Gollapalli surya Rao
-
ఏపీకి ఒక్క రూపాయి ఉపయోగం లేదు బాబు, లోకేష్‌పై గొల్లపల్లి ఫైర్..
-
టీడీపీకి మాజీ మంత్రి గుడ్‌బై
-
టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
-
‘బాబు అవమానిస్తే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు’
గుంటూరు, సాక్షి: తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీని వీడిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సూర్యారావు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అయితే.. టీడీపీలో నిబద్ధతతో పని చేసిన తనని మెడబట్టుకుని గెంటేశారని మీడియా ముందు సూర్యారావు వాపోయారు. ‘‘నిబద్ధతతో పని చేసిన నన్ను టీడీపీ దారుణంగా అవమానించింది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఉంటే ఉండు.. పోతే పో అన్నట్లు చూశారు. అధికారం కోసం చంద్రబాబు మౌన మునిగా మారారు. లోకేష్ దుర్మార్గపు రీతిలో ఆ పార్టీని నడిపిస్తున్నాడు. సూర్యారావుకు వైఎస్సార్సీపీ కండువా కప్పుతున్న సీఎం జగన్ ఆ బాధలో ఉన్న నన్ను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు నన్ను మెడపట్టుకుని బయటకు గెంటారు. జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ కోసం శాయశక్తుల పని చేస్తా.. ’’అని సూర్యారావు చెప్పారు. మాజీ మంత్రి సూర్యారావుతో పాటు పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్.. ఎంపీ మిథున్‌రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం మీడియాతో గొల్లపల్లి అంతకు ముందు.. చంద్రబాబుకు రాజీనామాతో పాటు ఓ బహిరంగ లేఖ రాశారాయన. పొత్తులో భాగంగా.. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు రాజీనామాకు కారణంగా వెల్లడించారు గొల్లపల్లి. ఆ వెంటనే సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన ఆయన్ని ఎంపీలు మిథున్‌రెడ్డి, కేశినేని నానిలు వెంటపెట్టుకుని సీఎం జగన్ చెంతకు తీసుకెళ్లారు. గొల్లపల్లి 2004లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైఎస్ కేబినెట్లో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో రాజోలు నుంచి గెలిచారు. అయితే 2019లో రాపాక వరప్రసాద్ చేతిలో ఓడారు. -
AP:టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి గుడ్ బై
సాక్షి,తూర్పుగోదావరి: టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనమా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని లేఖలో గొల్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో సీటు ఇవ్వకుండా అవమానించారని తెలిపారు. ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన కలత చెందారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు టీడీపీ కేటాయించింది. దీంతో ఇక టికెట్ రాదని గొల్లపల్లి పార్టీని వీడినట్లు తెలుస్తోంది. కాగా, భవిష్యత్ కార్యాచరణపై ఆయన త్వరలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. గొల్లపల్లి త్వరలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. టీడీపీ జనసేన మధ్య తారాస్థాయికి సీటు హీట్ -
బాబుకు బిగ్ షాక్ టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై !
-
జనసేనతో పొత్తు ఉంటే.. మాజీ మంత్రికి నో ఛాన్స్
సాక్షి, అమలాపురం: ‘అట్టడుగు నుంచి సమాచారం తెప్పించుకుంటాను. మూడు నాలుగు సర్వేలు చేయిస్తాను. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ఐవీఆర్ఎస్ సర్వే చేయించి, డేటా విశ్లేషణ చేయడం ద్వారా పార్టీ ఇన్చార్జిలను, అభ్యర్థులను నిర్ణయిస్తాను’ ఇది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాట. కానీ ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. అభ్యర్థులను నిర్ణయించడం అటుంచి కనీసం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలను సైతం ధైర్యంగా నియమించే స్థితిలో టీడీపీ అధినేత లేరు. ఆయన నాన్చుడు ధోరణి పార్టీ పుట్టి ముంచుతోందని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు బుధవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. తొలి రోజు మండపేట, గురువారం కొత్తపేట, శుక్రవారం అమలాపురంలో రచ్చబండ, రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఆవిర్భావం నుంచీ పలు ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సొంతం చేసుకున్న జిల్లాలో టీడీపీ ఎదురీతకు సంస్థాగత లోపాలు, ప్రజా విశ్వాసం కోల్పోవడం ప్రధాన కారణం కాగా.. పార్టీ అధినేత నాన్చుడు ధోరణి కూడా దీనికి తోడవుతోందని తమ్ముళ్లు అంటున్నారు. అన్నిచోట్లా సమస్యలే.. ► ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో కూడా జిల్లాలోని ఇంచుమించు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులు, ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నాయి. రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాలకై తే దిశానిర్దేశం చేసే నాయకులే లేరు. జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు కొత్తపేటలో కూడా నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గ ఇన్చార్జిల తలలపై పొత్తుల కత్తులు వేలాడుతున్నాయి. ► గత ఎన్నికల తరువాత నుంచి పి.గన్నవరం నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. ప్రస్తుతం టూమెన్ కమిటీ పేరుతో అమలాపురం పార్లమెంటరీ ఇన్చార్జి గంటి హరీష్ మాధుర్, జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి నేలపూడి స్టాలిన్‌బాబు పోటీ చేశారు. ఎన్నికలు పూర్తి కాగానే ఆయన పార్టీని వీడారు. తరువాత ఇన్చార్జి కోసం పలువురు పేర్లు తెర మీదకు వచ్చినా చెప్పుకునే స్థాయి నాయకులు లేరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హరీష్‌కు అప్పగించారు. రాజకీయ అనుభవం లేకపోవడం.. అటు పార్లమెంటరీ నియోజకవర్గానికి, ఇటు అసెంబ్లీ నియోజకవర్గానికి తిరగాల్సి రావడంతో హరీష్ సైతం సమర్థంగా పని చేయడం లేదు. నామన చురుకుగా ఉండడం లేదు. నియోజకవర్గ ఇన్చార్జి నియామకాన్ని చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా గాలికి వదిలేయడం క్యాడర్‌ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. ► మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పరిస్థితి మరీ దారుణం. పార్టీ రాజోలు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నా వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఇక్కడి నుంచి టిక్కెట్ దక్కుతుందనే భరోసా లేదు. జనసేనతో పొత్తు ఉంటే రాజోలును ఆ పార్టీకి కేటాయిస్తారని, గొల్లపల్లికి పి.గన్నవరంలో అవకాశం కల్పిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు పి.గన్నవరం ఊసు కూడా లేదు. ఆయన నాయకత్వంపై పార్టీ అధిష్టానానికి నమ్మకం లేదని చెబుతున్నారు. 