలాజలం, వీర్యం వంటి వాటి నుంచి ఈ వ్యాధి మరొకరికి సోకుతుంది. గతంలో కొంతకాలం స్వైన్ ఫ్లూ భయపెట్టింది. అయితే స్వైన్ ఫ్లూ గాలిలోనే వ్యాప్తి చెందుతుంది. ఎబోలా అలా వ్యాప్తి చెందదు. వ్యక్తిగత ప్రమేయంతోనే వ్యాపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎబోలా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
న్యూయార్క్‌లో తొలి ఎబోలా కేసు నమోదు
వాషింగ్టన్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎబోలా వ్యాధి ఇప్పుడు న్యూయర్క్ నగరంలోకి ప్రవేశించింది. న్యూయార్క్‌లో తొలి ఎబోలా కేసు నమోదు అయ్యింది. ఆ నగరానికి చెందిన స్పెన్సర్ అనే వైద్యునికి ఈ వ్యాధి సోకినట్లు సమచారం. ఇటీవలే ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు బాధిత వైద్యుడు జెనీవా వెళ్లాడు. ఈనెల 14న న్యూయార్క్ చేసుకున్న అతడు మరుసటి రోజు నుంచి తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. దాంతో వైద్యులు స్పెన్సర్‌కు పరీక్షలు నిర్వహించి ఎబోలా వ్యాధి సోకినట్లు గుర్తించారు. కాగా అమెరికాలో ఇప్పటివరకూ ఇది నాలుగో ఎబోలా కేసు. -
బెంబేలెత్తిస్తున్న ఎబోలా కేసులు
న్యూఢిల్లీ: పశ్చిమాఫ్రికాను వణికిస్తున్న ఎబోలా వైరస్ వ్యాపిస్తోంది. ఎబోలా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. డిసెంబర్ మొదటి వారానికి ఎబోలా కేసులు 10 వేలకు చేరే అవకాశముంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ఎబోలా వల్ల ముఖ్యంగా పశ్చిమాఫ్రికాలో దాదాపు ఐదు వేలమంది మరణించారు. పశ్చిమాఫ్రికా దేశాల్లోనే ఎబోలా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఎబోలాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు కూడా దీని బారినపడుతుండటం ఆందోళన కలిగించే విషయం. -
ఎబోలాతో 4,493 మంది మృతి
ఐక్యరాజ్యసమితి: పశ్చిమాఫ్రికాను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 4,493కు చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఏడు దేశాల్లో మొత్తం 8,997 ఎబోలా కేసులు నమోదు కాగా, 4,493 మంది మరణించినట్టు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ప్రకటించారు. పశ్చిమాఫ్రికా దేశాల్లోనే ఎబోలా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఎబోలాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు కూడా దీని బారినపడుతున్నట్టు స్టీఫెన్ చెప్పారు. -
ఇబోలాపై పోరుకు 150 కోట్లిచ్చిన ఫేస్బుక్ అధినేత
యావత్ ప్రపంచంతో పాటు ప్రధానంగా అమెరికాను వణికిస్తున్న ఇబోలాపై పోరాటానికి ఫేస్బుక్ అధినేత మార్క్ జుకెర్బెర్గ్ భారీ విరాళం ప్రకటించారు. తన భార్య ప్రిసిల్లాతో కలిసి దాదాపు 150 కోట్ల రూపాయలు ఇచ్చారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్ఓల్ అండ్ ప్రివెన్షన్ సంస్థకు ఈ మొత్తం పంపారు. వీలైనంత తక్కువ కాలంలోనే ఈ వ్యాధిని మనం అదుపు చేయాలని, లేకపోతే అది మరింతగా వ్యాప్తి చెంది.. దీర్ఘకాలంలో ఆరోగ్య సంక్షోభంగా మారుతుందని, చివరకు హెచ్ఐవీ, పోలియోలలాగే ఇబోలా మీద కూడా కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వస్తుందని తన ఫేస్బుక్ పోస్టులో తెలిపాడు. ఇప్పటివరకు నాలుగువేల మంది ఇబోలా బారిన పడి మరణించారు. వీరిలో ఎక్కువ మంది పశ్చిమాఫ్రికాకు చెందినవాళ్లే. ఇప్పటికీ మరో 8,400 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు జుకెర్బెర్గ్ చెప్పారు. -
ఇబోలా బాధితుడికి చికిత్స చేసిన నర్సుకూ వ్యాధి
ఇబోలా పేరు చెబితేనే అమెరికా వణికిపోతోంది. అగ్రరాజ్యంలోనే మొట్టమొదటి ఇబోలా రోగికి చికిత్స చేసిన టెక్సాస్ ఆస్పత్రి నర్సుకు కూడా ఇప్పుడు ఆ వ్యాధి సోకింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాధి గురించిన పరీక్షలు చేయగా, ఆమె పాజిటివ్ అని తేలింది. ఆమెకు చికిత్స విషయంపై మాత్రం ఆస్పత్రి, రోగి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆమెకు శుక్రవారం రాత్రి కొద్దిగా జ్వరం వచ్చింది. ఆ తర్వాత పరీక్షలు చేయగా, అసలు విషయం తేలింది. అమెరికాలో ఈ వైరస్ సోకిన తొలి రోగి థామస్ ఎరిక్ డంకన్ ఇప్పటికే మరణించాడు. దీంతో ఇప్పుడు అమెరికా గుండెల్లో గుబులు పట్టుకుంది. ఈ విషయమై ఆస్పత్రి డైరెక్టర్ టాప్ ఫ్రీడెన్ తెలిపారు. ఇబోలా సోకిన డంకన్ వద్దకు ఆ నర్సు చాలాసార్లు వెళ్లి, దగ్గర నుంచి పరీక్షించిందని ఆయన చెప్పారు. సాధారణంగా ఇబోలా రోగుల విషయంలో ఒక ప్రోటోకాల్ పాటిస్తామని, కొన్నిసార్లు దాన్ని ఉల్లంఘించడంతో ఇలా వ్యాపిస్తుందని ఆయన తెలిపారు. లైబీరియాకు చెందిన 42 ఏళ్ల డంకన్ సెప్టెంబర్ 20వ తేదీన డల్లస్ వచ్చారు. చాలా రోజుల తర్వాత అనారోగ్యం పాలయ్యారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. -
ఇబోలా ఉందని జోక్.. విమానంలో గందరగోళం
ఇబోలా.. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. అయితే, తనకు ఈ వ్యాధి ఉందంటూ ఓ ప్రయాణికుడు వేసిన ప్రాక్టికల్ జోక్.. విమానంలో గందరగోళం సృష్టించింది. మరోవైపు ఇంకో విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు వాంతి చేసుకోవడంతో ఆ విమానాన్ని లాస్ వెగాస్ విమానాశ్రయంలో క్వారంటైన్ చేశారు. ఫిలడెల్ఫియా నుంచి డొమినికన్ రిపబ్లిక్కు వెల్తున్న అమెరికా ఎయిర్వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు తనకు ఇబోలా ఉందని చెప్పడంతో హజ్మత్ (ప్రమాదకరమైన వస్తువులను తీసే) బృందం నీలిరంగు సూట్లు వేసుకుని విమానంలోకి వచ్చింది. విమానం గమ్యం చేరుకోగానే హజ్మత్ స్క్వాడ్ వస్తున్నందున ప్రయాణికులంతా కూర్చోవాలని కేబిన్ సిబ్బంది కోరారు. కానీ తీరా చూస్తే అసలు విషయం తేలింది. అతడు ఉత్తుత్తినే చెప్పినట్లు తెలిసింది. తాను 36 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నానని, కానీ ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి ప్రాక్టికల్ జోకులు వేయలేదని, అసలు విషయం తెలిసేవరకు తన నరాలు బిగుసుకుపోయాయని ఓ ఫ్లైట్ అటెండెంట్ తెలిపింది. ఈ మొత్తం తతంగాన్ని కొంతమంది ప్రయాణికులు సెల్ఫోన్లలో వీడియో తీశారు. దాన్ని యూట్యూబ్‌లో పెట్టగా, దానికి భారీ హిట్లు వచ్చాయి. నీలిరంగు సూట్లు వేసుకుని వచ్చిన వాళ్లతో తాను ఊరికే జోకు వేశానని, తాను ఆఫ్రికానుంచి రాలేదని చెబుతున్నట్లు కూడా ఆ వీడియోలో ఉంది. -
30 నిమిషాల్లో ఎబోలా వైరస్ గుర్తింపు
టోక్యో: శరీరంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ జాడను కేవలం 30 నిమిషాల్లో గుర్తించే నూతన పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేసినట్లు జపాన్ పరిశోధకులు ఈరోజు తెలిపారు. ఈ వ్యాధి సోకి పశ్చిమ ఆఫ్రికాలో 15 వందల మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రోగులకు వైద్యులు సత్వర చికిత్స అందించడంలో తమ పరిశోధన ఉపయోగపడుతుందని నాగసాకి యూనివర్సిటీలోని పరిశోధక బృందం ప్రొఫెసర్ జిరో యసూడా చెప్పారు. ప్రస్తుత విధానంలో వైరస్‌ను గుర్తించే పరీక్షలకు దాదాపు రెండు గంటల సమయం పడుతోందని తెలిపారు. తాము అభివృద్ధి చేసిన పరీక్షా విధానంలో ఈ ప్రక్రియ అరగంటలోగా ముగుస్తుందని వివరించారు. ప్రస్తుతం పరీక్షలకు ఖరీదైన పరికరాలను వాడవలసి ఉందని, తమ ప్రక్రియ చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చని యసూడా తెలిపారు. ** -
'ఎబోలా’ భయంతో భారత్‌కు పయనం
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ విజంభిస్తుండటంతో అక్కడకు వలస వెళ్లిన భారతీయులు క్రమంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. లైబీరియా, నైజీరియాల నుంచి మంగళవారం ఉదయం మొత్తం 91 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. లైబీరియా నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆరుగురు ప్రయాణికుల్లో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వారిని అధికారులు పరీక్షల నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు విడతలుగా చేరుకున్న 85 మంది ప్రయాణికులను ఎయిర్పోర్ట్ ఆరోగ్య సంస్థ పరీక్షించి వారిలో వైరస్ లక్షణాలు లేవని నిర్ధారించింది. కాగా, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాల వల్ల తలెత్తిన దుర్భర పరిస్థితులు ఈ వైరస్ విస్తరించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాయని బెల్జియం శాస్త్రవేత్త పీటర్ పయట్ అభిప్రాయపడ్డారు. ఎబోలా వైరస్‌ను 1976లో పీటర్ పయట్ గుర్తించారు. -
ఎబోలాతో ఉత్తరాఫ్రికా ఆర్థిక వ్యవస్థ కుదేలు
మొన్రోవియా(లైబీరియా): ఉత్తరాఫ్రికాను వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి ఎబోలా అక్కడి లైబీరియా, సియోర్రాలిన్, గినియా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలనూ తీవ్రంగా దెబ్బతీస్తోంది. చెమట, రక్తం తదితర శరీర ద్రవాల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కార్మికులకు సోకుతుందనే భయంతో పలు కంపెనీలను మూసేస్తున్నారు. గనులు కూడా మూతపడుతున్నాయి. కూలీలు పొలాలకు వెళ్లకపోవడంతో పంటలు పొలాల్లోనే నాశనమవుతున్నాయి. కాగా, సియెర్రా లియోన్‌లోని ఒక బ్రిటిష్ ఆరోగ్య కార్యకర్తకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యనిపుణుడికి ఎబోలా సోకింది. -
కేన్సర్ చికిత్సకు వస్తూ.. ఎబోలాతో మృతి!
నైజీరియాకు చెందిన ఓ మహిళ (35) ఆ దేశం నుంచి కేన్సర్ చికిత్స కోసం భారత దేశానికి వస్తూ మర్గమధ్యంలో ఎబోలా లక్షణాలతో దుబాయ్‌లో మరణించారు. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే సమయంలో ఆమె పరిస్థితి ఉన్నట్లుండి విషమించింది. వెంటనే వైద్య సదుపాయం అందించినా ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఆ మహిళకు ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించాయని, ప్రయాణంలో ఆమె పక్కనే కూర్చున్న ఆమె భర్త, చికిత్స అందించిన ఐదుగురు వైద్యసిబ్బంది అందరినీ ఐసొలేషన్‌లో ఉంచి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్లలో ఎవరికీ ఎబోలా లక్షణాలు మాత్రం కనిపించలేదు. పశ్చిమాఫ్రికా దేశాలలో ప్రస్తుతం ఈ ఎబోలా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. -
ఎబోలాతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!
బెంగళూరు: ఎబోలా వైరస్ కేసులు మన దేశంలో ఇంతవరకు నమోదు కాలేదని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఎబోలా వైరస్ వ్యాపిస్తున్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను సునిశితంగా పరీక్షిస్తున్నామన్నారు. ఆ వైరస్ గాలి ద్వారా వ్యాపించదని చెప్పారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైన్‌ను సందర్శించిన కేంద్రమంత్రి.. దేశవ్యాప్తంగా అలాంటి మరిన్ని సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పశ్చిమ ఆఫ్రికాలో దాదాపు 10 లక్షల మందిపై ప్రభావం చూపుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇదో మానవ సంక్షోభంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది. -
ఎబోలా... దేవుడు విధించిన శిక్షా?!
దైవికం ప్రజల్లో భయం తగ్గించడానికి దేవుడిని భూమి మీదకు లాగడంలో తప్పులేదు. ప్రజల్ని భయపెట్టడానికి దేవుడిని తోడు తెచ్చుకోవడాన్ని మాత్రం బహుశా ఆ దేవుడు కూడా హర్షించకపోవచ్చు. చరిత్రలో క్రూరులైన పాలకులు చాలామందే ఉన్నారు. వారిలో దేవుడిని అడ్డు పెట్టుకుని పరిపాలించినవారు కూడా అక్కడక్కడ కనిపిస్తారు. సాధారణంగా.. దేవుడంటే నమ్మకం లేని రాజులు, చక్రవర్తులే కదా క్రూరులుగా తయారవుతారు. మరి క్రూరులు అయి ఉండీ, దేవుడిని కూడా ఒక ‘శిక్షల అధికారి’గా అడ్డు పెట్టుకున్నవారిని ఏమనాలి? మహా క్రూరులు అనాలేమో. దేవుడిని అడ్డం పెట్టుకున్నంత మాత్రాన దేవుడిపై నమ్మకం ఉన్నట్లా? కాదు. దేవుడిపై నమ్మకం ఉన్నవారిని దేవుడి పేరుతో అదుపు చెయ్యడానికి ఈ మహాక్రూర పాలకులు దేవుణ్ణి అవసరార్థం తమ రాజ్యంలోకి తెచ్చుకుంటారు. అటువంటి పాలకులలో చెంఘీజ్‌ఖాన్ ఒకరని డి.డబ్ల్యు.విల్కిన్ అంటాడు. నేరుగా అనడు. చెంఘీజ్‌ఖాన్ చేతే అనిపిస్తాడు. డి.డబ్ల్యు. విల్కిన్ అమెరికన్ రచయిత. మంచి కథకుడు. రొమాన్స్, సైన్స్‌ఫిక్షన్, ఫాంటసీ ఆయన ప్రత్యేకతలు. వీటన్నిటి కన్నా కూడా చరిత్రకు కాల్పనికతను జోడించి రాసే ఆయన రచనలు విషయాన్ని తేలిగ్గా అర్థం చేయిస్తాయి. ఆయన రాసిన ‘చెంఘీజ్ఖాన్స్ రూల్స్ ఫర్ వారియర్స్’ పుస్తకంలో ఓ చోట చెంఘీజ్ ఇలా అంటాడు. ‘‘నేను దేవుడి చేతి ముళ్ల కొరడా ను. మీరు గనుక ఘోర పాపాలు చేయకపోయి ఉంటే, దేవుడు నన్నొక శిక్షగా మీ మీదకు ప్రయోగించేవాడు కాదు’’ అని. చెంఘీజ్‌ఖాన్ నిజంగానే ఇలా అన్నాడా? లేక ఇది రచయిత విల్కిన్ కల్పించిన మాటా? ఏదైనా కావచ్చు. అయితే చెంఘీజ్ స్వభావాన్ని బట్టి అతడు నిజంగానే అలా అని ఉంటాడని అనుకోవడంలో తప్పు లేదు. క్రీ.శ. 1206-1227 మధ్య మంగోలు సామ్రాజ్యాన్ని పరిపాలించిన చెంఘీజ్‌ఖాన్‌కు అత్యంత క్రూరుడైన పాలకుడిగా పేరు. అతడి మతం ‘షామనిజం’. పితృదేవతలను పూజించడం షామనిజంలోని ఆచారం. అయితే చెంఘీజ్ షామనిజంతో పాటు తక్కిన మతాల మీద కూడా ఆసక్తి కనబరిచాడని, భిక్షువులను రప్పించుకుని బౌద్ధం గురించి, ముల్లాలను పిలిపించుకుని ఇస్లాం గురించి, ప్రబోధకులకు ఆహ్వానం పంపి క్రైస్తవ మతం గురించి తెలుసుకునేవాడని విల్కిన్ లాంటి చరిత్రకారులు రాశారు. దీన్ని బట్టి చెంఘీజ్‌ఖాన్‌ను ఆస్తికుడైన మహాక్రూరుడు అనుకోవాలి. ఎలా అనుకోవడం? ఆస్తికత్వానికి, క్రౌర్యానికీ పొంతన కుదరదే! కుదుర్చుకుని ఉంటాడు. సామ్రాజ్యవాది ఎంతకైనా గుర్రాన్ని దౌడు తీయిస్తాడు. ఇటీవల లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ ఒక ప్రకటన విడుదల చే శారు. దేశ పౌరులంతా మూడు రోజుల పాటు నిరాహారంగా ఉండి, దేవుని క్షమాభిక్ష కోసం ప్రార్థించాలని; అప్పుడు గానీ ఎబోలా వైరస్ నుంచి లైబీరియాకు విముక్తి లభించదని! ఆమె ఎందుకిలా చేశారు? చెంఘీజ్‌ఖాన్‌లా తన పాలనకు దేవుడిని అడ్డు పెట్టుకున్నారా? లేదు. లైబీరియాలో ఇప్పటికే ఎబోలా వ్యాధితో వందల మంది మరణించారు. దానికి చికిత్సగానీ, మందులు గానీ లేకపోవడంతో ఎబోలా ప్రబలుతుందేమోనని లైబీరియాతో పాటు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ తరుణంలో ‘లైబీరియన్ కౌన్సిల్ ఆఫ్ చర్చస్’ ఎబోలాకు దేవుడిని ముడిపెట్టి ప్రజలంతా నీతిమంతులుగా ఉండాలని కోరింది. ‘‘లైబీరియా మీద దేవుడు కోపంగా ఉన్నాడు. అందుకే ఎబోలాతో శిక్షిస్తున్నాడు. కనుక ప్రజలంతా తక్షణం తమ పాప కార్యాలను కట్టిపెట్టి దేవుడిని క్షమాపణ కోరాలి. అప్పుడుగానీ ఎబోలా శాంతించదు’’ అని కౌన్సిల్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు స్పందించిన లైబీరియా అధ్యక్షురాలు తనూ అదే రకమైన ప్రకటన చేశారు తప్ప ఇంకేమీ కాదు. అయితే దీనిపై పశ్చిమ ఆఫ్రికా దేశాల్లోని క్రైస్తవ మండళ్లు, ముఖ్యంగా ఘనా క్రిస్టియన్ కౌన్సిల్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఎబోలాకు, దేవుడికి ఏ మాత్రం సంబంధంలేదు. ఎబోలా ఒక వ్యాధి. దానిని నిర్మూలించేందుకు, వ్యాపించకుండా చూసేందుకు ఘనా వైద్య శాఖ ఉంది’’ అని కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ క్వబేనా తనూ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ ప్రకటనతో నిమిత్తం లేకుండా ఘనా నాయకులు లైబీరియా నాయకురాలు ఎలెన్ జాన్సన్ మాదిరిగా ఎబోలా భారాన్ని దేవుడి మీదే వేశారు. సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు ఘనాను తప్పక కాపాడతాడని అంటూ, ‘‘ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు’’. (కీర్తనలు 50:15) అనే బైబిల్ వాక్యాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రజల్లో భయం తగ్గించడానికి దేవుడిని ఇలా భూమి మీదకు లాగడంలో తప్పులేదు. చెంఘీజ్‌ఖాన్‌లా ప్రజల్ని భయపెట్టడానికి దేవుడిని తోడుతెచ్చుకోవడాన్ని మాత్రం బహుశా ఆ దేవుడు కూడా హర్షించకపోవచ్చు. - మాధవ్ శింగరాజు -
ఎబోలాపై అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి
జాతీయం రక్షణ, రైల్వేల్లో విదే శీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి రక్షణ రంగంలో 49 శాతం, రైల్వేల్లో కొన్ని విభాగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 6న అంగీకరించింది. రక్షణ రంగంలో ప్రస్తుతం 26 శాతం వరకు అనుమతి ఉంది. రైల్వేల్లో హైస్పీడ్ రైళ్ల వ్యవస్థ, సబర్బన్ కారిడార్లు, సరకు రవాణా లైన్ల వంటి విభాగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించింది. బాల నేరస్థుల విచారణపై జువెనైల్ జస్టిస్ బోర్డుకు అధికారం తీవ్రమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 16-18 ఏళ్ల మధ్య ఉన్న వారిని సంస్కరణ గృహానికి పంపాలా లేదా సాధారణ కోర్టులో విచారించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం జువెనైల్ జస్టిస్ బోర్డుకు అప్పగిస్తూ కేంద్ర కేబినెట్ ఆగస్టు 6న నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బాలనేరస్థుల చట్టం ప్రకారం మైనర్లు ఎంత తీవ్ర నేరాలకు పాల్పడినా వారిపై కోర్టులో విచారణ జరపడానికి వీలులేదు. వారికి గరిష్ట శిక్షగా మూడేళ్ల నిర్బంధం మాత్రమే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి మరణశిక్ష విధించడానికి వీలులేదు. ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార కేసులో మైనర్ కూడా నిందితుడుగా ఉన్న సంఘటనతో బాల నేరస్థుల చట్టాన్ని సవరించాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. దేశంలో విద్యుత్ సౌకర్యం లేనివారు 40 కోట్ల మంది దేశంలో మూడింట ఒక వంతు మందికి విద్యుత్ సౌకర్యం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 7న లోక్‌సభకు తెలిపారు.ప్రస్తుతం ఎనిమిది కోట్ల గృహాలకు విద్యుత్ సౌకర్యం లేదు. అంటే 40 కోట్ల మందికి విద్యుత్ అందుబాటులో లేదని ప్రకటించారు. దేశంలో విద్యుత్ లేని గ్రామాల సంఖ్య 12,468. వీటిలో అత్యధికంగా బీహార్‌లో 6,882 గ్రామాలున్నాయని మంత్రి వివరించారు. మిజోరం గవర్నర్ బేనీవాల్ తొలగింపు మిజోరం గవర్నర్ కమలా బేనీవాల్‌ను తొలగిస్తూ ఆగస్టు 6న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కమలా బేనీవాల్ ఆ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించారు. కాగా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ గోవా గవర్నర్‌గా ఆగస్ట్ 7న అదనపు బాధ్యతలు స్వీకరించారు. క్రీడలు ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక బృందానికి స్వర్ణ పతకం పోలెండ్ దేశం వ్రోక్లా నగరంలో జరుగుతున్న ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక కుమారి నేతృత్వంలోని మహిళల రికర్వ్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆగస్టు 10న జరిగిన ఫైనల్లో దీపికా కుమారి, బొంబేలా దేవీ, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు మెక్సికో జట్టుపై విజయం సాధించింది. కాగా జయంత తాలుక్దార్ సారథ్యంలోని భారత పురుషుల జట్టు రజతం సాధించింది. రద్వాన్ స్కా కు డబ్ల్యూటీఏ రోజర్స్ కప్ టైటిల్ డబ్ల్యూటీఏ రోజర్స్ కప్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రద్వాన్ స్కా (పోలెండ్) గెలుచుకుంది. టొరంటోలో ఆగస్టు 11న జరిగిన ఫైనల్లో వీనస్ విలియమ్స్ (అమెరికా)ను రద్వాన్ స్కా ఓడించింది. సోంగాకు ఏటీపీ రోజర్స్ కప్ టైటిల్ ఏటీపీ రోజర్స్ కప్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను జోవిల్ ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) కైవసం చేసుకున్నాడు. ఆగస్టు 11న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) ను సోంగా ఓడించాడు. లెడెకి మరో ప్రపంచ రికార్డు అమెరికా స్వివ్ముర్ కేటీ లెడెకి మరో సంచనలం సృష్టించింది. యుూఎస్ స్విమ్మింగ్ జాతీయ చాంపియున్‌షిప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన వుహిళల 400 మీటర్ల ఫ్రీస్టరుుల్ రేసును 17 ఏళ్ల ఈ అమ్మాయి 3ని.58.86 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఇటలీ స్వివ్ముర్ ఫెడ్రికా పెల్లెగ్రిని (3:59.15 సెకన్లు) పేరిట ఉండేది. హైటెక్ బాడీ సూట్‌ను నిషేధించిన తర్వాత పెల్లెగ్రిని ఈ రికార్డు నెలకొల్పింది. ఇదే టోర్నీలో 800 మీటర్లు. 1500 మీటర్ల ఫ్రీస్టరుుల్లోనూ కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించిన లెడెకి... జానెట్ ఇవాన్స్ (1998 నుంచి 2006 మధ్యలో) తర్వాత ఏకకాలంలో వుూడు విభాగాల్లో ప్రపంచ రికార్డులు నమోదు చేసుకున్న స్విమ్మర్‌గా గుర్తింపు పొందింది. ఎకానమీ అత్యంత విలువైన భారత బ్రాండ్ టాటా దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూపు నిలిచింది. రూ. 1,26,000 కోట్లతో టాప్ 100 భారత బ్రాండ్లలో అగ్రస్థానం సొంతం చేసుకొంది. రెండు, మూడు స్థానాల్లో ఎల్ఐసీ, ఎస్బీఐ నిలిచాయి. ఈ వివరాలను కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా తన వార్షిక సర్వేలో వెల్లడించింది. వంద కంపెనీల మొత్తం బ్రాండ్ విలువ 92.6 బిలియన్ డాలర్లు కాగా అందులో అయిదో వంతు టాటా గ్రూపుదే కావడం విశేషం. అత్యంత ధనికుల దేశాల్లో భారత్‌కు ఎనిమిదో స్థానం అత్యంత ధనవంతులున్న దేశాల్లో ప్రపంచంలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉందని న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో 14,800 మంది కుబేరులున్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం అమెరికా, చైనా, జర్మనీ దేశాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 2,700 మంది కుబేరులతో అత్యధిక ధనవంతులున్న తొలి 25 నగరాల్లో ముంబయికి చోటు దక్కింది. 15,400 మంది ధనవంతులతో హాంకాంగ్ అగ్రస్థానంలో నిలిచింది. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు ఆగస్టు 5న ప్రకటించిన పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రాధాన్యతినిస్తూ రెపోరేటును 8 శాతం, రివర్స్ రెపోరేటు 7 శాతం , సీఆర్ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో- నగదు నిల్వల నిష్పత్తి) ని 4 శాతం వద్దనే ఉంచింది. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) ని అరశాతం తగ్గించింది. దీంతో ఇది 22.5 శాతం నుంచి 22 శాతానికి చేరింది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 40 వేల కోట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును 5.5 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతానికి, 2016 నాటికి 6 శాతానికి పరిమితం చేయడం లక్ష్యంగా పేర్కొంది. సదస్సులు తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల సదస్సు తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల నాలుగో సదస్సు మయన్మార్‌లోని నేపితాలో ఆగస్టు 10న జరిగింది. సదస్సులో పాల్గొన్న భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ దక్షిణ చైనా సముద్రంలో చైనా బలప్రయోగాన్ని వ్యతిరేకించారు. ఈ విషయంలో బ్రూనై, మలేిషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్లతో చైనా పోరాడుతోంది. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం నుంచి అనుమతి పొంది భారత్ జరుపుతున్న చమురు తవ్వకాలపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులపై బేసిక్ దేశాల మంత్రుల సమావేశం బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, భారత్, చైనా (బేసిక్) దేశాల మంత్రుల స్థాయి సమావేశం న్యూఢిల్లీలో ఆగస్టు 7,8 తేదీల్లో జరిగింది. వాతావరణ మార్పులు, ఐక్యరాజ్యసమితి కార్యాచరణ అంగీకారానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సైన్స అండ్ టెక్నాలజీ తోకచుక్కను చేరిన తొలి అంతరిక్ష నౌక తోకచుక్కను చేరిన తొలి అంతరిక్ష వాహక నౌకగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రొసెట్టా అరుదైన ఘనతను సాధించనుంది. (చర్యుమోవ్- జిరాసిమెంకో) అనే పేరుగల తోక చుక్కను ఈ నౌక 10 సంవత్సరాల 5 నెలల 4 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చేరువైంది. ప్రస్తుతం ఇది తోకచుక్క ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తుంది. ఈ ఏడాది నవంబర్ నాటికి దానిపై ల్యాండ్ కానుంది. ఈ తోకచుక్కను 1969లో కనుగొన్నారు. గ్లోబల్ వార్మింగ్‌కు మానవ చర్యలే ప్రధాన కారణం: ఐపీసీసీ గ్లోబల్ వార్మింగ్ (భూతాపం)కు మానవులే ప్రధాన కారణమని ఐక్యరాజ్య సమితికి చెందిన వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ ) ఆగస్టు 6న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వాతావరణ మార్పులు మనుషుల ఆరోగ్యం, దక్షిణ ఆసియాలోని ఆవాసాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. 1950 నుంచి ఆసియాలో చల్లగా ఉండే రాత్రీపగలు రోజుల సంఖ్య తగ్గి, వేడితో కూడిన రాత్రీపగలు రోజుల సంఖ్య పెరిగాయని తెలిపింది. అంతర్జాతీయం 2020 నాటికి బీజింగ్‌లో బొగ్గు వినియోగం నిషేధం చైనా రాజధాని బీజింగ్‌లో 2020 నాటికి బొగ్గు వినియోగాన్ని నిషేధించాలని బీజింగ్ మున్సిపల్ పర్యావరణ పరిరక్షణ బ్యూరో ఆగస్ట్ 4న నిర్ణయించింది. బీజింగ్‌తోపాటు మరో ఐదు జిల్లాల్లో బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిషేధించే ప్రణాళికకు రూపకల్పన చేసింది. చైనాలోని ప్రధాన పట్టణాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. సూయజ్ కాలువ జలమార్గ నిర్మాణ పనులు ప్రారంభం 145 ఏళ్ల చరిత్ర గల సూయజ్ కాలువ జలమార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులను ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత అల్-సిసి ఆగస్టు 6న ప్రారంభించారు. దీంతో ఐరోపా, ఆసియా ఖండాల మధ్య వర్తకం మరింత విస్తరించనుంది. సూయజ్ కాలువను తొలిసారిగా 1869లో ప్రారంభించారు. ఇది ఈజిప్ట్‌లోని మెడిటేరేనియన్, ఎర్ర సముద్రాలను కలిపే కృత్రిమ జలమార్గం. దీనివల్ల వర్తకుల నౌకలు, ఓడలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టిరాకుండా నేరుగా ఐరోపాను చేరుకోవచ్చు. ఎబోలాపై అంతర్జాతీయ వైద్య ఎమర్జెన్సీ పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తున్న ఎబోలా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగస్టు 8న అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్ ప్రభావిత దేశాలకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ కోరారు. గత నాలుగు దశాబ్దాల్లో తీవ్రమైన, సంక్లిష్టమైన మహమ్మారి ఇదేనని పేర్కొన్నారు. 2009లో స్వైన్‌ఫ్లూ వ్యాపించిన సమయంలోనూ, గత మేలో పోలియో విషయంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎబోలా వ్యాప్తి గినియాలో గత మార్చిలో ఆరంభమైంది. అక్కడినుంచి సియోర్రాలియోన్, లైబీరియా, నైజీరియాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. వార్తల్లో వ్యక్తులు అర్జున అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా కపిల్‌దేవ్ భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ నిఖంజీ అర్జున అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్‌గా ఆగస్టు 7న ఎంపికయ్యారు. 2014లో దేశంలో అన్ని క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపికచేసి,అవార్డులను ప్రకటించేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. ఎడ్వెర్డ్ స్నోడెన్‌కు రష్యా మూడేళ్ల ఆశ్రయం అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ నిర్వాహకుడు ఎడ్వర్డ్ స్నోడెన్‌కు మూడేళ్లపాటు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలని రష్యా ఆగస్టు 7న నిర్ణయించింది. స్నోడెన్‌కు 2013లో ఏడాది పాటు ఆశ్రయం ఇచ్చింది. దాని కాలపరిమితి ఈ ఏడాది ఆగస్టు 1నాటికి ముగియడంతో, మరో మూడేళ్ల పాటు పొడిగించింది. ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తూ 2013లో జాతీయ భద్రత రహస్యాలను బట్టబయలు చేసినందుకు స్నోడెన్‌పై అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించింది. వీటి నుంచి తప్పించుకునేందుకు అతడు హాంకాంగ్ పారిపోయాడు. అక్కడి నుంచి మాస్కోకు చేరుకున్నాడు. అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ సస్పెన్షన్ అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ వీరేందర్ మాలిక్‌ను ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 4న సస్పెండ్ చేసింది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో లైంగిక దాడి అభియోగాల కింద అరెస్ట్ అయిన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. విచారణలో మాలిక్ దోషిగా తేలితే అన్ని జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ల నుంచి శాశ్వత బహిష్కరణకు గురవుతాడు. భారతీయ యువ రచయితకు ప్రతిష్ఠాత్మక పురస్కారం భారతీయ యువ రచయిత నిఖిల్ చంద్వానీ (20)కి ప్రతిష్ఠాత్మక అమెరికన్ లిటరరీ ఫోరం సొసైటీ పురస్కారం లభించింది. ఆయన రాసిన కోడెడ్ కాన్స్పిరసీ అనే నవలకు ఈ పురస్కారం దక్కింది. -
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా మహమ్మారి..
‘ఎబోలా’.. ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి! దీని ముప్పును గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభావిత దేశాలకు సహాయసహకారాలు అందజేయాలంటూ ప్రపంచ దేశాలకు సూచించింది... ప్రస్తుతం ఎబోలా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజా వ్యాధి వ్యాప్తికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో తొలి కేసును గుర్తించారు. ఆ తర్వాత పొరుగున ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా తదితర దేశాల్లో కేసులు నమోదయ్యాయి. 2009 మార్చిలో మెక్సికోలో కనిపించిన స్వైన్ ఫ్లూ.. తర్వాత యావత్ ప్రపంచానికి వ్యాపించింది. 2003లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్).. తొలుత ఆసియాలో కలకలం సృష్టించి, తర్వాత ప్రపంచం మొత్తానికి విస్తరించింది. ఈ రెండు సంఘటనల్లో కొన్ని వందల మరణాలు సంభవించాయి. ప్రస్తుత ఎబోలా వ్యాధితో చాలా ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమాఫ్రికా దేశాలకే పరిమితమైనప్పటికీ, మున్ముందు మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎబోలా 1,779 మందికి సంక్రమించగా, దాదాపు వెయ్యి మంది మరణించారు. వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. వైరస్‌కు ఆశ్రయమిచ్చే గబ్బిలాలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎబోలా వైరస్ వ్యాధి (ఉఛౌ్చ గజీటఠట ఈజీట్ఛ్చట్ఛఉగఈ) లేదా ఎబోలా హెమరేజిక్ ఫీవర్ (ఉఏఊ) బారినపడిన వారిలో 80 శాతం మంది మరణిస్తారు. ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షాధార అడవులకు దగ్గరున్న సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఎబోలా వ్యాధి వ్యాపిస్తుంటుంది. వన్య ప్రాణుల నుంచి మనిషికి సోకి, ఆ తర్వాత మనుషుల మధ్య వ్యాధి విజృంభిస్తుంది. ఫ్రూట్‌బ్యాట్స్ అనే గబ్బిలాలు ఎబోలా వైరస్‌కు ఆశ్రయం ఇస్తాయి. మొదటిసారిగా 1976లో బెల్జియం పరిశోధకుడు పీటర్ పయట్ ఎబోలాను గుర్తించారు. ఒకేసారి ఆఫ్రికాలోని సూడాన్‌లో గల జారా ప్రాంతంతో పాటు కాంగోలోని ఎబోలా నది ఒడ్డున యంబుకు ప్రాంతంలో వ్యాధి మొదటిసారిగా అలజడి సృష్టించింది. అప్పట్నుంచి ఎబోలా వ్యాధిగా పిలుస్తున్నారు. ఎబోలా వైరస్.. ఫైలో విరిడే కుటుంబానికి చెందింది. కాబట్టి దీన్ని ఫైలో వైరస్ అని కూడా అంటారు. ఎబోలా వైరస్ ప్రజాతిలో ఐదు భిన్న జాతులుంటాయి. అవి.. బుండిబుగ్యో ఎబోలా వైరస్ (బీడీబీవీ); జైర్ ఎబోలా వైరస్ (ఈబీఓవీ); రెస్టాన్ ఎబోలా వైరస్ (ఆర్‌ఈఎస్టీవీ); సూడాన్ ఎబోలా వైరస్(ఎస్‌యూడీవీ); టాయి ఫారెస్ట్ ఎబోలా వైరస్ (టీఏఎఫ్వీ). వీటిలో బీడీబీవీ, ఈబీఓవీ, ఎస్‌యూడీవీ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందాయి. ఫిలిప్పీన్స్, చైనాలో గుర్తించిన ఆర్‌ఈఎస్టీవీ రకం మనుషులకు సోకినా, పెద్దగా ప్రభావం చూపించదు. వ్యాప్తి.. విజృంభణ: ఎబోలా వ్యాధి బారిన పడిన జంతువుల రక్తం, ఇతర శరీర స్రావాల నుంచి వైరస్ మనిషికి వ్యాపిస్తుంది. ఆఫ్రికా అడవుల్లో చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు, అడవి దుప్పిలు వ్యాధికి గురై మరణించినప్పుడు, వాటిని తొలగించే క్రమంలో ఎబోలా మనిషికి సోకినట్లు గుర్తించారు. ఈ వైరస్ ఒకసారి మనిషిలోకి చేరితే వెంటనే ఇతరులకు తేలిగ్గా వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. వ్యాధి బారినపడిన రోగి శరీర ద్రవాలు ముఖ్యంగా లాలాజలం, రక్తం, చెమట, వాంతులు, వీర్యం తదితరాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. సరైన రక్షణ లేకపోతే ఎబోలా రోగులకు చికిత్స అందించే సిబ్బందికి కూడా ఇది వ్యాపిస్తుంది. మృతదేహాల ఖననం సందర్భంలోనూ బంధువులకు వ్యాపించే ప్రమాదముంది. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఏడు వారాల వరకు వీర్యంలో వైరస్ కనిపిస్తుంది. మృత్యు ఒడికి.. వైరస్ సోకిన తర్వాత రక్తపీడనం పడిపోవడం, అవయవాల పనితీరు దెబ్బతినటం వల్ల రోగి మరణిస్తాడు. ఈ వ్యాధి పొదిగే కాలం (శరీరంలోకి వ్యాధి కారకం ప్రవేశించిన దగ్గర నుంచి లక్షణాలు బయటపడేందుకు పట్టే సమయం) వారం రోజులు. తొలుత కనిపించే లక్షణాలు.. జ్వరం, శరీరంపై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి. వీటితో పాటు వెన్నునొప్పి, కీళ్లవాపు, నీళ్ల విరేచనాలు, గొంతు తడి ఆరిపోవడం వంటివి కనిపిస్తాయి. శరీరంలో వ్యాధి విజృంభిస్తే నోరు, చెవులు, ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంది. జననాంగాల్లో వాపు, కళ్ల కలకలు, నోరు పైభాగం ఎర్రగా కందడం, శరీరమంతా దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. శరీరం లోపల, బయట తీవ్ర రక్తస్రావం సంభవిస్తుంది. తెల్ల రక్తకణాలు, రక్త ఫలకికల సంఖ్య క్షీణతతో పాటు కాలేయంలో ఎంజైముల స్థాయి పెరుగుతుంది. సత్వర చికిత్స అందిస్తేనే వ్యక్తి బతుకుతాడు. లేకుంటే 90 శాతం మృతి చెందే అవకాశముంటుంది. టీకా అందుబాటులో లేదు: ప్రారంభ లక్షణాలు కనిపించిన వారిలో మలేరియా, టైఫాయిడ్, కలరా, ప్లేగు, హెపటైటిస్, డెంగీ జ్వరాలు లేవని నిర్ధారించిన తర్వాత ఎబోలా పరీక్ష నిర్వహించాలి. ఎలీసా, యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్, కణ వర్ధనం తదితర పద్ధతుల్లో వ్యాధిని నిర్ధారించాలి. రోగి నుంచి సేకరించిన రక్త నమూనాలు చాలా ప్రమాదకరమైనవి. శరీరంలోని వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక నిరోధక మందులేవీ లేవు. అందువల్ల లక్షణాలకు చికిత్స (డఝఞ్టౌఝ్చ్టజీఛి ఖీట్ఛ్చ్టఝ్ఛ్ట) అందించాలి. ఎబోలా వ్యాధి నివారణకు టీకా అందుబాటులో లేదు. ఈ తరుణంలో ఎబోలా వ్యాప్తిని నిరోధించే మార్గాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. వ్యాధి ప్రభావిత దేశాల్లో దాదాపు 45 వేల మంది భారతీయులున్నట్లు అంచనా. ఒక్క లైబీరియాలోనే వెయ్యి మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరందరూ ఇప్పుడు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశముంది. అందువల్ల భారత్ అప్రమత్తంగా ఉండటం అవసరం. వ్యాధి ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారిని, అనుమానిత లక్షణాలు ప్రదర్శించే వారిని విమానాశ్రయాల వద్ద క్వారంటైన్లను ఏర్పాటు చేసి, పరీక్షించాలి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంది. డబ్ల్యూహెచ్‌వోతోపాటు ఐరోపా యూనియన్, అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తదితర సంస్థలు ఎబోలా వ్యాప్తిపై దృష్టి సారించాయి. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు: కేవలం ఆఫ్రికాలోనే కాకుండా చైనా, ఫిలిప్పీన్స్‌లోనూ ఎబోలా వైరస్ ఇతర జాతులు వ్యాప్తిలో ఉన్నాయి. అందువల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అడవి జంతువుల మాంసాన్ని (బుష్ మీట్) బాగా ఇష్టపడతారు. చింపాంజీ, గబ్బిలాలు తదితరాల మాంసాన్ని తింటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి జంతువులను తాకినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, జంతువుల మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఎబోలా వైరస్ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగా ఉంటాయి. అందువల్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, చేతులకు పొడవాటి గ్లోవ్స్, ముఖానికి మాస్క్ ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ప్రస్తుతం ఎబోలా వైరస్ వ్యాధి విస్తరిస్తున్న తీరునుబట్టి పరిస్థితి విషమంగా ఉందని, ఇది అదుపుతప్పి ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎబోలా ప్రభావిత దేశాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేనందున ప్రపంచ దేశాలు సహాయం అందించాలని సంస్థ డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ కోరారు. ఇప్పటి వరకు భారత్‌లో ఎక్కడా ఎబోలా కేసును గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే గినియా నుంచి చెన్నైకు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా సోకినట్లు అనుమానం ఉండటంతో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకలేదని లేదని తేలింది. అయినా ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాలి. ప్రత్యేక నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఏమాత్రం ఉపేక్షించినా అపార ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది. -
‘ఎబోలా’ భయం
సాక్షి, చెన్నై:ఆధునిక యుగంలో సరికొత్త రోగాలు ప్రజలను వణికిస్తున్నాయి. గతంలో చికున్ గున్యా, స్వైన్ ఫ్లూ ప్రజల్ని భయ కంపితుల్ని చేశాయి. తాజాగా ఎబోలా ప్రజల్లో కలకలాన్ని రేపుతోంది. రెండు రోజుల క్రితంఆఫ్రికా ఖండంలోని గినియూ నుంచి చెన్నైకు వచ్చిన తేని యువకుడు జ్వరం బారిన పడ్డట్టు వైద్యులు గుర్తించారు. దీంతోప్రజల్లో ఎబోలా భయం పట్టుకుంది. ఆ జ్వరం తీవ్రత గురించి పత్రికల్లో, మీడియాల్లో వస్తున్న కథనాలు, దక్షిణాఫ్రికాలో ఆ తీవ్రతతో చోటు చేసుకుంటున్న మరణాలు వెరసి ప్రజల్లో తెలియని భయాన్ని సృష్టిస్తున్నాయి. అబ్జర్వేషన్లో పార్తిబన్: జ్వరంతో గినియూ నుంచి వచ్చిన పార్తిబన్‌కు అన్ని వైద్య పరీక్షలు చేశారు. అయితే, అతడి రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత తగ్గి, ఆరోగ్యంగా ఉన్నాడు. స్వగ్రామానికి సైతం అతడిని పంపించారు. అయినా, అధికారుల్లో తెలియని భయం వెంటాడుతోంది. దీంతో అతడిని తమ అబ్జర్వేషన్లో ఉంచుకున్నారు. అతడి స్వగ్రామంలోనే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా వైద్య బృందాన్ని రంగంలోకి దించారు. 21 రోజుల పాటుగా ఈ వైద్య బృందం అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, మళ్లీ జ్వరం బారిన పడకుండా చర్యలు తీసుకోవడం కాస్త ప్రజల్లో మరింత ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఈ విషయమై పార్తిబన్‌కు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ శివగామి పేర్కొంటూ, అతడికి ఎలాంటి జ్వరం లేదని స్పష్టం చేశారు. అయితే, ఏదేని జ్వరం తీవ్రతకు మళ్లీ గురైన పక్షంలో, మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని, అందుకే తాము అతడిని అబ్జర్వేషన్లో ఉంచామని వివరించారు. మరో ముగ్గురికి : పార్తిబన్‌కు తోడు మరో ముగ్గురు దక్షిణాఫ్రికా నుంచి రాష్ర్టంలోకి వచ్చినట్టు తేలింది. ఆదివారం దుబాయ్ నుంచి మదురైకు వచ్చిన ఓ విమానంలో ముగ్గురు దక్షిణాఫ్రికాలోని గానా నగరం నుంచి కొడెకైనాల్‌కు వచ్చినట్టు గుర్తించారు. ఎట్టకేలకు వీరిని మంగళవారం గుర్తించారు. డలో డైవాన్ అమ్మి(45), డివెన్స్ స్ట్రీ(6), ఆండ్రినియ(3)గా వారిని గుర్తించి, వైద్య పరీక్షలు చేశారు. డైవాన్ గతంలో కొడెకైనాల్లోని ఓ కళాశాలలో చదువుకుని గానాలో స్థిర పడ్డారు. ఓ కార్యక్రమం నిమిత్తం కొడెకైనాల్‌కు వచ్చారు. వారికి వైద్య పరీక్షలు పూర్తి చేసినాననంతరం, ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించారు. ఆఫ్రికా ఖండం నుంచి దుబాయ్, సౌదీల మీదుగా చెన్నైకు వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉన్నట్టుగా విమానాశ్రయ వర్గాల పరిశీలనలో తేలింది. దీంతో రాష్ట్రంలోని చెన్నై, మదురై, కోయంబత్తూరు విమానాశ్రయాల్లోని విదేశీ టెర్మినల్స్ వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు వైద్యాధికారుల నేతృత్వంలో, కస్టమ్స్, విమానాశ్రయాల అధికారులతో ఏర్పాటు చేసిన ఈ బృందం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని క్షుణ్ణంగా పరిశీలించనుంది. వారి పాస్‌పోర్టుల ఆధారంగా ఎక్కడి నుంచి వస్తున్నారో గుర్తించి, అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. కోయంబత్తూరు, మదురై, చె న్నై ప్రభుత్వాస్పత్రుల్లో ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఎబోలా రాష్ట్రంలో లేదని, అయినా, ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాట్లు చేశామని ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇదే మాదిరిగా రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ లేదంటూ తొలుత తేల్చినా, అనంతరం ఆ ఫ్లూ విలయతాండవంతో ప్రజలు భయం గుప్పెట్లో ముందస్తు టీకాలు వేసుకోవాల్సి రావడం గమనార్హం. -
‘ఎబోలా’పై అప్రమత్తం
సాక్షి, ముంబై : ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ డిసీజ్ (ఈవీడీ)పై బీఎంసీ అప్రమత్తమైంది. అసాధారణమైన ఈ వ్యాధి ఆఫ్రికాలోప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఇటీవల ప్రకటించడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందుకు అవసరమైన చర్యలు తీసుకొంటోంది. వైరస్‌ను ఎదుర్కోవడానికి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఒక వేళ ఈ వైరస్‌ను నగరంలో గుర్తిస్తే తీసుకోవాల్సిన చర్యలపై బీఎంసీ కసరత్తు చేస్తోంది. ఎయిర్‌పోర్టు అధికారులకు అవగాహన అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రయాణికులు ఎవరైనా ఈ వైరస్‌ను మోసుకొస్తున్నారా అనే అంశంపై కూడా బీకేసీ ఆరోగ్య విభాగం ఆరా తీస్తోంది. ఎయిర్ పోర్టులోని అతి ముఖ్యమైన విభాగాలకుఈవైరస్‌పై సంబంధిత అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఈ వైరస్ సోకిన వారిని సున్నితంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని వివరిస్తారు. వెస్ట్ ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల కాలంలో ఎంత మంది ప్రయాణికులు వచ్చారో, వారి వివరాలను అందజేయాలని బీఎంసీ ఎయిర్ పోర్ట్ అధికారులకు లేఖ రాసింది. 20 రోజులల్లోపు ఇక్కడికి వచ్చిన ప్రయాణికుల వివరాలను అందజేయాలని కోరింది. ఈ ప్రయాణికులకు వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అని పరీక్షించనున్నారు. వ్యాధి సోకితే వీరికి చికిత్స కూడా నిర్వహించనున్నారు. గుర్తించిన ఆస్పత్రులు కేం, సైన్, బీవైఎల్ నైర్ ఆస్పత్రి వైద్య సిబ్బందికి... ఈ వైరస్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వ్యాధి బాధితులకు చికిత్స అందజేయడానికి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కొత్త జోగేశ్వరి ట్రామా ఆస్పత్రి, చించ్పోక్లీలోని కస్తూర్బా ఆస్పత్రులను కార్పొరేషన్ గుర్తించింది. ఈ వ్యాధి అనుమానితులను జోగేశ్వరి ఆస్పత్రికి తరలిస్తారు, వ్యాధి నిర్ధాణ అయిన కేసులను కస్తూర్బా ఆస్పత్రికి తరలించనున్నట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఏవీడీ కోసం 10 బెడ్లను రిజర్వ్ చేసి ఉంచామన్నారు. ఆందోళన అవసరం లేదు: డాక్టర్ పద్మజ ఎబోలా వైరస్ పట్ల నగరానికి ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని కార్పొరేషన్ ప్రకటించింది. నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఎంసీ ఎగ్జిక్యూటివ్ వైద్యాధికారి డాక్టర్ పద్మజ కేత్కర్ పేర్కొన్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా తగు చర్యలు తీసుకొంటున్నారన్నారు. ముంబైలో కూడా మందస్తు చర్యలు తీసుకొంటున్నామని వెల్లడించారు. సమీప రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు నమోదుకాలేదన్నారు. -
ప్రాణాలు తీస్తున్న కొత్త వైరస్