
ఎబోలాను జయించారు
వాషింగ్టన్: ప్రమాదకర ఎబోలా వైరస్ బారినపడిన ఇద్దరు అమెరికన్లు గురువారం సంపూర్ణ ఆరోగ్యంతో అట్లాం టా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నెలలో డాక్టర్ కెంట్ బ్రాంట్లీ(33), నాన్సీ రైట్‌బోల్ (60) లైబీరియాలో ఎబోలా బారిన పడ్డారు. వెంటనే వీరిని చికిత్స కోసం ఎమోరి యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ పూర్తిగా కోలుకోవడంతో వీరి నుంచి ప్రజలకు హానీ లేదని నిర్ధారించుకున్న తర్వాత డిశ్చార్జి చేసినట్టు వైద్యులు వెల్లడించారు.