ఐక్యరాజ్యసమితి: పశ్చిమాఫ్రికాను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 4,493కు చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఏడు దేశాల్లో మొత్తం 8,997 ఎబోలా కేసులు నమోదు కాగా, 4,493 మంది మరణించినట్టు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ప్రకటించారు. పశ్చిమాఫ్రికా దేశాల్లోనే ఎబోలా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఎబోలాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు కూడా దీని బారినపడుతున్నట్టు స్టీఫెన్ చెప్పారు.
ఎబోలాతో 4,493 మంది మృతి
Published Fri, Oct 17 2014 1:17 PM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM
Advertisement
Advertisement