దీపావళి సమీపిస్తోంది. ఈ పండుగ ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఆదమరిస్తో అంత విషాదాన్ని నింపేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్‌పే' బాణసంచా సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు ఉపశమనం కల్పించడానికి ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ తీసుకువచ్చింది.
ఫోన్‌పే పరిచయం చేసిన ఈ కొత్త ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ కేవలం తొమ్మిది రూపాయలకే అందుబాటులో ఉంది. దీని ద్వారా 10 రోజుల పాటు రూ. 25,000 వరకు కవరేజి లభిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు.. బాధితులు ఆసుపత్రిలో చేరడం లేదా మరణం సంభవిస్తే దానికయ్యే ఖర్చుల నుంచి ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఈ బీమా ఉపయోగపడుతుంది.
ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ కవరేజ్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బీమా కోసం ఫోన్‌పే యాప్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం వినియోగదారుకు మాత్రమే కాకుండా.. జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులకు కవరేజి లభిస్తుంది.
ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'
ఫైర్‌క్రాకర్ బీమా కోసం ఎలా అప్లై చేయాలంటే
➤ఫోన్‌పే యాప్‌లోని బీమా విభాగాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత, అక్కడే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ కనిపిస్తుంది.
➤ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంచుకున్న తరువాత ప్లాన్ వివరాలు చూడవచ్చు. ఇక్కడే బీమా మొత్తం రూ. 25000, ప్రీమియం రూ. 9 ఉండటం చూడవచ్చు.
➤కింద కనిపించే కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తరువాత పాలసీ పీరియడ్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఉన్నట్లు కనిపిస్తుంది. దాని కిందనే పాలసీదారు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. అన్నీ పూర్తయిన తరువాత తొమ్మిది రూపాయలు చెల్లించాలి. ఇలా సులభంగా ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment