Maternity holidays
-
అమెరికాలో పైసా ఇవ్వరు
వివిధ దేశాల్లో ప్రసూతి సెలవుల తీరుతెన్నులు మన దేశంలో ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచి 18 లక్షల మంది ఉద్యోగినులకు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కలిగించింది. బిడ్డల సంరక్షణకు తగినంత సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ప్రసూతి సెలవులు ఎన్ని వారాలు ఇస్తున్నారు? ఈ సమయంలో ఎంత శాతం వేతనం చెల్లిస్తారనే అంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యకర, ఆసక్తికర అంశాలున్నాయి. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకొనే అమెరికాలో ఈ సెలవులు మరీ దారుణం. అక్కడ 12 వారాలు సెలవు తీసుకోవచ్చుగాని జీతం అసలు రాదు. ఇలా వేతనం లేకుండా ప్రసూతి సెలవులిచ్చే దేశాలు ప్రపంచంలో మూడే ఉన్నాయి.. అవి, అమెరికా, లైబీరియా, పపువా న్యూగినియా. వేతనంతో కూడిన సెలవుల విషయంలో నార్వే తొలి స్థానంలో ఉండగా, పనివేళల్లో వెసులుబాటు, సెలవులను తల్లిదండ్రులు పంచుకొనే సౌలభ్యం తదితరాల్లో స్వీడన్ అగ్రస్థానంలో ఉంది. ⇒ స్వీడన్ లో తల్లిదండ్రులిద్దరికీ కలిపి ఇచ్చే 480 రోజుల సెలవులను బిడ్డకు ఎనిమిదేళ్లు నిండేలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. పిల్లల సంరక్షణ కోసం పనిగంటలను 25 శాతం తగ్గించుకునే వెసులుబాటూ ఉంది. అయితే ఎన్ని గంటలు పనిచేశామో అంత కాలానికే వేతనం ఇస్తారు. ⇒ ఫ్రాన్స్ లో తల్లి అయిన ఉద్యోగిని ప్రసూతి సెలవుల అనంతరం రెండున్నరేళ్ల వేతనం లేని ఫ్యామిలీ సెలవు తీసుకోవచ్చు. ⇒ తండ్రికి కూడా పిల్లల పెంపకంలో భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో పురుషులు సెలవు తీసుకోవడాన్ని కొన్ని దేశాలు తప్పనిసరి చేశాయి. ⇒ దత్తత తీసుకున్న దంపతులకు, స్వలింగ దంపతులకు ఫ్రాన్స్ , యూకే, కెనడా, స్వీడన్ లు ప్రసూతి సెలవుల ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. -
ప్రసూతి సెలవులు 26 వారాలు
-
ప్రసూతి సెలవులు 26 వారాలు
కనీసం పది మంది పనిచేస్తున్న సంస్థల్లో అమలు ► అద్దె గర్భం, దత్తత ద్వారా తల్లులయ్యే మహిళలకు 12 వారాలు ► ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు–2016కు పార్లమెంట్ ఆమోదం న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల చెల్లింపు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. దీంతో సుమారు 18 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది. కనీసం 10 మంది పనిచేస్తున్న సంస్థల్లో ఈ కొత్త చట్టాన్ని అమలుచేయాల్సి ఉంటుంది. అయితే 26 వారాల ప్రసూతి సెలవులను ఒక మహిళకు తొలి రెండు కాన్పులకే పరిమితం చేశారు. మూడో కాన్పుకు 12 వారాలే ఇస్తారు. ఇది వరకే రాజ్యసభ ఆమోదించిన ప్రసూతి ప్రయోజనాల బిల్లు(సవరణ) – 2016ను లోక్‌సభలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఒకరోజు తరువాత ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం చారిత్రకమని, మహిళలకు ఇది తాను వినయపూర్వకంగా ఇస్తున్న కానుక అని ఆయన పేర్కొన్నారు. బిల్లులో చేసిన సవరణలు ప్రగతిశీలమైనవని, మహిళల కుటుంబం–పని మధ్య సమతూకం తెస్తాయని అభిప్రాయపడ్డారు. దీంతో మరింత మంది మహిళలు సంఘటిత రంగ మానవ వనరుల్లో భాగమవుతారని తెలిపారు. అలాగే అసంఘటిత