అమెరికాలో పైసా ఇవ్వరు | Maternity holidays in different countries | Sakshi
Sakshi News home page

అమెరికాలో పైసా ఇవ్వరు

Published Sat, Mar 11 2017 2:03 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

అమెరికాలో పైసా ఇవ్వరు

అమెరికాలో పైసా ఇవ్వరు

వివిధ దేశాల్లో ప్రసూతి సెలవుల తీరుతెన్నులు
మన దేశంలో ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచి 18 లక్షల మంది ఉద్యోగినులకు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కలిగించింది. బిడ్డల సంరక్షణకు తగినంత సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ప్రసూతి సెలవులు ఎన్ని వారాలు ఇస్తున్నారు? ఈ సమయంలో ఎంత శాతం వేతనం చెల్లిస్తారనే అంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యకర, ఆసక్తికర అంశాలున్నాయి.

ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకొనే అమెరికాలో ఈ సెలవులు మరీ దారుణం. అక్కడ 12 వారాలు సెలవు తీసుకోవచ్చుగాని జీతం అసలు రాదు. ఇలా వేతనం లేకుండా ప్రసూతి సెలవులిచ్చే దేశాలు ప్రపంచంలో మూడే ఉన్నాయి.. అవి, అమెరికా, లైబీరియా, పపువా న్యూగినియా. వేతనంతో కూడిన సెలవుల విషయంలో నార్వే తొలి స్థానంలో ఉండగా,  పనివేళల్లో వెసులుబాటు, సెలవులను తల్లిదండ్రులు పంచుకొనే సౌలభ్యం తదితరాల్లో స్వీడన్  అగ్రస్థానంలో ఉంది.

స్వీడన్ లో తల్లిదండ్రులిద్దరికీ కలిపి ఇచ్చే 480 రోజుల సెలవులను బిడ్డకు ఎనిమిదేళ్లు నిండేలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. పిల్లల సంరక్షణ కోసం పనిగంటలను 25 శాతం తగ్గించుకునే వెసులుబాటూ ఉంది. అయితే ఎన్ని గంటలు పనిచేశామో అంత కాలానికే వేతనం ఇస్తారు.

ఫ్రాన్స్ లో తల్లి అయిన ఉద్యోగిని ప్రసూతి సెలవుల అనంతరం రెండున్నరేళ్ల వేతనం లేని ఫ్యామిలీ సెలవు తీసుకోవచ్చు.

తండ్రికి కూడా పిల్లల పెంపకంలో భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో పురుషులు సెలవు తీసుకోవడాన్ని కొన్ని దేశాలు తప్పనిసరి చేశాయి.

దత్తత తీసుకున్న దంపతులకు, స్వలింగ దంపతులకు ఫ్రాన్స్ , యూకే, కెనడా, స్వీడన్ లు ప్రసూతి సెలవుల ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement