వైఎస్‌ఆర్‌సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ అంశంపై రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నట్టు తెలిసింది.
హైదరాబాద్: వైఎస్‌ఆర్‌సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ అంశంపై రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నట్టు తెలిసింది. ఆదివారం ఏపీ అసెంబ్లీకి ప్రివిలేజ్ కమిటీ నివేదిక అందినట్టు తెలుస్తోంది. అయితే ఏపీ అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాలనంతరం ప్రివిలేజ్‌కమిటీ నివేదికను చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు సమర్పించనున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజాపై అందిన ఫిర్యాదుపై ఆ కమిటీ నిర్ణయాన్ని తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, హైకోర్టు స్టే ఉత్తర్వులపైనా కూడా అదే రోజు ఏపీ అసెంబ్లీ చర్చించనున్నట్టు సమాచారం.