ఫిన్లాండ్, స్వీడన్‌లో రికార్డు స్థాయి చలి | Extreme cold leaves thousands without power in Nordic countries | Sakshi
Sakshi News home page

ఫిన్లాండ్, స్వీడన్‌లో రికార్డు స్థాయి చలి

Published Sat, Jan 6 2024 6:28 AM | Last Updated on Sat, Jan 6 2024 6:28 AM

Extreme cold leaves thousands without power in Nordic countries - Sakshi

స్టాక్‌హోమ్‌: నార్డిక్‌ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్‌లను చలి వణికిస్తోంది. 25 ఏళ్ల తర్వాత స్వీడన్, ఫిన్లాండ్‌ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఎముకలు కొరికే చలికి తోడు దట్టమైన మంచు కురుస్తుండటంతో మూడు దేశాల్లోనూ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

స్వీడన్‌లోని ఉత్తరప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1999 తర్వాత –43.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ తెలిపింది. 1951లో, తిరిగి 1999లోనూ –49 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తు చేసింది. పొరుగునే ఉన్న ఫిన్లాండ్‌లోని వైలివియెస్కాలో ఉష్ణోగ్రత మంగళవారం –37.8 డిగ్రీలుగా నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement