అప్రమత్తంగా ఉందాం..!
డాక్టర్స్ కాలమ్
జ్వరాలన్నీ ఒకటే కావు. కొన్ని ప్రమాదకరమైన జ్వరాలూ ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే ప్రమాదకర వైరస్‌లు మొదట ప్రభావం చూపేది మహానగరాలపైనే. గతంలో స్వైన్ ఫ్లూ హైదరాబాద్‌పై పంజా విసిరింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న ఎబోలా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆయా దేశాల నుంచి ఎందరో పర్యాటకులు రోజూ హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్నారు. సిటీ నుంచి వందల సంఖ్యలో వ్యాపార, ఉద్యోగ రీత్యా ఎందరో రోజూ ఆఫ్రికా దేశాలకు వెళ్లి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎబోలా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కాంటినెంటల్ ఆస్పత్రికి చెందిన వైద్యురాలు డా.సౌజన్య చెబుతున్నారు. సాధారణ జ్వరాలకు ఉండే లక్షణాలన్నీ దీనికి కూడా ఉంటాయని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండటమే అసలైన మందు అని చెబుతున్నారామె.
వ్యాధి లక్షణాలు
►మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ జ్వరాల తరహాలోనే ఈ వ్యాధి లక్షణాలుంటాయి.
►నోట్లో ఎక్కువగా లాలాజలం ఊరుతుంది.
►శరీరం మొత్తం విపరీతంగా చెమటలు పడుతుంటాయి.
►శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
►ఛాతీలో విపరీతంగా నొప్పి వస్తుంది.
►కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి.
►శరీరంపై అక్కడక్కడా దద్దుర్లు వస్తాయి.
►వాంతులు, విరేచనాల ప్రభావం అధికంగా ఉంటుంది.
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
►ఇలాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
►దీనికి ప్రత్యేకంగా మందులుగానీ, టీకాలు గానీ లేవు. ఇవి ఇంకా పరీక్షా దశను దాటలేదు.
►విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు వైద్యపరీక్షలు
►పక్కాగా నిర్వహించాలి.
►ఎబోలా రోగులకు వైద్యం అందించడంలో నర్సులదే కీలక పాత్ర. అందుకే హైదరాబాద్ లాంటి నగరాల్లో నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అవసరం.
► కాచిన నీళ్లు తాగడం, చేతులు శుభ్రంగా కడుక్కుని ఆహారాన్ని తీసుకోవడం ప్రాథమిక జాగ్రత్తలు
ప్రజంటర్: జి.రామచంద్రారెడ్డి