
'వైఎస్ఆర్ సీపీకి పనీ పాటా లేదు'
ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ రాజకీయ దురుద్దేశంతోనే సభను అడ్డుకుంటుందని ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మంగళవారం అసెంబ్లీలో ఆరోపించారు.
హైదరాబాద్: ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ రాజకీయ దురుద్దేశంతోనే సభను అడ్డుకుంటుందని ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మంగళవారం అసెంబ్లీలో ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీకి పనీ పాటా లేదని ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో సభను సజావుగా జరగనీయకుండా ఆ పార్టీ చూస్తుందని ఆమె విమర్శించారు.
విజభన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడమే కాకుండా వారి జీత భత్యాలు పెంపునకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే అంశంపై ఆలోచిస్తున్నారని పీతల సుజాత వెల్లడించారు.
నగరంలో తమ నిరసన తెలుపుతున్న అంగన్వాడీ ఉద్యోగులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అంశంపై అధికార పక్షాన్ని ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ సభ్యులు శాసనసభలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీపై మంత్రి పీతల సుజాత పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.