ఇరాక్‌లో పేలుళ్లు..13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పోలీస్ చెక్ పాయింట్ సమీపంలో మానవ బాంబుతో ముష్కరుడు దాడి చేశాడు. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారని ఇరాక్ పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. బుధవారం రాత్రి పోలీస్ చెక్ పాయింట్ సమీపంలో మానవ బాంబర్ ట్యాంకర్‌తో దూసుకొచ్చి పేల్చుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు దాటికి 15 వాహనాలు దగ్దమయ్యాయి.