కేన్స్ ప్రారంభోత్సవంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో సందేశం
స్టాక్‌హోమ్: నాటో కూటమిలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను టర్కీ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. అవి కుర్దిష్ మిలిటెంట్లకు సాయం చేస్తున్నాయని ఆరోపించింది. టర్కీ అభ్యంతరాలు నాటో కూటమిలో కలకలం సృష్టిస్తున్నాయి. టర్కీ వ్యాఖ్యల్లో ఇటీవలి కాలంలో మార్పు వచ్చిందని ఫిన్లాండ్ ప్రధాని నినిస్టో అన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. నాటోలో చేరాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఫిన్లాండ్ పార్లమెంట్ మంగళవారం 188–8 ఓట్లతో మద్దతు పలికింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సభ్యత్వ దరఖాస్తులను బ్రస్సెల్స్‌లోని నాటో కేంద్ర కార్యాలయంలో అందించారు.
టర్కీ అభ్యంతరాల నేపథ్యంలో వీటి సభ్యత్వంపై నిర్ణయానికి సమయం పట్టవచ్చని అంచనా. టర్కీతో చర్చలకు బృందాన్ని పంపుతామన్న స్వీడన్ ప్రతిపాదనను కూడా ఎర్డోగన్ వ్యతిరేకించారు. టర్కీతో చర్చలకు ఎదురుచూస్తున్నామని, నాటో దేశాలతోనూ చర్చిస్తున్నామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా చెప్పారు. టర్కీ అభ్యంతరాలు అమెరికాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వాటి సంబంధాలు ఇటీవల బాగా క్షీణించాయి. రష్యా నుంచి టర్కీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను కొనడం అమెరికాకు నచ్చలేదు.
చర్చలే చర్చలు
నాటోలో చేరాలని నిర్ణయించిన స్వీడన్, ఫిన్లాండ్ ప్రధానులతో త్వరలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చర్చిస్తారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. వీటిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు టర్కీ విదేశాంగ మంత్రి కవుసోగ్లు అమెరికాకు పయనమ్యారు. ఈ రెండు దేశాలు ఏళ్లుగా తటస్థంగా ఉంటున్నాయి. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలుంటాయని వాటిని రష్యా పలుమార్లు హెచ్చరించింది. మంగళవారం ఇద్దరు ఫిన్లాండ్ దౌత్యాధికారులను రష్యా బహిష్కరించింది.
చదవండి: (ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు)
నార్డిక్ దేశాలు నాటోలో చేరడంపై టర్కీ అభ్యంతరాలు త్వరలో సమసిపోతాయని నాటో అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి చేరికను పలు యూరప్ దేశాలు స్వాగతించాయి. తమ దేశం కోరిన ఒక్క కుర్దిష్ నాయకుడిని కూడా నార్డిక్ తమకు దేశాలు అప్పగించలేదని టర్కీ ఆరోపించింది. నాటోలో కొత్తగా సభ్యత్వం పొందాలంటే ప్రస్తుతమున్న 30 సభ్యదేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాల్సిఉంది.
స్టీల్ ప్లాంట్ ఫైటర్ల తరలింపు
మారియుపోల్‌లో చిక్కుకున్న తమ సైనికులను రక్షించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. 264 మందిని తరలించామని తెలిపింది. మరోవైపు డోన్బాస్‌లో పలు నగరాలపై రష్యా బాంబింగ్ కొనసాగుతూనే ఉంది. సివియర్‌డొనెట్స్‌క్‌లో 10మంది మరణించారు. పశ్చిమాన లివివ్‌పైనా రష్యా దాడులు చేసింది. ఖార్కివ్‌లో మాత్రమే ఉక్రెయిన్ సేనలకు కొంత ఊరట లభించింది. నగరానికి సమీపంలోని రష్యా సరిహద్దు వద్దకు ఉక్రెయిన్ సేనలు చేరుకున్నాయి. ఇకపై డోన్బాస్ నగరాలపై రష్యా తీవ్రంగా విరుచుకుపడవచ్చని బ్రిటన్ ఇంగ్లండ్ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment