ఫ్లాప్ షో
నంద్యాల : నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ మంగళవారం ప్రారంభించిన సైకిల్ ర్యాలీ తొలి రోజే ఫ్లాప్ షోగా ముగిసింది. పట్టణంలోని పద్మావతినగర్‌లో ర్యాలీని ఆర్‌ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. రైతునగర్, కానాల ప్రాంతాల్లో 10 కి.మీ మేర ర్యాలీ సాగింది. పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా జారుకున్నారు. చివరి దశకు చేరే సరికి కనీసం 50 మంది కూడా మిగల్లేదు.