గత ఐదు రోజులుగా శాసనసభా జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత అన్నారు.
హైదరాబాద్: గత ఐదు రోజులుగా శాసనసభా జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత అన్నారు. శాసనసభలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ... ప్రజా సమస్యలు చర్చించకుండా ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
ఓటుకు కోట్లు కేసులో తమ పార్టీ అధినేత చంద్రబాబుకు ఇరికించారని ఆరోపించారు. అవినీతి అంతానికి కంకణం కట్టుకున్న చంద్రబాబుపై ఆరోపణలు చేయడం తగదన్నారు. అవినీతిని కూకటివేళ్లతో పెకలించి వేయగల