
బాగ్దాద్‌లో బాంబు పేలుళ్లు.. 70మంది దుర్మరణం
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రెండు బాంబు పేలుళ్ల ఘటనలో మృతిచెందినవారి సంఖ్య సోమవారానికి 70 కి చేరగా, 100 మంది వరకు గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. బాగ్దాద్‌లోని షిటే జిల్లా రెదీ మార్కెట్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ మార్కెట్.. రెండు బాంబు పేలుళ్ల ఘటనతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే.
మార్కెట్‌లో ముందుగా పేలుడు జరిగిందని, కొద్దిసేపటికి అదే మార్కెట్లో ఓ ఆత్మాహుతి బాంబర్ పేల్చేసుకోవడంతో మార్కెట్ భీతావహంగా మారిందని పోలీసులు చెప్పారు. బాగ్దాద్‌కు దక్షిణంగా ఉన్న మహమౌదియా పట్టణంలో జరిగిన మరో బాంబుపేలుడు ఘటనలో ముగ్గురు చనిపోయారు.