సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్న ఘటనపై సూపరింటెండెంట్ ధైర్యవాన్ స్పందించారు
హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్న ఘటనపై సూపరింటెండెంట్ ధైర్యవాన్ స్పందించారు. 'నిన్న సాయంత్రం మూడు గంటలకు గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి చేరాడు. ఈనెల 21న నైజీరియా నుంచి ఆ వ్యక్తి వచ్చాడు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు గుర్తించాం. నైజీరియాలో ఎబోలా ప్రభావం లేదు. పేషెంట్ పేరు, ఊరు, వ్యక్తిగత వివరాలు ప్రసారం చేయొద్దు.
అనుమానంతో ఢిల్లీకి శాంపిల్స్ పంపాం. కొన్ని గంటల్లో రిపోర్టు వచ్చింది. ఆ పేషెంట్కు ఎబోలా ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. కేవలం నైజీరియా నుంచి వచ్చారు కాబట్టి...అనుమానంతో పరీక్షలు చేస్తున్నాం' అని సూపరింటెండెంట్ తెలిపారు. ఎబోలా వ్యాధి పట్ల ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ధైర్యవాన్ తెలిపారు.