ఇబోలాపై పోరుకు 150 కోట్లిచ్చిన ఫేస్బుక్ అధినేత | Mark Zuckerberg donates 25 million dollars to fight Ebola | Sakshi
Sakshi News home page

ఇబోలాపై పోరుకు 150 కోట్లిచ్చిన ఫేస్బుక్ అధినేత

Published Wed, Oct 15 2014 11:36 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఇబోలాపై పోరుకు 150 కోట్లిచ్చిన ఫేస్బుక్ అధినేత - Sakshi

ఇబోలాపై పోరుకు 150 కోట్లిచ్చిన ఫేస్బుక్ అధినేత

యావత్ ప్రపంచంతో పాటు ప్రధానంగా అమెరికాను వణికిస్తున్న ఇబోలాపై పోరాటానికి ఫేస్బుక్ అధినేత మార్క్ జుకెర్బెర్గ్ భారీ విరాళం ప్రకటించారు.

యావత్ ప్రపంచంతో పాటు ప్రధానంగా అమెరికాను వణికిస్తున్న ఇబోలాపై పోరాటానికి ఫేస్బుక్ అధినేత మార్క్ జుకెర్బెర్గ్ భారీ విరాళం ప్రకటించారు. తన భార్య ప్రిసిల్లాతో కలిసి దాదాపు 150 కోట్ల రూపాయలు ఇచ్చారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్ఓల్ అండ్ ప్రివెన్షన్ సంస్థకు ఈ మొత్తం పంపారు.

వీలైనంత తక్కువ కాలంలోనే ఈ వ్యాధిని మనం అదుపు చేయాలని, లేకపోతే అది మరింతగా వ్యాప్తి చెంది.. దీర్ఘకాలంలో ఆరోగ్య సంక్షోభంగా మారుతుందని, చివరకు హెచ్ఐవీ, పోలియోలలాగే ఇబోలా మీద కూడా కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వస్తుందని తన ఫేస్బుక్ పోస్టులో తెలిపాడు. ఇప్పటివరకు నాలుగువేల మంది ఇబోలా బారిన పడి మరణించారు. వీరిలో ఎక్కువ మంది పశ్చిమాఫ్రికాకు చెందినవాళ్లే. ఇప్పటికీ మరో 8,400 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు జుకెర్బెర్గ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement