
'రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతా'
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రులంటే గౌరవం లేదని ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు.
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రులంటే గౌరవం లేదని ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. మంత్రులను ఆమె వేలేత్తి దూషించారని ఆరోపించారు. శాసనసభలో ఆమె వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందన్నారు. రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివాదస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో సభలో మంత్రి మాట్లాడారు.
సభలో రోజా ప్రవర్తనను మహిళా సభ్యులెవరూ సమర్థించరని, ఒకవేళ ఎవరైనా సమర్థిస్తే తాను రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతానని ఆవేశంగా అన్నారు. రోజాను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. నటిగా రోజాను తాను అభిమానిస్తానని చెప్పారు.