2014లో సైతం ఆయనకు టీడీపీ అన్యాయమే చేసింది. ఆ ఎన్నికలకు ఏడాది కన్నా ముందే గొల్లపల్లిని అమలాపురం ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి మొండిచేయి చూపించారు. ► ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు)దీ ఇదే పరిస్థితి. పార్టీ టిక్కెట్‌కు మరొకరితో పోటీ లేకున్నా జనసేనతో పొత్తు రూపంలో ఆయనపై కూడా కత్తి వేలాడుతోంది. ► అమలాపురంలో పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న పరమట శ్యామ్ మధ్య విభేదాలు రోడ్డున పడుతున్నాయి. శ్యామ్ వెనుక ఇదే నియోజకవర్గానికి చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వర్గీయులు మద్దతుగా నిలుస్తున్నారు. వీరిద్దరిలో అభ్యర్థి ఎవరనే సందిగ్ధత పార్టీ క్యాడర్లో నెలకొని ఉంది. దీనికి తెర దించాల్సిన చంద్రబాబు ఇద్దరినీ పని చేయండని ప్రోత్సహిస్తున్నారు. ► రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆ పార్టీని వీడిన తర్వాత స్థానికంగా నాయకత్వం లేకుండా పోయింది. శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని ఇన్చార్జిగా నియమించినా ఆయన ఆ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ కూడా పార్టీని నడిపించేందుకు సరైన నాయకుడు లేకుండా పోయాడు. ► కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు టిక్కెట్ పరంగా పోటీ లేకున్నా ఇదే నియోజకవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యంతో ఆధిపత్య పోరు నడుస్తోంది. ► జిల్లాలో టీడీపీ గెలిచిన ఏకై క నియోజకవర్గం మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇటు ఇంట, అటు బయట విమర్శల పాలవుతున్నారు. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా ఉండటంతో సహజంగానే క్యాడర్‌తో పాటు నియోజకవర్గంలోని పలువురిలో అసంతృప్తి నెలకొంది. ఇటీవల సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారంటే వేగుళ్ల మీద సొంత వారిలో ఎంత అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. -
పండుల వర్సెస్ గొల్లపల్లి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అంటేనే రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు రంకెలు వేస్తున్నారు. ఎంపీ పేరు ఎత్తితే చాలు ఎమ్మెల్యే చిర్రెత్తిపోతున్నారు. నియోజకవర్గంలో తనదే పైచేయి అని, తన మాటే వేదవాక్కని, ఇందులో ఎవరి పెత్తనం కుదరదు అన్నట్టుగా గొల్లపల్లి వ్యవహరిస్తున్నారు. ఎంపీని వెనకేసుకొస్తున్న వారిని ఆమడదూరంలో పెడుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఒకరు. ఎంపీ రవీంద్రబాబు, రాపాక వరప్రసాద్‌లు ఒకే తాను ముక్కగా భావిస్తూ ఎమ్మెల్యే గొల్లపల్లి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముందు ఎంపీ ప్రస్తావన తేడానికి టీడీపీ శ్రేణులు హడలిపోతున్నాయి. ఇక్కడ కొనసాగుతున్న ఆధిపత్య పోరులో ‘ముందుకెళితే నుయ్యి ... వెనక్కి వెళితే గొయ్యి’ అన్న చందంగా తెలుగు తమ్ముళ్లు నలిగిపోతున్నారు. తొలి నుంచీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పోరు గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కోసం గొల్లపల్లి సూర్యారావు యత్నించారన్న వాదనలున్నాయి. అయితే వేర్వేరుగా లాబీయింగ్ ద్వారా పండుల రవీంద్రబాబుకు టిక్కెట్ దక్కింది. దీంతో గొల్లపల్లి తట్టుకోలేక ఎంపీకి వ్యతిరేకంగా పావులు కదపడం మొదలు పెట్టారని సమాచారం. 