సాక్షి, న్యూఢిల్లీ:ఎబోలా వైరస్... ఈ పేరు వింటేనే నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. నగరంలో ఎబోలా వైరస్ వ్యాధి మేనేజ్‌మెంట్ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించిన రామ్ మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆసుపత్రికి వస్తోన్న ఫోన్ కాల్స్ ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఈ ఆసుపత్రిలో ఇటీవల ప్రారంభించిన హెల్ప్‌లైన్‌కు ప్రతి రోజూ వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలను తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నవారితో పాటు ఎబోలా వ్యాధి విస్తరించిన దేశాలలో తమ బంధువులు ఉన్నవారు హైల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు.
ఎబోలా లక్షణాలు ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయని తెలియడంతో దగ్గు, జలుబుతో బాధపడేవారు కూడా తమను ఫోన్‌ద్వారా సంప్రదిస్తున్నారని ఆర్‌ఎంఎల్‌లో ఎబోలా వైరస్ డిసీజ్ నోడల్ అధికారి డాక్టర్ సునీల్ సక్సేనా చెప్పారు.రామ్ మనోహర్‌లోహియా ఆసుపత్రిని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి నోడల్ ఆసుపత్రిగా గుర్తించిన ప్రభుత్వం.... డాక్టర్ సునీల్ సక్సేనాను నోడల్ అధికారిగా నియమించింది. ఈ ఆసుపత్రిలో ఎబోలా వ్యాధికి కంట్రోల్ రూమ్‌తోపాటు హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటుచేశారు. 23061469, 23063205, 23061202 నంబర్లతో హెల్ప్‌లైన్లు పనిచేస్తున్నాయి.
వ్యాధిగ్రస్తులను విడిగా ఉంచి చికిత్స చేయడం కోసం ఆసుపత్రి పాత భవనం మొదటి అంతస్తులో ఐసోలేషన్ ఐసీయూను ఏర్పాటుచేశారు, 23404310 కలిగిన ఐసీయూ కూడా ఎబోలా వైరస్ గురించి సందేహాలకు సమాధానాలు ఇస్తోంది. ఎబోలా వైరస్ లక్షణాలున్నట్లుగా అనుమానించే వ్యక్తులను నేరుగా విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించేవిధంగా ఏర్పాట్లు చేశారు. మూడు షిఫ్టులలో రోగులకు వైద్య సేవలదించేందుకు వీలుగా వైద్య సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాల్ని నియమించారు. వ్యాధితో బాధపడతున్నట్లు గుర్తించిన కేసులకు వైద్యం అందించడం కోసం పడకలు సిద్ధంగా ఉంచాలంటూ కేంద్ర ప్రభుత్వం సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింగ్ ఆసుపత్రి అధికారులను ఆదేశించింది.
అంతటా ‘ఎబోలా’ గుబులు
Published Wed, Aug 13 2014 10:19 PM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement
Advertisement