
'తెలంగాణలో భిక్షగాళ్ల వ్యవస్థను నిర్మూలించండి'
హైదరాబాద్ : తెలంగాణలో భిక్షగాళ్ల వ్యవస్థను నిర్మూలించాలంటూ డీవీరావు అనే వ్యక్తి శుక్రవారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. భిక్షగాళ్ల మాఫియా వల్ల ఏటా హైదరాబాద్లో రూ.140 కోట్ల టర్నోవర్ జరుగుతోందని ఆయన తన పిల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్లోనే 11వేలమంది యాచకులు ఉన్నారని, వారిని పునరావాస కేంద్రాల్లో ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్లో ప్రతివాదులుగా హోంశాఖ సెక్రటరీ, మహిళా శిశు సంక్షేమ శాఖను ఆయన చేర్చారు.