రంగ మహిళా కార్మికుల కోసం కేంద్రం ఇప్పటికే పలు సంక్షేమ చర్యలు చేపట్టిందని సభకు వెల్లడించారు. ఈ బిల్లుపై 4 గంటల పాటు జరిగిన చర్చలో ... తండ్రులకు కూడా ప్రయోజనాలు కల్పించాలని కొందరు సభ్యులు డిమాండ్ చేశారు. ప్రసూతి సెలవుల పరంగా కెనడా (50 వారాలు), నార్వే (44 వారాలు)తరువాత భారత్ (26 వారాలు) మూడో స్థానంలో నిలవనుంది. బిల్లులో పొందుపరిచిన ఇతర అంశాలు.. ♦ చట్ట ప్రకారం మూడు నెలల కన్నా తక్కువ వయసున్న చిన్నారిని దత్తత తీసుకునే, అద్దె గర్భం ద్వారా తల్లయ్యే మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవులు ఇస్తారు. ♦ కనీసం 50 మంది పనిచేస్తున్న సంస్థలు నిర్ధారిత దూరంలో పిల్లల సంరక్షణ కేంద్రాన్ని (క్రెచ్) ఏర్పాటుచేయాలి. తల్లి రోజులో 4 సార్లు అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలి. ♦ వీలైతే ఉద్యోగిని ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతించాలి. సెలవులు ముగిశాక ఉద్యోగిని, యాజమాన్యం పరస్పర ఆమోదంతో ఇలా ఎంత కాలమైనా పనిచేయడానికి అవకాశమివ్వాలి. ♦ ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌లు)లో పనిచేస్తున్న మహిళలకూ ఈ ప్రయోజనాలన్నింటినీ కల్పించాలి. పనిచేసే చోట లింగ సమానత్వం తీసుకురావడానికి ఉన్న అవకాశాన్ని ప్రసూతి సెలవుల బిల్లు వృథా చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. తండ్రులకు కూడా ప్రయోజనాలు కల్పించకపోవడాన్ని తప్పుపట్టింది. -
‘సెర్ప్’ ఉద్యోగినులకూ 6 నెలల ప్రసూతి సెలవులు!
మరణించిన ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చు రూ.20 వేలకు పెంపు పాలక మండలికి ప్రతిపాదించనున్న ఉద్యోగ సంఘాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లోని కాంట్రాక్ట్ ఉద్యోగినులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 6 నెలల పాటు ప్రసూతి సెలవులు లభించనున్నాయి. ఉద్యోగ సంఘాల ప్రతిపాదన మేరకు ఉన్నతాధికారులు ఇందుకు సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతమున్న 120 రోజుల ప్రసూతి సెలవును 180 రోజులకు పెంచే విషయమై పాలకమండలి తుది నిర్ణయం తీసుకో వాల్సి ఉంది. ఈ నెల 23న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరగనున్న పాలక మండలి సమావేశం ప్రధాన ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచారు. మరణించిన ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చు నిమిత్తం ఇప్పటివరకు ఇస్తున్న రూ.10 వేలను రూ.20 వేలకు పెంచాలనే ప్రతిపా దననూ పాలకమండలి ముందు కు తీసుకు రావాలని సెర్ప్ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నా యి. సెర్ప్ ఉద్యోగుల సమస్యల ను త్వరలోనే పరిష్కరిస్తానని ఇటీవల మంత్రి జూపల్లి హామీ ఇచ్చినందున తమ ప్రతిపాద నలకు ఆమోదం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు సెర్ప్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 4,224 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 29 శాతం మహిళలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఉద్యోగుల సమస్యలతో పాటు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, అభయ హస్తం, పల్లె ప్రగతి పథకాల అమలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి.