AP:టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి గుడ్‌ బై | Former AP Minister Gollapalli Resigned To TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి రాజీనామా.. కష్టపడితే అవమానించారని ఆవేదన

Published Wed, Feb 28 2024 11:55 AM | Last Updated on Wed, Feb 28 2024 4:24 PM

Former AP Minister Gollapalli Resigned To TDP - Sakshi

సాక్షి,తూర్పుగోదావరి: టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనమా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. 

కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని లేఖలో గొల్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో  సీటు ఇవ్వకుండా అవమానించారని తెలిపారు. ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన కలత చెందారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు టీడీపీ కేటాయించింది.

దీంతో ఇక టికెట్‌ రాదని గొల్లపల్లి పార్టీని వీడినట్లు తెలుస్తోంది. కాగా, భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన త్వరలో నిర్ణయం తీసుకునే చాన్స్‌ ఉంది. గొల్లపల్లి త్వరలో వైఎస్‌ఆర్‌సీపీలో జాయిన్‌ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇదీ చదవండి.. టీడీపీ జనసేన మధ్య తారాస్థాయికి సీటు హీట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement