rehabilitation centres
-
ఈనాడు బురద రాతలు.. వరద సహాయక చర్యలపైనా అక్కసు
సాక్షి, అమరావతి/ సాక్షి, పాడేరు: గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎంతో ముందుచూపుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పకడ్బందీగా వరద సహాయక చర్యలు చేపట్టడమే రామోజీరావు అక్కసుకు కారణమైంది. ఎలాంటి నష్టం జరగకుండా, ఏ లోటూ లేకుండా వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉండటం చూసి ఆయన తట్టుకోలేక కన్నీటి వరద కారుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ నిరంతర పర్యవేక్షణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం మొత్తం గోదావరి వరద బాధితులకు సహాయక చర్యల్లో నిమగ్నమైనా ఈనాడు మాత్రం అవి కనపడకుండా కళ్లు మూసుకొని, అధికార యంత్రాంగం మొద్దునిద్రలో ఉన్నట్లుగా భ్రమిస్తోంది. ఆ భ్రమలనే వార్తలుగా మలచి సీఎం వైఎస్ జగన్ పైన, ప్రభుత్వం పైన రకరకాల పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. వరదల సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను అప్రమత్తం చేశారు. జూలై 28వ తేదీన ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు ఆగమేఘాలపై తీసుకునేలా యంత్రాంగాన్ని నడిపించారు. చదవండి: ‘టీడీపీ కార్యాలయంలో జై జగన్ నినాదాలు’ గ్రామ వలంటీర్ నుంచి సచివాలయాల సిబ్బంది, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది వరద ప్రభావిత గ్రామాల్లోనే మకాం వేసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గత ప్రభుత్వంలోకంటె ఇప్పుడు ఎంతో మిన్నగా వరద సహాయక చర్యలు చేపట్టారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. చింతూరు పునరావాస కేంద్రంలో కూరగాయలు పంపిణీ చేస్తున్న సిబ్బంది 85 పునరావాస కేంద్రాలకు 49 వేల మంది తరలింపు వరద ప్రభావిత ఐదు జిల్లాల్లో 237 గ్రామాల్లోని 49,262 మందిని 85 పునరావాస కేంద్రాలకు తరలించారు. 10 లాంచీలు, 230 బోట్లతో బాధితుల్ని పెద్దఎత్తున తరలించే దృశ్యాలు అన్ని చోట్లా కనిపిస్తూనే ఉన్నాయి. పది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది ముంపు గ్రామాల్లో తిరుగుతూ అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించారు. తా గునీరు, నిత్యావసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. అవసరమైన వారికి వెంటనే వైద్యం అందించేందుకు వైద్య బృందాలను నియమించారు. బాధితులకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రతి క్షణం అందుబాటులో ఉంటున్నారు. బాధితులకు నిత్యావసరాలకు లోటు రాకుండా అన్ని రకాల సరకులని స్టాక్ పాయింట్లకు ముందే పంపించారు. ప్రతి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిలు ఇస్తున్నారు. ముందే రూ.12 కోట్లు విడుదల వరద సహాయక చర్యల కోసం సీఎం జగన్ 5 జిల్లాలకు తక్షణమే రూ.12 కోట్లు విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా వరదల సమయంలోనే ముందుగా నిధులు విడుదల చేయలేదు. చంద్రబాబు హయాంలో వరదలు వచ్చి, అంతా మునిగిపోయి ప్రజలు గగ్గోలు పెట్టిన తర్వాత అరకొరగా నిధులిచ్చేవారు. దీంతో జిల్లా కలెక్టర్లు రకరకాల ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సహాయక చర్యల ప్రారంభానికి ముందే నిధులిచ్చే సంప్రదాయానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వరద బాధితులకు అందించే ప్రత్యేక ఆర్తిక సాయం విషయంలోనూ సీఎం సరికొత్త రీతిలో ముందుకెళుతుండడం ఈనాడుకు మింగుడుపడడంలేదు. చంద్రబాబు హయాంలో ఈ ప్రత్యేక సాయం ఊసే ఉండేది కాదు. వరద తగ్గిన తర్వాత తెలుగు తమ్ముళ్లు బాధితులకు ఇచ్చినట్లు రాసేసుకుని ఆ సొమ్ముని మింగేసేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేకుండా వరద తగ్గిన తర్వాత బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు రూ.1,000 నుంచి రూ. 2,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు. గతంలో ఇది రూ.5 వేలు మాత్రమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవేమీ కనిపించని ఈనాడు ఈనాడు బృందం తిరిగినట్లుగా చెప్పుకొంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ చర్యలు విస్పష్టంగా కనిపిస్తున్నా, అక్కడ ఏదీ జరగనట్లే అబద్ధాలు రాసి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వరదలపై ముఖ్యమంత్రి ముందస్తుగా ఆదేశించిన వెంటనే జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ పర్యవేక్షణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టర్‌తో సహా అధికార యంత్రాంగం చింతూరులో మకాం వేసింది. వరదపై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. సిద్ధం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచింది. చింతూరు డివిజన్లోని నాలుగు మండలాల్లో 177 గ్రామాలు వరదలకు ప్రభావితమవగా 110 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 24,279 కుటుంబాలను తరలించింది. బాధితులకు సత్వర సాయం వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ప్రభుత్వం నాలుగు మండలాల్లో ముందుగానే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిత్యావసర సరకులను నిల్వ చేసింది. ముంపు ప్రాంతాల్లో జూలై, ఆగస్టు నెలల రేషన్‌ను ముందుగానే పంపిణీ చేసింది. నాలుగు మండలాల్లో సహాయక చర్యల నిమిత్తం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు సీఎం జగన్ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఎలాంటి నష్టం జరగకుండా నాలుగు మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టాం. ప్రతి మండలానికి ప్రత్యేకాధికారులను నియమించాం. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా తరలించి వారికి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశాం. గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాం. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించాం. గోదావరి, శబరి నదుల్లో వరద తగ్గడంతో ఆయా ముంపు గ్రామాల్లో సహాయక కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నాం. – సుమిత్‌కుమార్, కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా అన్ని విధాలుగా ఆదుకున్నారు పునరావాస కేంద్రంలో తలదాచుకున్న మాకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది. పక్కా భవనంలో విద్యుత్ సౌకర్యంతో పాటు నిత్యావసరాలు కొరత లేకుండా అందించింది. ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటూ మా బాగోగులు చూసుకున్నారు – కొండా సరోజిని, చింతూరు అన్ని సౌకర్యాలు కల్పించారు ఇంటి సమీపంలోకి వరద వస్తుండడంతో గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. తాగు నీటికి ఇబ్బంది లేదు. బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు అందించారు. – మాటూరి శ్రీనివాసరావు, చింతూరు శబరిఒడ్డు అధికారులు అప్రమత్తం చేశారు వరద సమాచారంపై అధికారులు మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించారు. అందరం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. – బొర్రా పద్మారెడ్డి, వడ్డిగూడెం, వీఆర్‌పురం మండలం అధికారుల స్పందన బాగుంది వరదల సమయంలో అధికారుల స్పందన బాగుంది. ప్రభుత్వం చేపట్టిన సహా యక కార్యక్రమాలతో అందరం సురక్షితంగా ఉన్నాం. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న మాకందరికీ నీరు, బియ్యం, పాలు సహా అన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. ఏ లోటూ రాకుండా చూస్తున్నారు. – యడ్ల బాయమ్మ, టేకులబోరు, కూనవరం మండలం -
వరద పోటెత్తడంతో తెరచుకున్న ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు
సాక్షి, విజయవాడ: కృష్ణవేణి ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన నదీమతల్లి.. నీటి చెమ్మ దొరకగా అల్లాడిన మాగాణులను సస్యశ్యామలం చేస్తూ బిరబిరా సముద్రుడి చెంతకు పరుగులు పెడుతోంది. పదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తడంతో బ్యారేజ్ 70 గేట్లు తొమ్మిదడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కరకట్ట ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అలాగే తోట్లవల్లూరు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మరోవైపు సాగర సంగమం వద్ద సముద్రపు పోటు ఉండటంతో హంసలదీవిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. నీట మునిగిన కంకిపాడు మండలం కాసరనేనివారిపాలెం పుష్కరఘాట్ శివాలయం కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద నీరు వస్తూ ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం ఉదయం 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా రాత్రి అయ్యే సరికి 5 లక్షల క్యూసెక్కులకు చేరింది. మరో 16 వేల క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. బ్యారేజ్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం.. ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టాన్ని ఉంచారు. ఆపై పులిచింతల ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు 5.16 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంటే.. బ్యారేజ్ 70 గేట్లు తొమ్మిది అడుగుల మేర ఎత్తి 5 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి.. మరో 16 వేల క్యూసెక్కులను కాలువలకు వదులుతున్నారు. రాత్రంగా ఇదే ప్రవాహం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. 46.5 టీఎంసీలు సముద్రంలోకి... ఈ సీజన్లో ఇప్పటి వరకు 46.5 టీఎంసీ వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ గుండా సముద్రంలోకి చేరాయి. గురువారం కూడా వరద నీటి ఉధృతి యథావిధిగా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కరకట్ట దిగువన కృష్ణానది వైపు ఉన్న పంట పొలాలు నీటమునిగాయి. ముఖ్యంగా తోట్లవల్లూరు మండలం పరిధిలోని పలు అరటి, బొప్పాయి తోటలు నీటిలో నానుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులు.. ముంపునకు గురైన పాములలంకకు పడవలో వెళ్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్ విజయవాడ కృష్ణలంక రణదీవె నగర్, భూపేష్‌నగర్ గుప్తా, తారాకరామానగర్, బాలాజీనగర్, రామలింగేశ్వరనగర్‌లు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇక్కడి నివాసులను అధికారులు రాణిగారితోట, కృష్ణలంక పొట్టిశ్రీరాములు హైస్కూల్, భ్రమరాంబపురంలో ఎస్వీ రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులు తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలిరావాలంటూ మైక్‌లలో ప్రచారం చేస్తున్నారు. పేదలు సురక్షిత ప్రాంతాలకు వచ్చినప్పుడు వారి ఇళ్లలోని వస్తువులు దొంగల పాలు కాకుండా పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ దిగువున ఉన్న తోట్లవల్లూరు ప్రాంతంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దశాబ్దకాలం తర్వాత.. దశాబ్దకాలంగా కృష్ణానదికి వరద నీరు సరిగా రావడం లేదు. 2009లో 10.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వదిలారు. ఆ తర్వాత ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వదలడం ఇదే తొలిసారి. ఏళ్లుగా సముద్రంలోకి వరద నీరు సక్రమంగా వెళ్లకపోవడంతో సముద్రం గర్భంలో నుంచి ఉప్పునీరు తోసుకువస్తోంది. దీంతో బందరుతో పాటు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పైనుంచి వస్తున్న వరద నీటిని సముద్రంలోకి చేరుతుండటంతో ఉప్పునీటి విస్తరణ తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద పరిస్థితి -
పునరావాసమే సవాల్!
తిరువనంతపురం/కొచ్చి: వర్షాలు తెరిపివ్వడంతో కేరళలో వరద ఉధృతి తగ్గినా కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. లక్షల మంది నిరాశ్రయులకు పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం సవాల్‌గా మారింది. తిండి, నీరు, తాత్కాలిక ఆశ్రయం కల్పించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం, అధికారుల ముందు అతిపెద్ద సమస్యగా నిలిచింది. వరదల కారణంగా మృతుల సంఖ్య 376కు చేరింది. 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది నిరాశ్రయులున్నారు. మరోవైపు, పలుప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే కార్యక్రమాలు సాగుతున్నాయని సదరన్ కమాండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ డీఆర్ సోనీ పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా ఇంకెవరు చిక్కుకుని ఉన్నారనే విషయం తెలుసుకుని.. ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘అందరినీ కాపాడి పూర్తి పునరావాసం కల్పించడంపైనే దృష్టిపెట్టాం’ అని ఆయన తెలిపారు. సహాయక బృందాలకు అవసరమైన కనీస సదుపాయాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు దాదాపుగా ముగిసినట్లేనని వైస్ అడ్మిరల్ గిరీశ్ లుథారా పేర్కొన్నారు. అక్కడక్కడ చిక్కుకుని ఉన్నవారిని గుర్తించామని వారిని కాపాడేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సహాయక చర్యలు ముమ్మరం ఇళ్లపైకప్పుల పైన, మిద్దెల పైన నిలబడి సాయం కోసం అర్థిస్తున్నారు. ఎవరైనా రాకపోతారా.. కాపాడకపోతారా అనే ఆశతో తిండితిప్పల్లేకుండా ఆశగా ఎదురుచూస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని శాటిలైట్ ఫోన్ల ద్వారా చేరుకుంటున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఎర్నాకులం జిల్లా పరూర్‌లో ఆదివారం రాత్రి ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీడీ సతీశన్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న దాదాపు అందరినీ క్షేమంగా పునరావాస కేంద్రాలకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లలో పేరుకుపోయిన బురద, రాళ్లురప్పలు తొలగించే పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నారు. నేవల్ ఎయిర్‌బేస్, కొచ్చి పోర్టు ద్వారా.. కొచ్చి నేవల్ ఎయిర్‌బేస్‌లో వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. బెంగళూరునుంచి సరుకులతో వచ్చిన విమానం సోమవారం ఉదయం ఎయిర్‌బేస్‌లో ల్యాండైంది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 26వరకు విమానాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో.. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాలనుంచి సహాయసామాగ్రి కోసం ఈ ఎయిర్‌బేస్‌నే వినియోగించనున్నారు. మరోవైపు, కేరళ పోర్టుకు కూడా వివిధ రాష్ట్రాలనుంచి సముద్రమార్గం ద్వారా సహాయ సామగ్రి రవాణా మొదలైంది. ముంబై నుంచి 800 టన్నుల స్వచ్ఛమైన నీరు, 18 టన్నుల సరుకుతో నేవల్షిప్ ఐఎన్ఎస్ దీపక్ చేరుకుందని కొచ్చి పోర్టు ట్రస్టు అధికారులు తెలిపారు. పోర్టునుంచే పునరావాస కేంద్రాలకు ట్రక్కుల్లో ఈ సామగ్రిని పంపిస్తున్నారు. మరోవైపు, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరో భారీ సరుకుల నౌక వల్లార్‌పదం పోర్టుకు చేరుకుంది. మరోవైపు, ముంబై నుంచి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన భారీ నౌకలో 50వేల మెట్రిక్ టన్నుల ఇంధనం కూడా కొచ్చి పోర్టుకు చేరుకుంది. సహాయక కార్యక్రమాలు, ట్రక్కుల కోసం భారీగా ఇంధనం అవసరమైన నేపథ్యంలో బీపీసీఎల్ ఈ నౌకను పంపించింది. అటు, తిరువనంతపురం, ఎర్నాకులం మధ్య రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ట్రయల్‌రన్ తర్వాత సహాయకసామగ్రిని తరలించేందుకు ఈ ట్రాక్ కీలకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు, తిరువనంతపురం నుంచి చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీలకు రైలు సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. సాయం అందుతోంది! వరదకోరల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.3కోట్లు, అస్సాం ప్రభుత్వం రూ.3కోట్ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించాయి. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. అటు, రూ.10 కోట్ల సాయం అందించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2,500 టన్నుల బియ్యాన్ని ప్రత్యేక రైల్లో కేరళకు పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 100 మెట్రిక్ టన్నుల ధాన్యాలు, 52 మెట్రిక్ టన్నుల అత్యవసర మందులను సోమవారం కేరళకు పంపించింది. దీంతోపాటుగా 2,600 మెగావాట్ల విద్యుత్‌ను అందించేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) కేరళలో వరద పరిస్థితి, అందుతున్న సాయంపై సమీక్ష నిర్వహించింది. తలచుకుంటేనే భయమేస్తోంది: బాధితులు అటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారు కూడా భవిష్యత్తును తలచుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరిగి ఇళ్లకు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్లుగగుర్పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వరదలకు ముందుపరిస్థితి నెలకొనడం ఎలాగనేదే పెద్ద సమస్యంటున్నారు. ‘మళ్లీ ఇళ్లకు వెళ్లాక మా పరిస్థితేంటో అర్థం కావడం లేదు. సర్వం నష్టపోయాం. మా ఇళ్లను కట్టుకునేందుకు తగినంత సాయంకావాలి’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పునరావాస కేంద్రాల్లోనూ పరిస్థితి ఒకేలా లేదు. చాలాచోట్ల కనీస వసతులు కూడా ఇంకా ఏర్పాటుచేయలేదు. ఎర్నాకులంలోని ఓ కేంద్రంలో ఓ చిన్నారికి తట్టు (చికెన్ పాక్స్) సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆ చిన్నారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రత్యేక ఏర్పాట్లతో చికిత్సనందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చల్లేందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్ కొరత కారణంగా మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. రండి.. కాపాడుకుందాం: కేంద్రం పిలుపు వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘విషాదకరమైన మానవత్వ సంక్షోభం’లో ఉన్న కేరళను ఆదుకునేందుకు తోచినంత సాయం చేయాలని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు విజ్ఞప్తి చేశారు. సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయదలచుకోవడం లేదని.. సహాయం చేయడం, చేసేవారిని కలుపుకుని వెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు, సీఐఐ, ఫిక్కీ వంటి వ్యాపార సంస్థలు తదితరులతో అధికారులు