2014 ఎన్నికల ఖర్చు కూడా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలకు దారితీసిందనే వాదనలున్నాయి. ఎన్నికల ఖర్చు విషయంలో ఎంపీ పండుల రవీంద్ర బాబు రాజోలు నియోజక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు వర్గీయుల వాదన. రాజోలు నియోజక వర్గంలో ఎన్నికల ఖర్చుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. మిగిలిన నియోజక వర్గాలకు మాత్రం ఆయన దండిగా నిధులు పంపారని, రాజోలులో గొల్లపల్లిని ఓడించడం కోసమే పండుల అలా చేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇదే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడాకి కారణమని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తనను దూరంగా పెట్టినప్పుడు తానెందుకు వెనక్కి తగ్గాలని ఎంపీ కూడా నియోజక వర్గం ఎప్పుడువచ్చినా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లరు. తన అనుయాయుల ఇళ్లకు వెళ్లి వెనుతిరగడం...ఇలా నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. ఆరోపణల దాడి... మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు, ప్రస్తుతం ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుల మధ్య కాంట్రాక్టుల విషయంలో కూడా విభేదాలు తలెత్తాయి. ఇరిగేషన్, రోడ్డు పనులను తన ఆనుయాయులకు కట్టబెట్టి ఎమ్మెల్యే గొల్లపల్లి లబ్ధిపొందుతున్నారని రాపాక వర్గీయులు ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. బినామీల పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, డబ్బులిస్తేనే పని చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. మామిడికుదురు మండలం ఆదూరులో సొంతంగా పెట్టుకున్న కళాశాలకు కాంట్రాక్టర్లు, లబ్ధిపొందిన వారిని ఉపయోగించుకుంటున్నారని గొల్లపల్లిపై పరోక్ష ఆరోపణలకు దిగారు. ఆ కళాశాలకు అవసరమైన ఇసుకను అడ్డంగా తరలించేశారని ఆరోపిస్తూ అప్పట్లో రాపాక వరప్రసాదరావు ఆ కళాశాలకు వెళ్లి పరిశీలించి హడావుడి చేశారు. తన కళాశాలకు వచ్చి హల్చల్ చేయడమేంటని గొల్లపల్లిలో మరింత ద్వేషం పెరిగింది. ఇక, గొల్లపల్లి వర్గం కూడా రాపాకపై కౌంటర్ ఆరోపణలకు దిగింది. చింతలమోరిలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు వరప్రసాదరావు అండగా నిలిచారని ప్రత్యారోపణలకు దిగారు. తనకు శత్రువుగా తయారైన ఎంపీని కూడా గొల్లపల్లి వర్గం వదల్లేదు. కోటిపల్లి– నర్సాపూర్ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పులో చేతులు మారాయని పరోక్ష ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సన్మానంపైనా గ్రూపు రాజకీయాలు. కోటిపల్లి– నర్సాపూర్ రైల్వే లైన్‌కు పండుల కృషి చేశారని రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మానం చేస్తున్నట్టు కరపత్రాలు ముద్రించారు. దీన్ని టీడీపీలో ఉన్న గొల్లపల్లి వర్గం వ్యతిరేకించింది. ఎస్సీ సంక్షేమ సంఘానికి సంబంధం లేదని తమకు అనుకూల నాయకుల చేత ప్రెస్మీట్లు పెట్టి హడావుడి చేయించారు. అయినప్పటికీ రాపాక వర్గం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్టుగానే ఎంపీ రవీంద్రబాబును పిలిచి ఘనంగా సన్మానించారు. ఇది గొల్లపల్లిని మరింత రెచ్చగొట్టినట్టు చేసింది. ప్రతీకారేచ్ఛ రాజకీయాలకు మరింత ఊపు ఇచ్చినట్టు అయ్యింది. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే, మధ్యలో రాపాక వరప్రసాదరావు రాజకీయాలతో రాజోలు టీడీపీ హాట్ హాట్‌గా ఉంది. ఎంపీ చెంత చేరిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులందర్నీ ఎంపీ ఆదరిస్తున్నారు. తొలుత రాపాక పండుల రవీంద్ర చెంత చేరారు. రాపాకను వెంట వేసుకుని తిరుగుతుండడంతో గొల్లపల్లిలో ఆవేదన అధికమైంది. గత ఎన్నికల్లో టిక్కెట్‌కు పోటీపడ్డ బత్తుల రాము వర్గీయులను తొలుత ఎమ్మెల్యే దూరంగా పెట్టారు. తనకు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారన్న అనుమానంతో కక్ష పెట్టుకున్నారు. దీంతో ఆయన తప్పని పరిస్థితుల్లో ఎంపీ గూటికి చేరారు. ఇక, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ముదునూరి చినబాబు (జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు)తో కూడా ఎమ్మెల్యేకు వైరం వచ్చింది.ఆయన కూడా ఎంపీ పక్కన చేరారు. ఇలా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు, రాపాక ఒక గ్రూపుగా ఏర్పడి రాజకీయాలు చేస్తున్నారు. దీంతో గొల్లపల్లిలో మరింత ద్వేషం పెరిగింది. ఎంపీని ఎవరు కలిస్తే వారిని వ్యతిరేకులుగా చూడటం మొదలు పెట్టారు. వారిని బహిరంగంగా తిట్టడం ప్రారంభించారు. అంతేకాకుండా ఎంపీ గ్రాంటుతో పనులు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న గ్రామ నాయకులతో తీర్మానాలు ఇవ్వకుండా, అధికారుల సహకారం లేకుండా ఎంపీకి అడ్డు తగులుతూ వస్తున్నారు. గొల్లపల్లికి కొరకరాని కొయ్యగా రాపాక ఎంపీతో విభేదాలు ఇలా ఉంటే...స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో కూడా ఎమ్మెల్యే గొల్లపల్లికి తీవ్ర విభేదాలున్నాయి. ఎన్నికల్లో గెలిచాక రాపాకను ఎమ్మెల్యే దూరం పెట్టడం మొదలు పెట్టారు. రాపాక నిలదొక్కుకుంటే భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చనే భయంతో గొల్లపల్లి వ్యూహాత్మకంగా రాజకీయాలకు తెరదీశారు. దీన్ని గమనించిన రాపాక కూడా తనదైన శైలి రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికల్లో వాడుకుని వదిలేశారన్న అక్కసుతో గొల్లపల్లికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇదే అదనుగా చూసుకుని ఎంపీ రవీంద్రబాబుతో కలిసి ప్రయాణం సాగించారు. ఇది గొల్లపల్లిని మరింత రెచ్చగొట్టేలా చేసింది. ఎంపీ, రాపాక లక్ష్యంగా ప్రతీకార రాజకీయాలను ఎమ్మెల్యే గొల్లపల్లి మొదలు పెట్టారు. గొల్లపల్లి, రాపాక మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడానికి మరో కారణం కూడా ఉంది. రాపాక ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో చింతలమోరి గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరైంది. అయితే, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన గొల్లపల్లి సూర్యారావు ప్రతీకార రాజకీయాలకు శ్రీకారం చుట్టి రాపాక సొంతూరైన చింతలమోరిలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం ఇష్టం లేక శంకరగుప్తానికి మార్చారు. తన గ్రామానికి మంజూరైన లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను వేరే గ్రామానికి మార్చుతారా? అని రాపాకలో కసి పెంచింది. ఇంకేముంది గొల్లపల్లి లక్ష్యంగా అడుగులు వేయడం ప్రారంభించారు. -
రోజా సస్పెన్షన్ అంశంపై రేపు అసెంబ్లీలో చర్చ
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ అంశంపై రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నట్టు తెలిసింది. ఆదివారం ఏపీ అసెంబ్లీకి ప్రివిలేజ్ కమిటీ నివేదిక అందినట్టు తెలుస్తోంది. అయితే ఏపీ అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాలనంతరం ప్రివిలేజ్‌కమిటీ నివేదికను చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజాపై అందిన ఫిర్యాదుపై ఆ కమిటీ నిర్ణయాన్ని తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, హైకోర్టు స్టే ఉత్తర్వులపైనా కూడా అదే రోజు ఏపీ అసెంబ్లీ చర్చించనున్నట్టు సమాచారం. -
వైఎస్సే లక్ష్యంగా గొల్లపల్లి ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు మెప్పుకోసం ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నానా తంటాలు పడ్డారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ పేరిట ఆయన గం టకు పైగా తన వాచాలత్వాన్ని ప్రదర్శించారు. ప్రజా సమస్యలకు వేదిక కావాల్సిన అసెంబ్లీ ఆత్మస్థుతికి పరనిందకు వేదికగా సాగింది. ఇంతజరుగుతున్నా సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ కాగిత వెంకట్రావ్ ఎక్కడా వారించకపోగా ఎస్సీ సభ్యుడు మాట్లాడుతుంటే గొడవ చేస్తారా? అంటూ విపక్షాన్నే మందలించడం గమనార్హం. తనకిచ్చిన సమయం కన్నా అరగంట ఎక్కువగా మాట్లాడినా, సభలో వాడకూడని భాషను ఉపయోగిస్తున్నా ప్యానెల్ స్పీకర్ అభ్యంతరం చెప్పలేదు. తన 65 నిమిషాల ప్రసంగంలో గొల్లపల్లి సూర్యారావు దివంగత సీఎం వైఎస్ఆర్, జగన్ లక్ష్యంగా తన అక్కసు వెళ్లగక్కారు. -
విభజనలో సమన్యాయం జరగలేదు:గొల్లపల్లి
-
గొల్లపల్లికి మళ్లీ జెల్ల
- ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు - బుద్ధప్రసాద్ పరమైన ఉప సభాపతి పదవి సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు చంద్రబాబు మరోసారి జెల్లకొట్టారు. మొన్నటి ఎన్నికల్లో గొల్లపల్లికే ఖాయమనుకున్న అమలాపురం ఎంపీ సీటు చివరి నిమిషంలో పండుల రవీంద్రబాబుకు కట్టబెట్టారు. కనీసం అమలాపురం అసెంబ్లీ సీటైనా వస్తుందనుకుంటే అదీ కాదని రాజోలు నుంచి పోటీ చేయించారు. అక్కడ విజయం సాధించిన గొల్లపల్లి మంత్రి పదవి ఖాయమని గంపెడాశలు పెట్టుకోగా.. చంద్రబాబు కొలువులో చోటు దక్కలేదు. చివరకశాసనసభాపతి లేదా ఉప సభాపతి పదవి అయినా దక్కకపోదన్న ఆయన ఆశ.. సభాపతిగా కోడెల శివప్రసాద్, ఉపసభాపతిగా మండలి బుద్ధప్రసాద్ల నియామకంతో అడియాసే అయింది. దీన్ని జీర్ణించుకోలేని గొల్లపల్లి వర్గం.. చంద్రబాబు కొలువులో ఎస్సీలకు ఇచ్చే ప్రాతినిధ్యం ఇదేనా అని ప్రశ్నిస్తోంది. ఉపసభాపతికి తన పేరు ఖాయమైందనుకున్న గొల్లపల్లి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లే వరకూ అదే నమ్మకంతో ఉన్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. మోకాలడ్డిన నేతలు.. చంద్రబాబు కోనసీమకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రి హోదాను, హోంశాఖను కట్టబెట్టారు. మెట్ట ప్రాంతం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడికి ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖలు ఇచ్చారు. ప్రజాబలం లేక ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై, చివరికి తునిలో తన సోదరుడినీ గెలిపించుకోలేని యనమలకు కీలక పదవి నిచ్చి, ఎస్సీల్లో బలమైన తమ సామాజికవర్గం నుంచి గొల్లపల్లిని విస్మరించడాన్ని మాలలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇద్దరు కాపు ఎమ్మెల్యేల్లో రాజప్పకు ఉపముఖ్యమంత్రి హోదా, హోం మంత్రి పదవుల్నీ, అదే వర్గానికి చెందిన ఎంపీ తోట నరసింహానికి లోక్‌సభలో పార్టీనే త హోదాను కట్టబెట్టారని, ఒక ఎంపీ, ముగు్గరు ఎమ్మెల్యేలున్న తమకు మాత్రం మొండిచేయి చూపించారని కన్నెర్ర చేస్తున్నారు. రెండు సార్లు మంత్రి చేసి, మూడోసారి ఎమ్మెల్యే అ యిన గొల్లపల్లికి ద క్కుతుందనుకున్న ఉపసభాపతి పదవికి కాపు సామాజికవర్గం నుంచే బుద్ధప్రసాద్ రూపంలో అడ్డుపడడాన్ని జీర్ణిం చుకోలేకపోతున్నారు. పార్టీలో ఒక బలమైన సామాజికవర్గ నేతలు మోకాలడ్డటమే గొల్లపల్లి ఆశలకు గండికొట్టిందంటున్నారు. మంత్రి వర్గ విస్తరణలోనైనా గొల్లపల్లికి న్యాయం జరుగుతుందో, లేదో వేచి చూడాల్సిందే.