సీఎం చంద్రబాబు మెప్పుకోసం ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నానా తంటాలు పడ్డారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ పేరిట ఆయన గంటకు పైగా తన వాచాలత్వాన్ని ప్రదర్శించారు.
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు మెప్పుకోసం ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నానా తంటాలు పడ్డారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ పేరిట ఆయన గం టకు పైగా తన వాచాలత్వాన్ని ప్రదర్శించారు. ప్రజా సమస్యలకు వేదిక కావాల్సిన అసెంబ్లీ ఆత్మస్థుతికి పరనిందకు వేదికగా సాగింది. ఇంతజరుగుతున్నా సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ కాగిత వెంకట్రావ్ ఎక్కడా వారించకపోగా ఎస్సీ సభ్యుడు మాట్లాడుతుంటే గొడవ చేస్తారా? అంటూ విపక్షాన్నే మందలించడం గమనార్హం. తనకిచ్చిన సమయం కన్నా అరగంట ఎక్కువగా మాట్లాడినా, సభలో వాడకూడని భాషను ఉపయోగిస్తున్నా ప్యానెల్ స్పీకర్ అభ్యంతరం చెప్పలేదు. తన 65 నిమిషాల ప్రసంగంలో గొల్లపల్లి సూర్యారావు దివంగత సీఎం వైఎస్‌ఆర్, జగన్ లక్ష్యంగా తన అక్కసు వెళ్లగక్కారు.