మాట్లాడుతున్నారన్నారు. అటు కేరళనుంచి వివిధ ప్రాంతాలకు విమానచార్జీలు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి స్పందిస్తూ.. విమానయాన కంపెనీలు మానవతాధృక్పథంతో వ్యవహరించాలన్నారు. అటు, కేరళ సాధారణస్థితికి చేరుకునేందుకు వందలు, వేల సంఖ్యలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు అవసరమని మరో కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. జాతీయవిపత్తుగా గుర్తించబోం: కేంద్రం న్యూఢిల్లీ: కేరళలో వరద విలయాన్ని తీవ్రమైన విపత్తుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ‘కేరళలో వరదల తీవ్రత, కొండచరియలు విరిగిపడిన ఘటనలను, జరిగిన అపార నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా గుర్తించాం’ అని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రకృతి ప్రకోపాన్ని అరుదైన/తీవ్రమైన విపత్తుగా గుర్తించినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో సహాయం అందుతుంది. ఎన్డీఆర్ఎఫ్ నిధి నుంచి అదనపు సాయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య 3:1 నిష్పత్తితో విపత్తు సహాయ నిధి (సీఆర్ఎఫ్)ను ఏర్పాటుచేస్తారు. ఈ నిధిలో డబ్బులు తగ్గినపుడు నేషనల్ కెలామిటీ కంటిన్జెన్సీఫండ్ (100%కేంద్ర నిధులు) నుంచి సాయం అందిస్తారు. తీవ్రమైన విపత్తు ప్రకటించిన ప్రాంతాల్లో బాధితుల రుణాల చెల్లింపులో వెసులుబాటు, కొత్త రుణాలు ఇచ్చే అవకాశాన్ని చూస్తారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించబోమని కేరళ హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం ఈ విషయం తెలిపింది. ‘కేరళ విపత్తు తీవ్రమైనది. జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనల ఆధారంగా దీన్ని లెవల్ 3 విపత్తుగా గుర్తించాం. ఎంత పెద్ద విపత్తు ఎదురైనా ఈ నిబంధనల ఆధారంగానే కేటగిరీలు నిర్ణయిస్తాం. కేరళ వరదల విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించబోవడం లేదు’ అని పేర్కొంది. తగ్గిన కర్ణాటక వరదలు కర్ణాటకలోని కొడగు జిల్లాలో నాలుగురోజులుగా బీభత్సం సృష్టించిన వరద తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో పర్యాటకుల బుకింగ్స్‌ను రద్దుచేసి నిరాశ్రయులకు గదులు కేటాయించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైన్యం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఒక్కో కుటుంబానికి రూ.3,800 చొప్పున మధ్యంతర సహాయం అందించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అలువా జిల్లాలో అంటువ్యాధులు సోకకుండా మందుల పంపిణీ కొచ్చి ఆడిటోరియంలో బాధితుల కోసం సహాయ సామగ్రిని సిద్ధం చేస్తున్న వాలంటీర్లు -
పునరావాస కేంద్రాల ఏర్పాటు
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్, తిరుమలాపూర్ గ్రామాల్లో శనివారం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తుజాల్పూర్లో 10 పూరిగుడిసెలు, 5 పెంకుటిల్లు కూలిపోయాయి. తిరుమలాపూర్లో చెరువు అలుగు నీరు ఇళ్లల్లోకి రావడంతో 15 కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. రెవెన్యూ అధికారులు తుజాల్‌పూర్‌లోని పాఠశాల, తిరుమలాపూర్ గ్రామ పంచాయతీలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి వంట చేసి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా... ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మాజీ మంత్రి సునీతారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు సంతోష్‌రెడ్డి సీడ్స్ ఆఫ్‌హోప్ సేవాస ంస్థ ద్వారా ఆహార పొట్లాలు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్, బెడ్షీట్లు అందజేశారు. రెండు రోజుల పాటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి పాలు, బిస్కెట్లు, బ్రెడ్, పులిహోర ప్యాకెట్లు అందేసినట్లు సీడ్స్ఆప్ హోప్ చైర్మన్ అమూల్య తెలిపారు. సునీతారెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న నాయకులు రెండు గ్రామాల ప్రజలను చూసిన దాఖలాలు లేవన్నారు. అధికారంలో ఉన్న నాయకులు చేయాల్సిన పని తాము చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ సర్పంచ్ రమణారావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అంజనేయులుగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ సర్పంచ్ అశోక్, రెడ్డిపల్లి సర్పంచ్ భరత్‌గౌడ్, బాబు, రాజేష్, ముజాయిద్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీడీ శ్రీధర్ మండలంలోని తిరుమలాపూర్, తుజాల్పూర్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్, తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రవణ్‌కుమార్ సూచించారు. ఆ గ్రామాలను వారు సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. తిరుమలాపూర్లో చెరువు ప్రమాదంగా ఉండటంతో కట్టకు ఒక వైపు కాలువ తవ్వించి నీటిని దారి మళ్లించారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి రెవెన్యూ సిబ్బంది భోజనంతో పాటు వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. -
అమ్మ ఒడి
వికలాంగుల ఆలనాపాలన చూస్తోన్న పునరావాస కేంద్రాలు రోజంతా ఆటపాటలు.. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతో మేలు ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి వరం ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేంద్రాలు ఊపిరి పీల్చుకుంటున్న నిరుపేద కుటుంబాలు మిరుదొడ్డి: వికలాంగుల పునరావాస కేంద్రాలు అమ్మ ఒడిని తలపిస్తున్నాయి. కన్నతల్లిదండ్రుల మాదిరిగా శారీరక, మానసిక వికలాంగుల ఆలనాపాలన చూస్తున్నాయి. మాటలు రాక కొందరు... కాళ్లు చేతులు పనిచేయక మరికొందరు.. పుట్టుకతో, పుట్టిన తర్వాత మరికొందరు... మానసిక, శారీరక వికలాంగులుగా మారుతున్నారు. తమ పనులు తాము చేసుకోలేని నిస్సహాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. ఇలాంటి వారి బాగోగులు చూసేందుకు ప్రభుత్వ నిర్వహణలో జిల్లాలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. తిండి మొదలుకొని ఆటలు పాటలతో కాలక్షేపాన్ని కల్పిస్తున్నాయి. స్పీచ్, ఫిజియో థెరపీలతో మార్పు కోసం కృషి చేస్తున్నాయి. వికలాంగులు సైతం ఈ కేంద్రాల్లో సందడి చేస్తున్నారు. రోజురోజుకూ వారిలో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రతినిధులు మిరుదొడ్డి కేంద్రాన్ని అధ్యయం చేసి ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని అక్కున చేర్చుకుంటున్నాయి వికలాంగుల పునరావాస కేంద్రాలు. వయస్సుతో నిమిత్తం లేకుండా శారీరక, మానసిక వికలాంగులైన వారిని చేర్చుకొని వారిలో మార్పు కోసం కృషిచేస్తున్నాయి. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లో వికలాంగులు ఉంటే కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరైనా అనుక్షణం వారిని కనిపెట్టుకుని ఉండాలి. ఫలితంగా వారికి ఉపాధి లేకుండా పోతుంది. రెక్కాడితో గాని డొక్కాడని కుటుంబాల్లో ఒకరు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కేటాయించడం వల్ల కుటుంబ నడిచే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారిని చేర్చుకుని వారి ఆలనా పాలన చూస్తున్నాయి పునరావాస కేంద్రాలు. ఐకేపీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాల ప్రభుత్వ ఖర్చుతో కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎనిమిది కేంద్రాలు సేవలందిస్తున్నాయి. వీరిలో గణనీయమైన మార్పు తీసుకొస్తున్నాయి. ఈ కేంద్రాల వల్ల ఎన్నో కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. జిల్లాలో ఎనిమిది కేంద్రాలు మానసికంగా, శారీరక వికలాంగుల్లో మార్పు తేవడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో 8 మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిరుదొడ్డి, న్యాల్కల్, నారాయణఖేడ్, నర్సాపూర్, కల్హేర్, జోగిపేట, మెదక్, కౌడిపల్లిలో పునరావాస కేంద్రాలు పని చేస్తున్నాయి. మానసిక, శారీరకంగా బాధపడుతున్న వికలాంగులను గుర్తించి పురావాస కేంద్రాల్లో చేర్చుకుంటారు. ఆయా కేంద్రాల్లో సుమారు 880 మంది చేరారు. ఏపీఎం పర్యవేక్షణలో పిల్లలు మానసిక పునరావాస కేంద్రంలో క్లస్టర్ కోఆర్డినేటర్, ఈఐసీఆర్పీ (ఎర్లీ ఇంటర్వెన్షన్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్), కార్యకర్త, ఆయా పని చేస్తారు. పునరావాస కేంద్రం పరిధిలోని ఆయా గ్రామాల్లో మూగ, చెవిటి, మానసిక, శారీరక వికలాంగులను గుర్తిస్తారు. సదరు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. వారి అనుమతితో సదరు పిల్లలను పునరావాస కేంద్రాల్లో చేర్పిస్తారు. ఐకేపీ ఏపీఎం పర్యవేక్షణలో సీసీ, కార్యకర్త, ఆయాలు వీరి బాగోగులు చూస్తారు. రాకపోకలకు ప్రత్యేక వాహనం ఈ కేంద్రాల్లో చేరిన వారిని వివిధ గ్రామాల నుంచి తీసుకురావడానికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. ఉదయం కేంద్రానికి తీసుకురావడం, సాయంత్రం తిరిగి అదే వాహనంలో ఇళ్లకు పంపిస్తారు. స్థానికులైతే వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్తారు. ఆకట్టుకునేలా శిక్షణ వివిధ ఆట వస్తువులు, వ్యాయామం చేసే పరికరాలు, అక్షర మాలలు, పండ్లు, కూరగాయల బొమ్మలు , చార్టులను అందుబాటులో ఉంచుతారు. మానసిక వికలాంగుల్లో మార్పు తేవడానికి ఆటపాటల ద్వారా శిక్షణ ఇస్తారు. ప్రతి అంశాన్ని గుర్తించేలా అవగాహన కల్పిస్తారు. వికలాంగులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగ పడే ప్రతి వస్తువును సెర్ప్ సమకూరుస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో అన్ని రకాల ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచింది. మానసిక వికలాంగులకు ఆత్మస్థైర్యం మానసిక వైకల్యంతో పుట్టిన వారికి పునరావాస కేంద్రం అపర సంజీవనిలా పనిచేస్తోంది. మానసిక వికలాంగుల్లో మార్పు తేవడానికి నెలలో రెండు సార్లు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ నిర్వహిస్తారు. ప్రతి కేంద్రాన్ని డీపీఎం (జిల్లా ప్రాజెక్టు మేనేజర్)తోపాటు ముగ్గురు ప్రొఫెషనల్ అధికారులు సందర్శిస్తారు. మిరుదొడ్డి కేంద్రం టాప్ మిరుదొడ్డిలో నిర్వహిస్తోన్న పునరావాస కేంద్రంలో సుమారు 78 మంది మానసిక, శారీరక వికలాంగులను గుర్తించగా ప్రస్తుతం 62 మంది శిక్షణ పొందుతున్నారు. జిల్లాలో అన్ని రకాలుగా సేవలను అందిస్తున్న కేంద్రంగా మంచి గుర్తింపు పొందింది. దీంతో జిల్లా అధికారులు దీన్ని అధ్యయన కేంద్రంగా గుర్తించారు. పలు రాష్ట్రాల ప్రతినిధుల అధ్యయనం మిరుదొడ్డి కేంద్రాన్ని నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల ప్రతినిధులు గత మార్చి, ఏప్రిల్ నెలల్లో సందర్శించారు. ఢిల్లీతోపాటు ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు వారు సందర్శించి అధ్యయనం చేశారు. ఇక్కడ వికలాంగులకు అందిస్తోన్న సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. మానసిక వికలాంగులను గుర్తిస్తున్నాం ఈ కేంద్రం పరిధిలోని ఆయా గ్రామాల్లో మానసిక వికలాంగులను గుర్తిస్తున్నాం. ఆ వెంటనే కేంద్రంలో చేర్పించి అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. మూగ, చెవిటి లోపం ఉన్న వారిని గుర్తించి హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆసుపత్రికి తరలిస్తాం. అక్కడి వీలైనంత వరకు చికిత్స అందేలా చూస్తాం. వారిలో మంచి మార్పు రావడానికి అన్ని రకాలుగా కష్టపడుతున్నాం. - కూరాకుల కవిత, ఈఐసీ రిసోర్స్ పర్సన్, ధర్మారం కంటికి రెప్పలా చూసుకుంటాం మానసికంగా, శారీరకంగా బాధపడుతున్న పిల్లలను పునరావాస కేంద్రంలో కంటికి రెప్పలా చూసుకుంటాం. ఆటపాటలతో మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాం. వస్తువులను గుర్తించడానికి అన్ని రకాల వస్తువులు అందిస్తాం. తినడానికి రాని వారికి తినిపిస్తాం. - యలగారి యశోద, కార్యకర్త, అల్వాల వికలాంగుల భవిష్యత్తుపై దృష్టి ఈ కేంద్రంలో ప్రతి వికలాంగుడికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. వికలాంగుల సంఘాలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం. ఒక్కో విలాంగుల గ్రూపులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. గ్రూపును బట్టి రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందిస్తున్నాం. దీంతో వికలాంగులకు ఉపాధి లభిస్తుంది. - మణెమ్మ, పునరావాస కేంద్రం మిరుదొడ్డి క్లస్టర్ కోఆర్డినేట పురావాస కేంద్రంతో మేలు పునరావాస కేంద్రంతో మాలాంటి వికలాంగులకు ఎంతో మేలు జరుగుతుంది. నడవలేని స్థితిలో ఉన్న నాకు ఫిజియోథెరపీ ఎంతగానో దోహదం చేసింది. ఈ మాత్రం నడవగలుగుతున్నానంటే పునరావాస కేంద్రంలో ఇచ్చిన శిక్షణ పుణ్యమే. - తుడుం కనకయ్య, వికలాంగుడు, లక్ష్మీనగర్ ప్రతి ఒక్కరిపై పర్యవేక్షణ పునరావాస కేంద్రంలో చేరిన అన్ని రకాల వికలాంగులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. వారికి ఏం కావాలో తెలుసుకొని అందిస్తున్నాం. మానసిక రుగ్మతలను గుర్తించి వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తున్నాం. పునరావాస కేంద్రాల్లో మెరుగుపడ్డ వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు చెప్పిస్తున్నాం. - కృష్ణారెడ్డి, ఐకేపీ ఏపీఎం, మిరుదొడ్డి ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యం మానసిక వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యంగా జిల్లాలో ఎనిమిది కేంద్రాలు పని చేస్తున్నాయి. మానసిక వికలాంగులున్న కుటుంబాలు వారి బాగోగులు చూసుకోవడానికే రోజంతా గడిచిపోతుంది. దీంతో ఏ పని చేసుకోకుండా సమయమంతా వారితోనే గడిచిపోతుంది. దీంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అలాంటి కుటుంబాల నిరుపేదలకు పునరావాస కేంద్రాలు ఎంతో దోహదం చేస్తాయి. వికలాంగులను కేంద్రాల్లో చేర్పిస్తే వారి బాగోగులను మేమే చూసుకుంటాం. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ద్వారా వారిలో మార్పు వచ్చేలా చూస్తున్నాం. - మోహన్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, సంగారెడ్డి -
నెల్లూరు జిల్లాలో 47 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో 47 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రులు పి.నారాయణ, శిద్దా రాఘవరావు తెలిపారు. బుధవారం మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని కైవల్యానది, పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మనుబోలు వద్ద చెన్నై - కోల్కత్తా జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో రెండో రోజు కూడా ఈ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నేడు కూడా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ జానకి సెలవు ప్రకటించారు. -
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: సుజాత
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు తీర ప్రాంత గ్రామాల్లో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పీతల సుజాత వెల్లడించారు. హుదూద్ తుపాన్ నేపథ్యంలో శనివారం నర్సాపురం, మొగల్తూరు తీర ప్రాంత గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ... 14 ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తుపాన్ తీవ్రత నేపథ్యంలో అధికారులు సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జిల్లాలో 125 పునరావాస కేంద్రాలు ఏర్పాటు: గంటా
విశాఖపట్నం: హదూద్ తుపాన్ నేపథ్యంలో విశాఖ జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో గంటా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు 125 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. తుపాన్ వల్ల ఎక్కడ ఎటువంటి ఆపద సంభవించిన వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. జిల్లాలో 11 మండలాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. నావీ, పోలీసుల సహాయం తీసుకుంటున్నామన్నారు. పరిస్థితులను బట్టి నెవీ బోట్లను ఉపయోగించుకుంటామన్నారు. తుపాన్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయని గుర్తు చేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి సోమవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశంముందన్నారు. విలేకరి ఎంసెట్ పై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కోర్టు తీర్పు ఆధారంగా ఎంసెట్ సెకెండ్ కౌన్సెలింగ్‌పై ముందుకెళ్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని గంటా తెలిపారు. -
భిక్షగాళ్ల వ్యవస్థను నిర్మూలించండి
-
'తెలంగాణలో భిక్షగాళ్ల వ్యవస్థను నిర్మూలించండి'
హైదరాబాద్ : తెలంగాణలో భిక్షగాళ్ల వ్యవస్థను నిర్మూలించాలంటూ డీవీరావు అనే వ్యక్తి శుక్రవారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. భిక్షగాళ్ల మాఫియా వల్ల ఏటా హైదరాబాద్‌లో రూ.140 కోట్ల టర్నోవర్ జరుగుతోందని ఆయన తన పిల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే 11వేలమంది యాచకులు ఉన్నారని, వారిని పునరావాస కేంద్రాల్లో ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్లో ప్రతివాదులుగా హోంశాఖ సెక్రటరీ, మహిళా శిశు సంక్షేమ శాఖను ఆయన చేర్చారు. -
ఒంగోలులో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బాలినేని
-
ఒంగోలులో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బాలినేని
భారీ వర్షాల కారణంగా ఒంగోలు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న బాధితులను ఆయన దగ్గర ఉండి పునరావాస కేంద్రాలకు తరలించారు. వారి కోసం భోజన ఏర్పాట్లు చేయవలసిందిగా బాలినేని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పునరావాసం కల్పిస్తామని ఆయన వర్షాల వల్ల నిరాశ్రయులైన వారికి హామీ ఇచ్చారు. భారీ వర్షాలతో సర్వం కొల్పోయిన బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని బాలినేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనకనమెట్ట మండలం వెదురురాళ్లపాడు గ్రామ సమీపంలోని వాగులో చిక్కుకున్న బస్సులో చిక్కుకున్న మగ్గురు ప్రయాణీకులను రక్షించిన అధికారులను బాలినేని ఈ సందర్భంగా అభినందించారు. అలాగే ఆ బస్సులో మిగత నలుగురు ప్రయాణికులను కూడా రక్షించాలని అధికారులను బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు.