అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: సుజాత
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు తీర ప్రాంత గ్రామాల్లో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పీతల సుజాత వెల్లడించారు. హుదూద్ తుపాన్ నేపథ్యంలో శనివారం నర్సాపురం, మొగల్తూరు తీర ప్రాంత గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ... 14 ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తుపాన్ తీవ్రత నేపథ్యంలో అధికారులు సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.