హైదరాబాద్ : విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. గరువారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పీతల సుజాత మాట్లాడుతూ... బాక్సైట్ తవ్వకాలు చేయడం లేదని తెలిపారు. బాక్సైట్ అనుమతులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవని ఆమె వెల్లడించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శుక్రవారానికి వాయిదా పడింది. అంతకుముందు కాల్ మనీ - సెక్స్ రాకెట్పై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని మండలి ఛైర్మన్ తిరస్కరించారు.