ఇరాన్‌లో జంట పేలుళ్లు.. వందకుపైగా మృతులు! | Twin Blasts Near Grave Of Late Iran General Qasem Soleimani | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో జంట పేలుళ్ల కలకలం.. వందకుపైగా మృతులు!

Published Wed, Jan 3 2024 7:42 PM | Last Updated on Wed, Jan 3 2024 8:46 PM

Twin Blasts Near Grave Of Late Iran General Qasem Soleimani - Sakshi

2020లో అమెరికా జరిపిన వైమానికి దాడిలో ఖాసీం సులేమానీ మరణించగా.. 

టెహ్రాన్‌: ఇరాన్‌లో బుధవారం జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో వంద మందికిపైగా మృతి చెందగా.. 170 మంది తీవ్రంగా గాయడినట్లు ఇరాన్‌ స్థానిక మీడియా వెల్లడించింది. దివంగత ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ సమాధి సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్‌ ఫోర్స్‌కు ఖాసీం సులేమానీ నేతృత్వం వహించేవాడు.

2020లో అమెరికా జరిపిన వైమానికి దాడిలో ఖాసీం సులేమానీ మరణించారు. బుధవారం ఖాసీం సులేమానీ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న సమయంలో నిమిషాల వ్యవధిలో వరసగా పేలుళ్లు జరిగాయి.

ఖాసీం సులేమానీ జయంతి రోజే సమాధి వద్ద ఈ పేలుళ్లు జరగటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని కెర్మాన్ ప్రావిన్స్ చెందిన అధికారులు తెలిపారు. మరోవైప మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

చదవండి: అమెరికాపై ఇజ్రాయెల్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement