న్యూయార్క్: కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎబోలా వైరస్ కాంగోలోని గోమాకు విస్తరించిందంటూ కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించడంతో డబ్ల్యూహెచ్‌ఒ ఈ ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎమర్జెన్సీ కమిటీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఈ వైరస్ మూడు సార్లు వ్యాప్తి చెందడంతో అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 ఆగస్టులో ఈ వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకూ 1,600 మంది మృత్యువాత పడ్డారు. మొదటిసారి 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ను గుర్తించినప్పుడు అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment