
ఇరాక్‌లో పేలుళ్లు.. 59 మంది మృతి
ఆదివారం నిర్వహించే బహిరంగ మార్కెట్‌లో రెండు బాంబు పేలుళ్లతో ఇరాక్‌లోని షిటే జిల్లా రెదీ మార్కెట్ దద్దరిల్లింది. ఈ ఉగ్రదాడిలో 59 మంది పౌరులు మృతిచెందగా, 62 మంది గాయపడ్డారు.
బాగ్దాద్: ఆదివారం నిర్వహించే బహిరంగ మార్కెట్‌లో రెండు బాంబు పేలుళ్లతో ఇరాక్‌లోని షిటే జిల్లా రెదీ మార్కెట్ దద్దరిల్లింది. ఈ ఉగ్రదాడిలో 59 మంది పౌరులు మృతిచెందగా, 62 మంది గాయపడ్డారు. మార్కెట్‌లో ముందుగా పేలుడు జరిగిందని, కొద్దిసేపటికి అదే మార్కెట్లో ఓ ఆత్మాహుతి బాంబర్ పేల్చేసుకోవడంతో మార్కెట్ భీతావహంగా మారిందని పోలీసులు చెప్పారు. బాగ్దాద్‌కు దక్షిణంగా ఉన్న మహమౌదియా పట్టణంలో జరిగిన మరో బాంబుపేలుడు ఘటనలో ముగ్గురు చనిపోయారు. డోరా పట్టణంలో జరిగిన మరో పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందారు.