మన్రోవియా: లైబీరియాలోని టయోటాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 83 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
టయోటాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్‌ను పట్టుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటల్లో చిక్కుకుని 40 మంది మృతి చెందారు. 83 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటానికి గల కారణాలు స్పష్టంగా తెలియదు.
ఈ ప్రమాదంపై లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విషాదం చిత్రాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని ఆయన కార్యాలయం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే
Comments
Please login to add a commentAdd a comment