మోగాదిషూ: తమ దేశంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ పై విస్తరించిందన్న వార్తలను సోమాలియా కొట్టిపారేసింది. తమ దేశంలో ఎబోలా వైరస్ విస్తరించలేదని తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు సోమాలియా ఆరోగ్య శాఖ మంత్రి అలీ మహ్మద్ మోహ్మద్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ దేశానికి చెందిన అబ్దుల్ ఖాదిర్ ఎబోలా లక్షణాలు కల్గి ఉండటంతో అతన్ని ఆరోగ్య శాఖ డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి అన్ని అత్యంత ఖరీదైన పరీక్షలు నిర్వహించమన్నారు.
అయితే అతనికి ఎబోలా వైరస్ మాత్రం సోకలేదని అలీ తెలిపారు.ప్రస్తుతం తమ దేశంలో ఎబోలాపై వస్తున్న కథనాలు మాత్రం వాస్తవం కాదన్నారు.